Tetagitulu with
 
 
 
 
Book Release Event
 
   Subscribe To Slokas
  
     
 
  Introduction
  Home
  Foreword
  Prayer
  What is Tetagiti ?
  Commentaries
  Provide Feedback
 
శ్రీమద్భగవద్గీత
తేటగీతులలొ తెనుగుసేత
  by Late Dr. P.V. Satyanarayana Rao
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ:
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18
 
  1. ప్రధమాధ్యాయము : అర్జున విషాదయోగము
 
 1.  ధృతరాష్ట్రుఁడనెను:
  ధర్మ సుక్షేత్రమని, ధరా తలమునందు,
  కీర్తి బడసిన మన కురు క్షేత్రమందు
  కూడి, నా కుమారులు, పాండు కొమరులపుడు,
  సంజయా! యెట్లు సమరము సల్పుచుండ్రి
 Play This verse
 
 2.  సంజయుడనెను:
  అపుడు, పాండవ బలములనచట జూచె
  వ్యూహ మేర్పడియుండ దుర్యోధనుండు,
  కురుకులాచార్యు,ద్రోణునికూడజేరి,
  యిట్లనెను రాజు, ధృతరాష్ట్రనృపతి!వినుమ.
 
 
 3.  
  చూడుమాచార్య! యిచ్చట కూడియున్న
  పాండుపుత్రుల, మహనీయ బలములెల్ల,
  మీదు శిష్యుడు ద్రుపద భూ మీశు సుతుడు,
  వ్యూహముగ బన్నె బహుయుక్తి యుతుడు వాడు.
 
 
 4.  
  కలరు శూరులు, బలు విలు కాండ్రు నచట
  ఆలమందున సములు, భీ మార్జునులకు,
  వాడె సాత్యకి, విరట భూ పాలుడాత,
  డతడె ద్రుపదరాజన్య మ హారథుండు.
 
 
 5.  
  చేకితానుండతడు, వాడె చేది విభుడు,
  వీర్యవంతుడు, కాశి భూ విభు డతండు,
  పురుజితుడు వీ, డచట కుంతి భోజుడుండె,
  శైబ్య నరపుంగవుడు, వారి సమితి గలడు.
 
 
 6.  
  కను డతని, యుధామన్యు, వి క్రాంతు నచట,
  శూరు డందులో నుత్తమౌ జుండు గలడు,
  వారె ద్రౌపదీ సుతులు, సౌ భద్రుడతడు,
  వీరలెల్ల మహారథ వీరు లచట.
 
 
 7.  
  ప్రముఖు లెవ్వారలో మన బలమునందు,
  ద్విజ కులోత్తమ! వారి నే దెలియ బఱతు,
  నాదు సైన్యమునకు మహా నాయకులను
  గుర్తుకై వారి పేర్లు వా క్రుత్తు మీకు.
 
 
 8.  
  కలరు మీరలు, భీష్ముడుకర్ణు డుండె,
  సమితి జయశీలి, మన కృపాచార్యు డుండె,
  ద్రౌణియు,వికర్ణుడును, సౌమదత్తి గలడు,
  సైంధవుండును గలడు, నాసైన్యమందు.
 
 
 9.  
  మద్గతప్రాణ చిత్తులైమామకీన
  గుణము లన్యోన్యముగ జెప్పుకొనుచు నుండి,
  సతత సంకీర్తనము నన్నుసలుపువారు,
  ఆత్మరతిదేలి సంతుష్టిననుభవింత్రు.
 
 
 10.  
  మనది భీష్మాది రక్షితమైన యిచటి
  బల మపర్యాప్తముగనె,కన్పట్టుచుండె,
  కాని భీమాభిరక్షితమైన వారి
  బలము పర్యాప్తముగను కన్పట్టుచుండె.
 
 
 11.  
  చెలువు మీఱగ మీరు మీనెలవు లందు
  వ్యూహమార్గములన్ని కాపుండి విడక,
  మీరు మనవార లందఱుమెఱపు గొలుప,
  కంటికిని ఱెప్పవలె భీష్ముగావ వలయు.
 
 
 12.  
  అంత, మన సుయోధనునకుహర్ష మొదవ,
  తాత,కురువృద్ధు, డతుల ప్రతాపశాలి,
  సింహనాదము నెత్తునజేసి వేగ,
  శంఖ మొత్తెను దివి భూరిశబ్ద మెసగ.
 
 
 13.  
  అపుడు, శంఖములును, ఢక్క లానకములు,
  కొమ్ము లుడుకలు, భేరులు గోముఖములు,
  నొక్కమాఱుగ మ్రోయింప దిక్కులన్ని,
  సంకులముగాగ మ్రోగె నా శబ్దమునకు.
 
 
 14.  
  అపుడు, శ్వేతాశ్వయుత మహా స్యందనమున
  నొప్పు మీఱగ గూర్చుండి యున్నవారు,
  మాధవుండును, పాండవ మధ్యముండు,
  దివ్య శంఖము లూదిరి దిశలు మ్రోయ.
 
 
 15.  
  కెరలి, పాంచజన్యము, హృషీ కేసుడొత్తె,
  ఎత్తునను దేవదత్తము నొత్తె క్రీడి,
  పౌండ్రమను మహాశంఖము బట్టి యూదె
  ఘోర కర్ముండు వాడు, వృ కోదరుండు.
 
 
 16.  
  కుంతి పుత్రుడు, ధర్మరా జంతలోన
  బిట్టునూదె, దనయనంత విజయమెత్తి
  నకుల సహదేవులూదిరి నభము మ్రోయ
  కరముల సుఘోష మణిపుష్ప కముల బట్టి.
 
 
 17.  
  కార్ముక విశారదుండైన కాశిరాజు,
  రణమునందజేయుడు మహా రథి శిఖండి
  విరట భూపతి, ద్రుపద భూ విభుని సుతుడు
  నాజి నపరాజితుండు సా త్యకియు మఱియు;
 
 
 18.  
  బాహుబలశాలియైన సుభద్రసుతుడు
  ద్రౌపదేయులు ద్రుపద భూధవుడు నంద
  ఱన్ని దిక్కుల నుండియునవని నాథ!
  తవిలి తమ తమ శంఖముల్తడయకొత్త;
 
 
 19.  
  భూరి శంఖారవము, కురు భూమి నిండె,
  మన్ను మిన్నేకమై దిశల్ మాఱు మ్రోగె,
  సంకులంబైన యాఘోర శబ్ద మెసగె,
  ధార్తరాష్ట్రుల హృదయ వి దారకముగ.
 
 
 20.  
  అంత, యుద్ధసన్నద్ధులైయచట నున్న
  ధార్తరాష్ట్రుల, నా కపిద్వజుడు చూచె,
  శస్త్ర సంపాత సమయ మాసన్న మగుట,
  సరగ ధనువును పైకెత్తిస్యందనమున;
 
 
 21.  
  పార్థుడా హృషీకేశునువైపు జూచి
  యిట్లు మాటడె, ధృతరాష్ట్రనృపతి!వినుమ.
  ఆపు మచ్యుతా! నారథ మాపు మచట
  నుభయ సేనల, నడువీధి నుండునట్లు;
 
 
 22.  
  ఒప్పుగా నిట్టి ఘోర ర ణోద్యమమున
  నెవరితో నేను శరముల నెదురవలెనొ,
  యుద్ధకామను లిట నెవ రున్నవారొ,
  వారి నందఱ జూడగా వలయు నేను.
 
 
 23.  
  కుత్సితుండైన ధృతరాష్ట్రు కొమరునకును
  యుద్ధమందున సంప్రియ మొనర జేయ
  నెవరు సమకూడి యుండిరో యిప్పు డిచట
  చూతు వారల యుద్ధ కా మాతురులను.
 
 
 24.  
  ఆ గుడాకేశు, డాశత్రు హంతకుండు,
  ఇట్లు కోరగ విని హృషీ కేశు డప్పు
  డుభయ సేనల మధ్యమం దుండునట్లు
  తళ్కులొత్తెడు నారథో త్తమము బఱపి;
 
 
 25.  
  భీష్మకుంభజులును, కురు వీరులందు
  ముఖ్యులౌ భూపు లందఱ మ్రోల నిలిపి,
  "ఇందు గూడిన కురుజన బాంధవులను
  జూడు మర్జునా!" యంచు న చ్యుతుడు పల్కె
 Play This verse
 
 26.  
  పార్ధు డా రథమందుండి పాఱ జూచె,
  తండ్రులను తాతలను, తన తండ్రివంటి
  గురువులను, మేనమామల కూర్మి సఖుల
  భ్రాతలను, పుత్ర, పౌత్రాది బంధు జనుల
 
 
 27.  
  మామలను, బాల్యమిత్రుల మఱియు నచట
  నుభయ సేనల యందున నున్నవారి,
  సమర యోధుల తనబంధు సఖులనెల్ల
  దేఱ పరికించి చూచి కౌం తేయు డపుడు;
 
 
 28.  
  పరమ కృప మానసంబున బైకొనంగ,
  బల్కె నిట్టుల బహుఖిన్న వదనుడగుచు,
  యుద్ధ కామనులై కూడి యున్న యిచటి
  కృష్ణ! స్వజనము నే సమీ క్షించి చూడ;
 
 
 29.  
  పట్టుదప్పెను నాదు స ర్వాంగకములు,
  తాప మయ్యెను, నోరెండి దప్పి గలిగె,
  కంపమొందె శరీరము కదల జాల,
  గగురు పాఱెను మేనెల్ల ఘర్మ మొదవె;
 
 
 30.  అర్జునుడనెను:
  కరము నందుండి జాఱు నా గాండివంబు,
  దేహ మంతయు మంటల దేలు చుండె,
  మఱియు నా మనసు భ్రమించు మాడ్కి నుండె
  నిలువ జాలను తిరముగా నేను కృష్ణ!
 Play This verse
 
 31.  
  అచ్యుతా! నాకు నెంతయు నశుభమైన
  దుర్నిమిత్తము లెన్నియో తోచుచుండె,
  సమరమందున స్వజనము జంప మేము
  కనెడు మేలొక్కటేనియుగలదె యెందు?
 Play This verse
 
 32.  
  కృష్ణ! యుద్ధవిజయము కాం క్షింప నేను
  వలదు రాజ్యము, గీజ్యము, వలదు సుఖము,
  ఏల గోవింద! యీరాజ్య మేల మాకు?
  భోగమయమైన బ్రతుకుల పోక లేల?
 
 
 33.  
  రాజ్యసుఖములు భొగానురాగములును
  కోరియుంటిమొ, యెవరి మే ల్కొఱకు మేము,
  వారె రణమందు మ్రోలను న్నారు మనకు,
  ప్రాణ ధనముల వీడ పా ల్పడియుగూడ.
 
 
 34.  
  గురువరేణ్యులు, తండ్రులు కొమరులుండ్రి
  తాతలును గూడ నుండిరి తఱచి చూడ,
  మామలును, మేనమామలు మనుమలుండ్రి
  బావమఱదులు, సఖులును బంధుజనులు;
 
 
 35.  
  వారె నను జంప తలపడు వారలైన,
  మాధవా! వారి జంప నా మనసు రాదు,
  కూల్ప త్రైలోక్య రాజ్యము కొఱకు గూడ
  అనతి భూరాజ్య మిక హేతు వగునె చంప?
 
 
 36.  
  ధార్తరాష్ట్రుల నాజి నం దఱ వధింప,
  నెట్టి ప్రియములు సమకూరు కృష్ణ! మాకు,
  ఆతతాయుల జంపనౌ నైన గాని,
  పాపమే వచ్చు వారి జం పంగ మాకు.
 
 
 37.  
  పరగ ధృతరాష్ట్రుసుతుల, స్వబంధుజనుల,
  పట్టి చంపగ మాకిది పాడి గాదు
  స్వజనమునె పట్టి వధియింప సమరమందు
  మాధవా! యెట్టి సుఖములు మాకు గలుగు?
 
 
 38.  
  అనఘ! లోభోపహతచిత్తు లగుట జేసి,
  కులవినాశముచే గల్గు కలుచ గాని,
  బంధుమిత్రాది విద్రోహ పాపమైన,
  కనగజాలని వారైన గానివారు;
 
 
 39.  
  వంశ విక్షయకరమైన పాపములను
  ఓ జనార్దన! చూచుచు నుండి కూడ,
  ఏల మనమైన తెలియరా దిప్పుడైన,
  దోషములు వీని నుండివై తొలగి చనగ.
 
 
 40.  
  కలహకారణమున కుల క్షయము గలుగు
  దాన జెడు సనాతనకుల ధర్మములును,
  అట్టి కులధర్మములు నష్ట మైన కృష్ణ!
  కులము నంత నధర్మము కొల్ల వెట్టు
 
 
 41.  
  అట్లధర్మము కులముల నాక్రమింప
  కృష్ణ! చెడుదురు మనకుల ! స్త్రీలుగూడ,
  స్త్రీజనములట్లు కులటలై తిరుగుచున్న,
  వర్ణసంకరమగుగాదె వాసుదేవ?
 
 
 42.  
  కులమునకుగాని, యీ కుల ఘ్నులకుగాని,
  నరకమే గతి వర్ణసం కరము వలన,
  పతితులగుదురు వారల పితరులెల్ల
  పిండ తర్పణములు విలో పించుగాన.
 
 
 43.  
  ఇట్టి కులవినాశకుల దు ష్కృత్యములను,
  కలుగు జాతికి వర్ణ సం కరము గాన,
  జాతి, కుల, వర్ణములకు సం స్థానమైన
  శాశ్వతంబైన ధర్మముల్ సమసిపోవు.
 
 
 44.  
  కులధర్మములన్నియున్ కోలుపడిన
  మనుజసంతతి కెల్ల ని మ్మహిని కృష్ణ,
  నిత్యవాసము నరకమే నియతగతిగ,
  కలుగునని చెప్ప వింటిమికాదెమనము.
 
 
 45.  
  రాజ్యసుఖముల లోభ కా రణము వలన
  చంప సమకట్టి యుంటిమి స్వజనములను,
  అయ్యయో! మనమెంత దు రాశ చేత
  ఘోరపాపమునకు దొర కొంటిమయ్య!
 
 
 46.  
  మార్గణంబుల బూన, నే మారుకొనను,
  శస్త్రపాణులునై వారు సమరమందు
  ధార్తరాష్ట్రులు నను బరి ! మార్తురేని,
  అదియె, నాపట్ల మిగుల మే లౌను కాదె?
 
 
 47.  
  అట్లు మాటాడుచును సమ రాంగణమున,
  దుఃఖసంవిగ్న చిత్తుడై తూలిపడుచు,
  సశర గాండీవ మందు చేజార విడిచి,
  చదికిలంబడె రథమందు సవ్యసాచి!
 Play This verse
 
 
 1.  ధృతరాష్ట్ర ఉవాచ:
  ధర్మక్షేత్రే కురుక్షేత్రే
  సమవేతా యుయుత్సవః
  మామకాః పాణ్డవాశ్చైవ
  కిమకుర్వత సంజయ
 
 
 2.  సంజయ ఉవాచ:
  దృష్ట్వా తు పాణ్డవానీకం
  వ్యూఢం దుర్యోధనస్తదా
  ఆచార్యముపసంగమ్య
  దృష్ట్వా తు పాణ్డవానీకం
 
 
 3.  
  పశ్యైతాం పాణ్డుపుత్రాణా
  మాచార్య మహతీం చమూమ్
  వ్యూఢాం ద్రుపదపుత్రేణ
  తవ శిష్యేణ ధీమతా
 
 
 4.  
  అత్ర శూరా మహేష్వాసా
  భీమార్జునసమా యుధి
  యుయుధానో విరాటశ్చ
  ద్రుపదశ్చ మహారథః
 
 
 5.  
  ధృష్టకేతుశ్చేకితానః
  కాశిరాజశ్చ వీర్యవాన్
  పురుజిత్కున్తిభోజశ్చ
  శైబ్యశ్చ నరపుఙ్గవః
 
 
 6.  
  యుధామన్యుశ్చ విక్రాన్త
  ఉత్తమౌజాశ్చ వీర్యవాన్
  సౌభద్రో ద్రౌపదేయాశ్చ
  సర్వ ఏవ మహారథాః
 
 
 7.  
  అస్మాకం తు విశిష్టా యే
  తాన్నిబోధ ద్విజోత్తమ
  నాయకా మమ సైన్యస్య
  సంజ్ఞార్థం తాన్బ్రవీమి తే
 
 
 8.  
  భవాన్భీష్మశ్చ కర్ణశ్చ
  కృపశ్చ సమితింజయః
  అశ్వత్థామా వికర్ణశ్చ
  సౌమదత్తిస్తథైవ చ
 
 
 9.  
  అన్యే చ బహవః శూరా
  మదర్థే త్యక్తజీవితాః
  నానాశస్త్రప్రహరణాః
  సర్వే యుద్ధవిశారదాః
 
 
 10.  
  అపర్యాప్తం తదస్మాకం
  బలం భీష్మాభిరక్షితమ్
  పర్యాప్తం త్విదమేతేషాం
  బలం భీమాభిరక్షితమ్ ౦
 
 
 11.  
  అయనేషు చ సర్వేషు
  యథాభాగమవస్థితాః
  భీష్మమేవాభిరక్షన్తు
  భవన్తః సర్వ ఏవ హి
 
 
 12.  
  తస్య సంజనయన్హర్షం
  కురువృద్ధః పితామహః
  సింహనాదం వినద్యోచ్చైః
  శఙ్ఖం దధ్మౌ ప్రతాపవాన్
 
 
 13.  
  తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ
  పణవానకగోముఖాః
  సహసైవాభ్యహన్యన్త
  స శబ్దస్తుములోఽభవత్
 
 
 14.  
  తతః శ్వేతైర్హయైర్యుక్తే
  మహతి స్యన్దనే స్థితౌ
  మాధవః పాణ్డవశ్చైవ
  దివ్యౌ శఙ్ఖౌ ప్రదధ్మతుః
 
 
 15.  
  పాఞ్చజన్యం హృషీకేశో
  దేవదత్తం ధనఞ్జయః
  పౌణ్డ్రం దధ్మౌ మహాశఙ్ఖం
  భీమకర్మా వృకోదరః
 
 
 16.  
  అనన్తవిజయం రాజా
  కున్తీపుత్రో యుధిష్ఠిరః
  నకులః సహదేవశ్చ
  సుఘోషమణిపుష్పకౌ
 
 
 17.  
  కాశ్యశ్చ పరమేష్వాసః
  శిఖణ్డీ చ మహారథః
  ధృష్టద్యుమ్నో విరాటశ్చ
  సాత్యకిశ్చాపరాజితః
 
 
 18.  
  ద్రుపదో ద్రౌపదేయాశ్చ
  సర్వశః పృథివీపతే
  సౌభద్రశ్చ మహాబాహుః
  శఙ్ఖాన్దధ్ముః పృథక్పృథక్
 
 
 19.  
  స ఘోషో ధార్తరాష్ట్రాణాం
  హృదయాని వ్యదారయత్
  నభశ్చ పృథివీం చైవ
  తుములో వ్యనునాదయన్
 
 
 20.  
  అథ వ్యవస్థితాన్దృష్ట్వా
  ధార్తరాష్ట్రాన్కపిధ్వజః
  ప్రవృత్తే శస్త్రసంపాతే
  ధనురుద్యమ్య పాణ్డవః
 
 
 21.  
  హృషీకేశం తదా వాక్య
  మిదమాహ మహీపతే
  సేనయోరుభయోర్మధ్యే
  రథం స్థాపయ మేఽచ్యుత
 
 
 22.  
  యావదేతాన్నిరిక్షేఽహం
  యోద్‌ధుకామానవస్థితాన్
  కైర్మయా సహ యోద్ధవ్య
  మస్మిన్ రణసముద్యమే
 
 
 23.  
  యోత్స్యమానానవేక్షేఽహం
  య ఏతేఽత్ర సమాగతాః
  ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే
  ర్యుద్ధే ప్రియచికీర్షవః
 
 
 24.  
  ఏవముక్తో హృషీకేశో
  గుడాకేశేన భారత
  సేనయోరుభయోర్మధ్యే
  స్థాపయిత్వా రథోత్తమమ్
 
 
 25.  
  భీష్మద్రోణప్రముఖతః
  సర్వేషాం చ మహీక్షితామ్
  ఉవాచ పార్థ పశ్యైతా
  న్సమవేతాన్కురూనితి
 
 
 26.  
  తత్రాపశ్యత్స్థితాన్పార్థః
  పితౄనథ పితామహాన్
  ఆచార్యాన్మాతులాన్భ్రాతౄ
  న్పుత్రాన్పౌత్రాన్సఖీంస్తథా
 
 
 27.  
  శ్వశురాన్సుహృదశ్చైవ
  సేనయోరుభయోరపి
  తాన్సమీక్ష్య స కౌన్తేయః
   సర్వాన్బన్ధూనవస్థితాన్
 
 
 28.  
  కృపయా పరయావిష్టో
  విషీదన్నిదమబ్రవీత్
  దృష్ట్వేమం స్వజనం కృష్ణ
  యుయుత్సుం సముపస్థితమ్
 
 
 29.  
  సీదన్తి మమ గాత్రాణి
  ముఖం చ పరిశుష్యతి
  వేపథుశ్చ శరీరే మే
  రోమహర్షశ్చ జాయతే ౯
 
 
 30.  అర్జున ఉవాచ:
  గాణ్డీవం స్రంసతే హస్తా
  త్త్వక్చైవ పరిదహ్యతే
  న చ శక్నోమ్యవస్థాతుం
  భ్రమతీవ చ మే మనః
 
 
 31.  
  నిమిత్తాని చ పశ్యామి
  విపరీతాని కేశవ
  న చ శ్రేయోఽనుపశ్యామి
  హత్వా స్వజనమాహవే
 
 
 32.  
  న కాఙ్క్షే విజయం కృష్ణ
  న చ రాజ్యం సుఖాని చ
  కిం నో రాజ్యేన గోవిన్ద
  కిం భోగైర్జీవితేన వా
 Play This verse
 
 33.  
  యేషామర్థే కాఙ్క్షితం నో
  రాజ్యం భోగాః సుఖాని చ
  త ఇమేఽవస్థితా యుద్ధే
  ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ
 
 
 34.  
  ఆచార్యాః పితరః పుత్రా
  స్తథైవ చ పితామహాః
  మాతులాః శ్వశురాః పౌత్రాః
  శ్యాలాః సంబన్ధినస్తథా
 
 
 35.  
  ఏతాన్న హన్తుమిచ్ఛామి
  ఘ్నతోఽపి మధుసూదన
  అపి త్రైలోక్యరాజ్యస్య
  హేతోః కిం ను మహీకృతే
 
 
 36.  
  నిహత్య ధార్తరాష్ట్రాన్నః
  కా ప్రీతిః స్యాజ్జనార్దన
  పాపమేవాశ్రయేదస్మా
  న్హత్వైతానాతతాయినః
 
 
 37.  
  తస్మాన్నార్హా వయం హన్తుం
  ధార్తరాష్ట్రాన్స్వబాన్ధవాన్
  స్వజనం హి కథం హత్వా
  సుఖినః స్యామ మాధవ
 
 
 38.  
  యద్యప్యేతే న పశ్యన్తి
  లోభోపహతచేతసః
  కులక్షయకృతం దోషం
  మిత్రద్రోహే చ పాతకమ్
 
 
 39.  
  కథం న జ్ఞేయమస్మాభిః
  పాపాదస్మాన్నివర్తితుమ్
  కులక్షయకృతం దోషం
  ప్రపశ్యద్భిర్జనార్దన ౯
 
 
 40.  
  కులక్షయే ప్రణశ్యన్తి
  కులధర్మాః సనాతనాః
  ధర్మే నష్టే కులం కృత్స్న
  మధర్మోఽభిభవత్యుత ౦
 
 
 41.  
  అధర్మాభిభవాత్కృష్ణ
  ప్రదుష్యన్తి కులస్త్రియః
  స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ
  జాయతే వర్ణసంకరః
 
 
 42.  
  సంకరో నరకాయైవ
  కులఘ్నానాం కులస్య చ
  పతన్తి పితరో హ్యేషాం
  లుప్తపిణ్డోదకక్రియాః
 
 
 43.  
  దోషైరేతైః కులఘ్నానాం
  వర్ణసంకరకారకైః
  ఉత్సాద్యన్తే జాతిధర్మాః
  కులధర్మాశ్చ శాశ్వతాః
 
 
 44.  
  ఉత్సన్నకులధర్మాణాం
  మనుష్యాణాం జనార్దన
  నరకేఽనియతం వాసో
  భవతీత్యనుశుశ్రుమ
 
 
 45.  
  అహో బత మహత్పాపం
  కర్తుం వ్యవసితా వయమ్
  యద్రాజ్యసుఖలోభేన
  హన్తుం స్వజనముద్యతాః
 
 
 46.  
  యది మామప్రతీకార
  మశస్త్రం శస్త్రపాణయః
  ధార్తరాష్ట్రా రణే హన్యు
  స్తన్మే క్షేమతరం భవేత్
 
 
 47.  
  ఏవముక్త్వార్జునః సంఖ్యే
  రథోపస్థ ఉపావిశత్
  విసృజ్య సశరం చాపం
  శోకసంవిగ్నమానసః
 
 
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18