Tetagitulu with
 
 
 
 
Book Release Event
 
   Subscribe To Slokas
  
     
 
  Introduction
  Home
  Foreword
  Prayer
  What is Tetagiti ?
  Commentaries
  Provide Feedback
 
శ్రీమద్భగవద్గీత
తేటగీతులలొ తెనుగుసేత
  by Late Dr. P.V. Satyanarayana Rao
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ:
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18
 
  10. దశమాధ్యాయము : విభూతియోగము
 
 1.  శ్రీ భగవానుడనెను:
  అర్జునా! యిది మరల నీవాలకింపు
  పరమ తత్త్వము గూర్చి నాప్రవచనమును,
  ప్రీతి తోడను నామాటవినెదు గాన,
  మదిని నీ హితమెంచి చెప్పుదును దీని.
 
 
 2.  
  సురగణము గాని మఱిమహర్షులును గాని,
  ఎట్టిరును గూడ, నాపుట్టువెఱుగ లేరు
  ఋషిగణమునకు, దేవతలెల్లరకును,
  అన్ని విధముల నేనాదినగుట జేసి.
 
 
 3.  
  ఆదిరహితుడ నంచు, నేనజుడ నంచు,
  ఎవ్వడెఱుగునొ, సర్వలోకేశు నన్ను,
  మర్త్యు లం దతడు, విమూఢమతుడు గాక,
  సర్వపాప విముక్తుడైచనుచు నుండు.
 
 
 4.  
  బుద్ధియును, జ్ఞానమును, నసమ్మోహనమును,
  క్షమయు సత్యము, దమమునుశమము మఱియు,
  జన్మమృత్యువు, సుఖదుఃఖసంఘములును,
  భయము,నభయము,మొదలగుద్వంద్వములును.
 
 
 5.  
  తుష్టియు, నహింస, సమభావదృష్టియుంట,
  తపము, దానము, యశమునునపయశంబు,
  బహువిధములైన భూత భావంబు లెల్ల,
  ప్రభవ మొందునునానుండెబయలు మెఱసి.
 
 
 6.  
  సనక ముఖ్యులు నల్వురున్సప్తఋషులు,
  మాన్యులౌ పదునల్వురుమనువు లట్లె,
  మన్మనోబల సంకల్పజన్ము లగుట,
  వారి సంతాన మీ లోక వాసులైరి
 
 
 7.  
  నా విభూతులు యోగప్రభావములును,
  ఎవ్వడు యథార్థముగ మదినెఱుగ గలడొ,
  అతడు నిశ్చలుడై యోగమందు నిలుచు,
  లేదు సందియ మిందునలేశ మైన.
 
 
 8.  
  సర్వజగతికి, నుద్భవస్థాన మేను,
  వెడలు సర్వము నానుండివిస్తరించి,
  ఇట్లు మది నన్ను పండితులెఱిగి యుండి,
  భక్తి భజియింత్రు పరమార్థభావ నిరతి.
 
 
 9.  
  మద్గతప్రాణ చిత్తులైమామకీన
  గుణము లన్యోన్యముగ జెప్పుకొనుచు నుండి,
  సతత సంకీర్తనము నన్నుసలుపువారు,
  ఆత్మరతిదేలి సంతుష్టిననుభవింత్రు.
 
 
 10.  
  నిత్య మెవ్వరు నన్నేకనిష్ఠ తోడ,
  భక్తి సేవింతురో ప్రీతిభావ మెసగ,
  వారి కా బుద్ధియోగ మేర్పడగ నిత్తు,
  చేరుకొన నట్టియోగముచేత నన్ను.
 Play This Verse
 
 11.  
  కేవలము భక్తు లందలికృపను జేసి
  వారి యజ్ఞాన జన్యాంధకార మెల్ల,
  వారి హృది నేను నెలకొని వమ్ము సేతు,
  భాసురంబగు జ్ఞాన దీపంబు చేత.
 Play This Verse
 
 12.  అర్జునుడనెను:
  పరమధాముడవును, పరంబ్రహ్మ మీవు,
  పరమపావనుడవు, శ్రేష్ఠపదము నీవు,
  దివ్య పురుషుడ వీవాదిదేవుడవును,
  విశ్వ విభుడవు, నజుడవుశాశ్వతుడవు.
 
 
 13.  
  ఇట్లు నిను గూర్చి ఋషి సంఘమెఱుక జెప్పె,
  దేవ ఋషి నారదుం డట్లెతెలియ జేసె,
  అసిత దేవల వ్యాసులునట్లె యనిరి,
  నీవె స్వయముగా జెప్పుచున్నావు నేడు.
 
 
 14.  
  ఎట్టి యుపదేశ మీవు నాకిచ్చు చుంటి
  వదియు సర్వము నే నిజమని దలంతు,
  నీ విభూతి స్వరూపముల్నీరజాక్ష!
  దేవతలు దానవులు కూడ తెలియ లేరు.
 
 
 15.  
  నీవె స్వయముగా నెఱుగుదునిన్ను గూర్చి,
  తెలియ జాలారు నొరులిట్లుదేవ దేవ!
  భూతభావన!భూతేశ!భూతనాథ!
  ఓ జగత్పతి! ఓ పురుషోత్తమాఖ్య.
 
 
 16.  
  ఏ విభూతులు జేపట్టియెల్ల నిండి,
  వ్యాప్తమైయుంటి లోకములన్ని నీవె,
  దివ్య మౌ నీ విభూతులుతెలియ నాకు
  చెప్ప నర్హుడ వీవె నిశ్శేషముగను.
 
 
 17.  
  ఒనర నిత్యము విడక నేయోగివర్య!
  ఎట్టి చింతన చేత నిన్నెఱుగ నేర్తు,
  పరగ నే యే విభూతి భావములచేత,
  చింత్యుడవు భగవానుడా!చేర నిన్ను.
 
 
 18.  
  అమృత మయమైన నీవాక్కులాలకింప,
  తనివి తీరదు మరల నేవినగదలతు,
  నీ విభూతులు, యోగముల్నీరజాక్ష!
  విస్తరించి వచింపు మావినతి సేతు.
 
 
 19.  శ్రీ భగవానుడనెను:
  దివ్యమౌ నావిభూతులుదెలిసి కొనగ
  కలదె యంతము వానికికౌరవేంద్ర!
  ముఖ్యమౌ నాదుమాహాత్మ్యములను కొన్ని,
  చెప్పెదను నీకు కురుకులశ్రేష్ఠ!వినుమ.
 
 
 20.  
  సకలభూతముల హృదయస్థానమందు
  ప్రత్యగాత్మగ వెలిగెడుప్రభుడ నేను,
  జగతి యందలి యీభూతజాలమునకు
  ఆది మధ్యావసానములన్ని నేనె.
 Play This Verse
 
 21.  
  విజయ!ఆదిత్యులందునవిష్ణు నేను,
  రశ్మిగల యంశుమంతులరవిని నేను,
  వీచు మారుతములలో మరీచి నేను,
  చుక్కలందున శశిని రేజ్యోతి నేను.
 
 
 22.  
  వేదములు నాల్గిటను సామవేద మేను,
  వాసవుడనేను సకల దేవతలయందు,
  నింద్రియము లందు నే మనఇంద్రియమును
  భూతములయందు నే నౌదుచేతనమును.
 
 
 23.  
  రుద్రులేకాదశుల శంకరుడను నేను,
  యక్షరాక్షసుల ధనదుడనెడు వాడ,
  అష్ట వసువులలో పావకాఖ్యు డేను,
  శిఖరిణుల యందు నే మేరుశిఖిరి నౌదు.
 
 
 24.  
  ఎఱుగవలె దేవతల పురోహితులయందు,
  ప్రముఖుడను ఫల్గునా!బృహస్పతిని నేను,
  సర్వసేనాధిపతులందుస్కందు డేను,
  సరసు లందున మిన్నయౌసాగరమను.
 
 
 25.  
  భృగు వనెడు వాడ నే మహాఋషుల యందు,
  ఏకవర్ణము లందు `ఓంకృతిని నేను,
  యజ్ఞములయందు జపరూపయజ్ఞ మేను,
  స్థావరము లందు నే హిమాచలము నైతి.
 
 
 26.  
  సర్వవృక్షములందు నశ్వత్థ మేను,
  నారదుడను దేవర్షి గణంబు నందు,
  చిత్రరథుడను గంధర్వ సీమ పతుల,
  కపిల మునివర్యుడను, సిద్ధగణము నందు.
 
 
 27.  
  అమృత మందుండి యుద్భవమైన యట్టి,
  అశ్వ ముచ్చైశ్రవసమ నేహయము లందు,
  ఇంద్రునైరావతమను గజేంద్రు లందు,
  ఎఱుగవలె నన్ను నరులందునృపుని గాను.
 
 
 28.  
  ఆయుధము లందు నేను వజ్రాయుధమను,
  కోర్కెలను దీర్చు వేల్ప్లులగోవు నేను,
  ధర్మ సంతాన మొసగు కం దర్పు డేను,
  వాసుకిని ఏకశీర్ష సర్పంబు లందు.
 
 
 29.  
  ఔ దనంతుడ నాగములందు నేను,
  వరుణుడను సకలవన దేవతల యందు,
  అరయుమీ నన్ను పితరు లందర్యమునిగ,
  యముడ శాసించు వారలయందు నేను.
 
 
 30.  
  దైత్యులందు బ్రహ్లాదు గాదలపు నన్ను,
  గణికవరు లందు తెలియుముకాలునిగను,
  ఎంచు జంతువు లందు మృగేంద్రు గాను,
  పక్షిగణ మందు నన్ను సుపర్ణు గాను.
 
 
 31.  
  పావనము జేయు వారిలోపవను డేను,
  శస్త్రపాణులలో రామచంద్రు డేను,
  మత్స్యజాతుల యందునమకర మేను,
  భవ్యనదులందు గంగాస్రవంతి నేను.
 
 
 32.  
  పుట్టుకలుగల యీ విశ్వభూతములకు,
  ఆదిమధ్యావసానములైన నేనె,
  విద్యలందున నధ్యాత్మవిధ్య నేనె,
  వాదముల తత్త్వనిర్ణయవాద మేను.
 
 
 33.  
  అక్షరములందు నే `ఆకారాక్షరమను,
  పదసమాసము లందు ద్వంద్వమును నేను,
  అంతమే లేని కాల స్రవంతి నేను,
  విశ్వతోముఖధాతనైవెలయు దేను.
 
 
 34.  
  ఎల్ల జీవుల హరియించుమృతిని నేను,
  అభ్యుదయశీలు రందు నేనభ్యుదయము,
  స్త్రీల యందున గీర్తియుశ్రీయు వాక్కు,
  స్మృతియు మేధము,క్షమమును ధృతిని నేను.
 
 
 35.  
  సామగీతములన్,బృహత్సామ మేను,
  ఛందములయందు గాయత్రిఛంద మేను,
  మాసములయందు నే నౌదుమార్గశిరము,
  ఋతువు లందన్నిట వసంతఋతువు నేను.
 
 
 36.  
  వంచకుల యందు జూదపువ్యసన మేను,
  తేజు గలవార లందలితేజ మేను,
  యత్నమును నేను మఱి విజయమ్ము నేను,
  సాత్త్వికులయందు విలసిల్లుసత్త్వగుణము.
 
 
 37.  
  వాసుదేవుడ నే వృష్ణివంశజులను,
  పంచ పాండవులందునపార్థు డేను,
  వ్యాసముని నేను మౌన తత్త్వజ్ఞు లందు,
  కవిని శుక్రుండ నీతి సూక్ష్మజ్ఞు లందు.
 
 
 38.  
  దండనము సేయువారిలోదండ నీతి,
  రాజ నీతిని జయశీలురందు నేను,
  గుప్తవిషయాలలో మౌనగుణము నేను,
  జ్ఖ్ఞానవంతుల భాసిల్లుజ్ఞాన మేను.
 
 
 39.  
  భూతజాలము కిందెల్లహేతు వేదొ
  బీజ మది నేనె తెలియుమువిజయ! నీవు,
  జగతిగల చరాచర భూతజాల మందు,
  నేను లేకున్న దొక్కటిలేనె లేదు.
 
 
 40.  
  దివ్యమౌ నా విభూతులుదెలిసి కొనగ,
  అంతమే లేదు వానికికుంతి పుత్ర!
  అయ్యు, నా విభూతులవిషయమును గూర్చి,
  చెప్పితిని నీకు, మిగుల సంక్షేపముగను.
 
 
 41.  
  శ్రీయును విభూతి శక్తితోజెలగు చుండి,
  వస్తు వెయ్యెది వసుధపైవఱలు నేను,
  అయ్యదియ మామకీన తేజో శమునను,
  సంభవంబని తెలియుము సవ్యసాచి!
 
 
 42.  
  ఈవిభూతుల వివరముహెచ్చు గాను,
  తెలియ నే కార్యమగును, కుంతీ కుమార!
  యీ యఖిలవిశ్వ మేనె వ్యాపించి యుంటి,
  ఒక్క యంశమ్ము చేతనేయొనర దాల్చి.
 
 
 
 1.  శ్రీభగవానువాచ:
  భూయ ఏవ మహాబాహో
   శృణు మే పరమం వచః
  యత్తేఽహం ప్రీయమాణాయ
   వక్ష్యామి హితకామ్యయా ౦
 
 
 2.  
  న మే విదుః సురగణాః
   ప్రభవం న మహర్షయః
  అహమాదిర్హి దేవానాం
  మహర్షీణాం చ సర్వశః ౦
 
 
 3.  
  యో మామజమనాదిం
   చ వేత్తి లోకమహేశ్వరమ్
  అసంమూఢః స మర్త్యేషు
  సర్వపాపైః ప్రముచ్యతే ౦
 
 
 4.  
  బుద్ధిర్జ్ఞానమసంమోహః
   క్షమా సత్యం దమః శమః
  సుఖం దుఃఖం భవోఽభావో
   భయం చాభయమేవ చ ౦
 
 
 5.  
  అహింసా సమతా తుష్టి
  స్తపో దానం యశోఽయశః
  భవన్తి భావా భూతానాం
  మత్త ఏవ పృథగ్విధాః ౦
 
 
 6.  
  మహర్షయః సప్త పూర్వే
   చత్వారో మనవస్తథా
  మద్భావా మానసా జాతా
   యేషాం లోక ఇమాః ప్రజాః ౦
 Play This verse
 
 7.  
  ఏతాం విభూతిం యోగం
   చ మమ యో వేత్తి తత్త్వతః
  సోఽవికమ్పేన యోగేన
   యుజ్యతే నాత్ర సంశయః ౦
 
 
 8.  
  అహం సర్వస్య ప్రభవో
  మత్తః సర్వం ప్రవర్తతే
  ఇతి మత్వా భజన్తే మాం
   బుధా భావసమన్వితాః ౦
 
 
 9.  
  మచ్చిత్తా మద్గతప్రాణా
  బోధయన్తః పరస్పరమ్
  కథయన్తశ్చ మాం నిత్యం
   తుష్యన్తి చ రమన్తి చ ౦ ౯
 Play This verse
 
 10.  
  నిత్య మెవ్వరు నన్నేకనిష్ఠ తోడ,
  భక్తి సేవింతురో ప్రీతిభావ మెసగ,
  వారి కా బుద్ధియోగ మేర్పడగ నిత్తు,
  చేరుకొన నట్టియోగముచేత నన్ను.
 
 
 11.  
  తేషామేవానుకమ్పార్థ
  మహమజ్ఞానజం తమః
  నాశయామ్యాత్మభావస్థో
  జ్ఞానదీపేన భాస్వతా ౦
 
 
 12.  అర్జున ఉవాచ:
  పరం బ్రహ్మ పరం ధామ
   పవిత్రం పరమం భవాన్
  పురుషం శాశ్వతం దివ్య
  మాదిదేవమజం విభుమ్ ౦
 
 
 13.  
  ఆహుస్త్వామృషయః సర్వే
   దేవర్షిర్నారదస్తథా
  అసితో దేవలో వ్యాసః
  స్వయం చైవ బ్రవీషి మే ౦
 
 
 14.  
  సర్వమేతదృతం మన్యే
  యన్మాం వదసి కేశవ
  న హి తే భగవన్వ్యక్తిం
   విదుర్దేవా న దానవాః ౦
 
 
 15.  
  స్వయమేవాత్మనాత్మానం
   వేత్థ త్వం పురుషోత్తమ
  భూతభావన భూతేశ
   దేవదేవ జగత్పతే ౦
 
 
 16.  
  వక్తుమర్హస్యశేషేణ
  దివ్యా హ్యాత్మవిభూతయః
  యాభిర్విభూతిభిర్లోకా
  నిమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి ౦
 
 
 17.  
  కథం విద్యామహం యోగిం
  స్త్వాం సదా పరిచిన్తయన్
  కేషు కేషు చ భావేషు
  చిన్త్యోఽసి భగవన్మయా ౦
 
 
 18.  
  విస్తరేణాత్మనో యోగం
   విభూతిం చ జనార్దన
  భూయః కథయ తృప్తిర్హి
  శృణ్వతో నాస్తి మేఽమృతమ్ ౦
 
 
 19.  శ్రీభగవానువాచ:
  హన్త తే కథయిష్యామి
  దివ్యా హ్యాత్మవిభూతయః
  ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ
   నాస్త్యన్తో విస్తరస్య మే ౦ ౯
 
 
 20.  
  అహమాత్మా గుడాకేశ
   సర్వభూతాశయస్థితః
  అహమాదిశ్చ మధ్యం చ
   భూతానామన్త ఏవ చ ౦ ౦
 Play This verse
 
 21.  
  ఆదిత్యానామహం విష్ణు
  ర్జ్యోతిషాం రవిరంశుమాన్
  మరీచిర్మరుతామస్మి
   నక్షత్రాణామహం శశీ ౦
 
 
 22.  
  వేదానాం సామవేదోఽస్మి
   దేవానామస్మి వాసవః
  ఇన్ద్రియాణాం మనశ్చాస్మి
   భూతానామస్మి చేతనా ౦
 Play This verse
 
 23.  
  రుద్రాణాం శంకరశ్చాస్మి
   విత్తేశో యక్షరక్షసామ్
  వసూనాం పావకశ్చాస్మి
   మేరుః శిఖరిణామహమ్ ౦
 
 
 24.  
  పురోధసాం చ ముఖ్యం
   మాం విద్ధి పార్థ బృహస్పతిమ్
  సేనానీనామహం స్కన్దః
  సరసామస్మి సాగరః ౦
 
 
 25.  
  మహర్షీణాం భృగురహం
   గిరామస్మ్యేకమక్షరమ్
  యజ్ఞానాం జపయజ్ఞోఽస్మి
   స్థావరాణాం హిమాలయః ౦
 
 
 26.  
  అశ్వత్థః సర్వవృక్షాణాం
   దేవర్షీణాం చ నారదః
  గన్ధర్వాణాం చిత్రరథః
   సిద్ధానాం కపిలో మునిః ౦
 
 
 27.  
  ఉచ్చైఃశ్రవసమశ్వానాం
  విద్ధి మామమృతోద్భవమ్
  ఐరావతం గజేన్ద్రాణాం
  నరాణాం చ నరాధిపమ్ ౦
 
 
 28.  
  ఆయుధానామహం వజ్రం
  ధేనూనామస్మి కామధుక్
  ప్రజనశ్చాస్మి కన్దర్పః
  సర్పాణామస్మి వాసుకిః ౦
 
 
 29.  
  అనన్తశ్చాస్మి నాగానాం
  వరుణో యాదసామహమ్
  పితౄణామర్యమా చాస్మి
   యమః సంయమతామహమ్ ౦ ౯
 
 
 30.  
  ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం
   కాలః కలయతామహమ్
  మృగాణాం చ మృగేన్ద్రోఽహం
  వైనతేయశ్చ పక్షిణామ్ ౦ ౦
 Play This verse
 
 31.  
  పవనః పవతామస్మి
  రామః శస్త్రభృతామహమ్
  ఝషాణాం మకరశ్చాస్మి
   స్రోతసామస్మి జాహ్నవీ ౦
 
 
 32.  
  సర్గాణామాదిరన్తశ్చ
   మధ్యం చైవాహమర్జున
  అధ్యాత్మవిద్యా విద్యానాం
   వాదః ప్రవదతామహమ్ ౦
 
 
 33.  
  అక్షరాణామకారోఽస్మి
   ద్వన్ద్వః సామాసికస్య చ
  అహమేవాక్షయః కాలో
   ధాతాహం విశ్వతోముఖః ౦
 
 
 34.  
  మృత్యుః సర్వహరశ్చా
  హముద్భవశ్చ భవిష్యతామ్
  కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం
  స్మృతిర్మేధా ధృతిః క్షమా ౦
 
 
 35.  
  బృహత్సామ తథా సామ్నాం
   గాయత్రీ ఛన్దసామహమ్
  మాసానాం మార్గశీర్షోఽహ
  మృతూనాం కుసుమాకరః ౦
 
 
 36.  
  ద్యూతం ఛలయతామస్మి
   తేజస్తేజస్వినామహమ్
  జయోఽస్మి వ్యవసాయోఽస్మి
   సత్త్వం సత్త్వవతామహమ్ ౦
 
 
 37.  
  వృష్ణీనాం వాసుదేవోఽస్మి
   పాణ్డవానాం ధనంజయః
  మునీనామప్యహం వ్యాసః
   కవీనాముశనా కవిః ౦
 
 
 38.  
  దణ్డో దమయతామస్మి
   నీతిరస్మి జిగీషతామ్
  మౌనం చైవాస్మి గుహ్యానాం
   జ్ఞానం జ్ఞానవతామహమ్ ౦
 
 
 39.  
  యచ్చాపి సర్వభూతానాం
  బీజం తదహమర్జున
  న తదస్తి వినా యత్స్యా
  న్మయా భూతం చరాచరమ్ ౦ ౯
 
 
 40.  
  నాన్తోఽస్తి మమ దివ్యానాం
   విభూతీనాం పరన్తప
  ఏష తూద్దేశతః ప్రోక్తో
  విభూతేర్విస్తరో మయా ౦ ౦
 
 
 41.  
  యద్యద్విభూతిమత్సత్త్వం
   శ్రీమదూర్జితమేవ వా
  తత్తదేవావగచ్ఛ త్వం
  మమ తేజోంఽశసంభవమ్ ౦
 Play This verse
 
 42.  
  అథవా బహునైతేన
   కిం జ్ఞాతేన తవార్జున
  విష్టభ్యాహమిదం కృత్స్న
  మేకాంశేన స్థితో జగత్ ౦
 
 
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18