Tetagitulu with
 
 
 
 
Book Release Event
 
   Subscribe To Slokas
  
     
 
  Introduction
  Home
  Foreword
  Prayer
  What is Tetagiti ?
  Commentaries
  Provide Feedback
 
శ్రీమద్భగవద్గీత
తేటగీతులలొ తెనుగుసేత
  by Late Dr. P.V. Satyanarayana Rao
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ:
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18
 
  11. ఏకాదశాధ్యాయము: విశ్వరూపసందర్సనయోగము
 
 1.  అర్జునుడనెను:
  దేవ! నా యందు కరుణార్ద్ర దృష్టి నెఱపి,
  అతిరహస్యము, పరమ మ ధ్యాత్మికమును,
  అమృత వాక్కుల తత్త్వ మీ వాన తీయ,
  తొలగె దానిచే నామోహ ధూమ మెల్ల
 Play This Verse
 
 2.  
  భూతములు సృష్టిలయములు బొందు విధము,
  విస్తరంబుగ నీ నుండి వింటి నేను,
  అవ్యయంబైన నీదు మాహాత్మ్యములను,
  కమల పత్రాక్ష! వింటి నా కలత దీఱ
 Play This Verse
 
 3.  
  ఈశ్వరా! ఆత్మ తత్త్వము నెట్టి దీవు
  చెపితివో, యట్లె యది విశ్వ సింతుగాని,
  వఱలు నైశ్వరశక్తి రూ పమును నీది,
  కన్నులారంగ గన నాకు కలిగె కోర్కె
 Play This Verse
 
 4.  
  ప్రభువ! నీ దివ్య విశ్వరూ పమును జూడ,
  తగుదు నేనని నీమది తలతు వేని,
  అవ్యయంబైన నీ జగ దాత్మ రూప
  మిపుడు దర్శన మిమ్ము యో గేశ్వర! హరి!
 Play This Verse
 
 5.  శ్రీ భగవానుడనెను:
  బహు విధములైన, వర్ణ రూ పముల తోడ
  అలరు చుండెడు నాదు ది వ్యాకృతులను,
  వందలును వేలు గాగల వాని నెల్ల,
  చూడ మనసైన నర్జునా ! చూడు మిపుడు
 
 
 6.  
  చూడు ద్వాదశా దిత్యుల చూడు వసుల,
  రుద్ర మరు దశ్వినీ కుమారులను జూడు,
  ఎవ్వరును పూర్వమందు ద ర్శింప నట్టి
  చోద్యములు నీవు పెక్కింటి చూడు పార్థ!
 
 
 7.  
  అర్జునా! సచరాచర మైన జగతి,
  యంతయును గూడ, నా దేహ మందె యిపుడు,
  కూడి యొకచోట నున్నది చూడు మీవు,
  చూడ నింకేది కోరుదో చూడు దాని
 
 
 8.  
  పార్థ! నా దివ్య విశ్వరూ పమును జూడ,
  శక్తుడవు గావు నీ స్థూల చక్షువులను,
  దివ్య నేత్రములను బ్రసా దింతు నీకు,
  నాదు యోగైశ్వరమును క న్నార గనుము
 Play This Verse
 
 9.  సంజయుడనెను:
  ఇట్లు పల్కుచు ధృతరాష్ట్ర నృపతి! వినుమ,
  పరమ యోగేశ్వరుడు శ్రీ హరియు నంత,
  పరమ మైశ్వర విశ్వరూ పమును జూపె,
  అద్భుతముగొల్ప నెంతయు నర్జునునకు
 Play This Verse
 
 10.  
  కలయ ముఖములు కను లనే కములు మెఱయ,
  అద్భుతముగొల్ప నైక దృ శ్యముల తోడ,
  విమల దివ్యాభరణములు వేలు దాల్చి,
  వెలయు దివ్యాయుధములు వే వేల నెత్తి
 
 
 11.  
  దివ్యమాల్యాంబరంబులు దీప్తులెసగ,
  దివ్యగంధాను లేపముల్ తేజరిలగ,
  అద్భుతముగొల్పు దీప్తమ నంత మైన,
  విశ్వతోముఖ రూపము వెలయ జూపె
 
 
 12.  
  వే వెలుంగుల ఱేడులు వేయి మంది,
  మింట నొక సారె యేకమై మెఱతు రేని,
  పొడము నా కాంతి కొక్కింత బోలు నేమొ,
  ఆ మహాత్ముని తేజ మ ట్లలరు నపుడు
 
 
 13.  
  దేవ పితృ మనుష్యాదుల దేజ రిలుచు
  బహువిధంబుల విభజింప బడిన జగతి,
  దేవదేవుని యాదివ్య దేహ మందు,
  కూడి యొకచోటను న్నట్లు క్రీడి చూచె
 
 
 14.  
  అంత గనియట్లు, విస్మయస్వాంతు డగుచు,
  హర్షపులకితగాత్రుడై యర్జునుండు,
  హరికి తలవంచి, ప్రణతుల నాచరించి,
  అంజలి ఘటించి యిట్లు మా టాడ సాగె
 
 
 15.  
  దేవ! కనుచుంటి, నీ దివ్య దేహ మందు,
  సకల దేవతలను, భూత సంఘములను,
  కంటి బ్రహ్మను నీ నాభి కమలమందు,
  సకల ఋషులను, మఱి దివ్య సర్పములను
 
 
 16.  
  బహుభుజోదర ముఖనేత్ర భాసితునిగ,
  అంతటను జూతు నీదు అనంత రూపు,
  ఆదిమధ్యాంతములు, నీవి యరయజాల,
  విశ్వమయదేవ! విశ్వేశ! విశ్వరూప!
 
 
 17.  
  ఘనకిరీటము, గదయు, చ క్రమును దాల్చి,
  కాంతిప్రోవైన సర్వ ప్ర కాశకునిగ,
  సూర్యు, డగ్నియు వలె మండి చూడ రాని,
  అప్రమేయుడ నిను గాంతు నన్ని దిశల
 
 
 18.  
  పరుడవును వేదితవ్యుడ వవ్యయుడవు,
  పెన్నిధివి నీవె దేవ! యీ విశ్వమునకు,
  అక్షరుడవు శాశ్వత ధర్మ రక్షకుడవు,
  మిమ్ముల పురాణ పురుషుడిగానమ్మియుంటి.
 
 
 19.  
  ఆది మధ్యాంత రహిత! య నంత వీర్య!
  అర్కశశిధరనేత్ర! య నంత బాహు!
  దీప్తపావకవక్త్ర! స్వ తేజమునను,
  వేపు చుంటివి చూడ, నీ విశ్వమంత
 
 
 20.  
  దివి, భువియు నంతరాళము దిక్కు లన్ని,
  నిండుకొనె, నీ యొకనిచేత నే మహాత్మ!
  ఉగ్రమద్భుతమైన నీ విగ్రహమును,
  కాంచి ముల్లోకములు భయ కంపమొందె
 
 
 21.  
  భయముతో మ్రొక్కి కొందఱు ప్రస్తుతింప,
  చూతు చేరంగ నిన్నె యీ సురగణంబు,
  స్వస్తి యని పల్కి ఋషి సిద్ధ సంఘములును,
  పుష్కలస్తోత్రముల నిన్ను పొగడు చుండె
 
 
 22.  
  రుద్రు, లాదిత్యులు, వసు మ రుద్గణములు,
  సాధ్యగంధర్వ సిద్ధు లూ ష్మపులు మఱియు,
  అసుర, యక్ష విశ్వదేవు లాశ్వినులును,
  నిన్నుజూచి విస్మయ మొందినిలిచి రట్లె.
 
 
 23.  
  బహుళముఖనేత్ర బాహూరు పాద హస్త!,
  ఘోరదంష్ట్రాకరాళ! నీ గొప్పరూపు
  కనగ భయమయ్యె నాకు లో కముల కెల్ల
  ఓ మహాబాహు! ఓ విభూ! ఓ యనంత!
 
 
 24.  
  వెడద మొగముల విప్పారి వెలుగు కనుల,
  దివిని దాకుచు బహువర్ణ దీప్తమైన,
  విష్ణు! నీదు రూపము గాంచి వెఱపు నొంది,
  ధైర్యమును, శాంతి, నామది తప్పియుంటి
 
 
 25.  
  భయద దంష్త్రల వెల్గు నీ వదనగుహలు,
  ప్రజ్వరిల్లగ కాలాగ్ని పగిది, జూచి,
  దిశల కనజాల నాకు శాం తియును లేదు,
  కరుణ జూడుము నన్ను జ గన్నివాస!
 
 
 26.  
  ధార్తరాష్ట్రులు నందఱు ధరణి పతులు,
  భీష్ముడును, ద్రోణుడును, సూతు ప్రియసుతుండు
  చూడ మావారిలో మేటి జోదులెల్ల,
  యిందు సమకూడియున్నవా రంద ఱట్లె;
 
 
 27.  
  భయద దంష్త్రల వెల్చు నీ వదనగుహల,
  సత్వరమె చేర పర్వుతో సాగుచుండ్రి,
  దంతసంధుల కొందఱు తగులు కొనగ,
  చూడ కొందఱి శిరములు చూర్ణమయ్యె
 
 
 28.  
  జలధి జేరగ బహునదీ జలము లెట్లు,
  సాగరము వంక వేగమే సాగి పాఱు,
  విజ్వలంబగు నీవక్త్ర బిలములందు,
  చేర పర్వుదు రీ నర వీరు లట్లె
 
 
 29.  
  మండు మంటల మిడుతల దండులెట్లు,
  వేగవ్రాలుచు నవి యన్ని విలయ మొందు,
  ప్రాణిచయ మట్లె నీదు వ క్త్రముల జొరగ,
  నతిరయమ్మున బర్విడి యంత మొందు
 
 
 30.  
  జ్వలితముఖముల దిశలన్ని వ్యాప్తి బఱపి,
  నాకుచును, మ్రింగు దీవెల్ల లోకములను,
  జగతి నంతయు కాంతిపుం జముల నింపి,
  విష్ణు! నీ యుగ్రదీప్తులు వేపు చుండె
 
 
 31.  
  ఉగ్రరూపుడ! దేవ! య నుగ్రహించి,
  చెప్పు మెవ రీవు, ప్రణతులు సేతు నీకు,
  అరయ గోరెద మిమ్ము నే నాది పురుష!
  ఎఱుగ నైతిని నీ యీ ప్ర వృత్తులేవి
 
 
 32.  శ్రీ భగవానుడనెను:
  ప్రబలకాలుడ, లోక వి ధ్వంసకుడను,
  తుడిచి వేయగ లోకాల కడగినాడ,
  యుద్ధమున జంప కీ వూర కున్న గూడ,
  ఉండబో రిందు ప్రతిపక్ష యోధు లెవరు
 
 
 33.  
  కాన రిపుల గెల్వుము లెమ్ము కలుగు కీర్తి,
  రహిని భోగింపు రిపుశూన్య రాజ్య రమను,
  శత్రువులు ముందె నాచేత సమసి నారు,
  ఇక నిమిత్తమాత్రుడవె నీ విద్ధ చరిత
 
 
 34.  
  ద్రోణ భీష్ములును జయద్ర ధుండు మఱియు,
  సూతసుతు డాదిగా గల శూరవరుల,
  చంపితిని ముందె నీవిక చంపువారి,
  భయపడక పోరు శత్రు వి జయము నీదె.
 
 
 35.  
  అట్టి కేశవు మాటల నాలకించి
  అంజలి ఘటించి వడకుచునర్జునుండు,
  హరికి మ్రొక్కుచు మరల మా టాడె నిట్లు,
  భీతి గద్గదస్వరముతో వినతు డగుచు.
 
 
 36.  
  హెచ్చరిక లీవె గొన హృషీ కేశ! తగుదు
  జగము కీర్తించు నిన్నెంతొ సంతసమున,
  వెఱచి దిక్కుల రక్కసుల్ వేగ బర్వ,
  సిద్ధసంఘము లన్నియున్ చేరి మ్రొక్కు.
 Play This Verse
 
 37.  
  ఓ జగన్నివాస! అనంత! ఓ మహాత్మ!
  శ్రేష్ఠుడవు, బ్రహ్మకును నీవె సృష్టికర్త,
  సదసదుల కతీతుడవు న క్షరుడ వీవె,
  ఏల మ్రొక్కకయుంద్రు దే వేశ! నీకు.
 Play This Verse
 
 38.  
  ఆదిదేవుడ వీవె య నాది పురుష!
  పరమమాశ్రయమీవె వి శ్వమున కెల్ల,
  వేత్తయును పరంధాముడ వేద్యుడీవు,
  వ్యాప్తమైయుంటి వీ విశ్వ మంత నీవె.
 Play This Verse
 
 39.  
  వాయు వగ్నియు యముడును వరుణ శశులు
  బ్రహ్మకును దండ్రియును బ్రజా పతియు నీవె,
  సాగి మ్రొక్కెద నే వేయి సార్లు నీకు,
  మరల మరలను నీకు న మస్కరింతు.
 Play This Verse
 
 40.  
  సర్వశక్తి పరాక్రమ సర్వ రూప!
  విశ్వమంతయు వ్యాప్తమై వెలయు దేవ!
  ముందు వెనుకల నీ కివె వందనములు,
  అన్ని వైపుల వందన మాచరింతు.
 Play This Verse
 
 41.  
  ఇట్టి మహిమలు నీవి నే నెఱుగ లేక,
  చెలిమిచే గాని పొరపాటు చేతగాని,
  రార చెలికాడ! యాదవా రార కృష్ణ!
  అని పిలిచి నిన్ను నే మేల మాడి యుంటి.
 Play This Verse
 
 42.  
  ఆసనాహార శయ్యా వి హారములను,
  ఒంటరిగ నున్ననో, యొరు లున్నయపుడొ,
  అపహసించితి నిన్ను నే నవగణించి,
  అట్టి వెల్లను క్షమియింపు మప్రమేయ.
 Play This Verse
 
 43.  
  జనకుడవు చరాచరసర్వ జగతి కీవు,
  గురుడవు గరిష్టుడవు పూజ్య పురుషు డీవు,
  లేడు సముడె నీకన మించు వా డికేడ,
  త్రిజగముల యందు నతుల శ క్తి ప్రభావ.
 Play This Verse
 
 44.  
  కాన మ్రొక్కెద సాగిలి కరుణ జూడు,
  వందనీయుడ నిను వేడు కొందు నీశ!
  తనయు బితవలె సఖుని మి త్రమ్ము వోలె,
  సతిని పతి భంగి నా తప్పు సైపు దేవ.
 Play This Verse
 
 45.  
  నీ యపూర్వ స్వరూపమె నెమ్మి గంటి,
  కాని మనసెంతయును భయ కంపమొందె,
  నన్ను కరుణించి దేవ! జ గన్నివాస!
  చూపు నీ పూర్వరూపమే సొంపు మీఱ.
 Play This Verse
 
 46.  
  ఘనకిరీటము గదయు చ క్రమును దాల్చి
  పూర్వరూపముతో చతు ర్భుజుని గాను,
  కాంచగా నిన్ను వేడుక గలిగె నకు,
  వేయిచేతులస్వామి! ఓ విశ్వమూర్తి.
 Play This Verse
 
 47.  
  విజయ! నా ప్రసన్నతను జూ పితిని నీకు,
  ఆద్యమును కాంతిపూర్ణ మ నంత మైన
  పరమ రూపము నాయోగ బలము చేత
  కాంచరిది పూర్వమీవు గా కన్యు లెవరు.
 
 
 48.  
  శ్రుతుల జదివియు, వేల్చియున్ క్రతులొనర్చి,
  ఉగ్రతప మొనర్చియు దాన మొసగి యైన
  కన నసాధ్యుడ నీనృలోక కమున నేను,
  ఇట్టి రూపున నీకుగా కితరులకును.
 
 
 49.  
  ఇట్టి నాఘోరరూప మీ క్షించి నీవు,
  వ్యథను జెందకు, మూఢ భా వమ్ము వదలు,
  భీతి సెందక మదిని సం ప్రీతి నొంది,
  మరల నాపూర్వరూపమే తిరిగి చూడు.
 Play This Verse
 
 50.  
  వాసుదేవు డర్జునునితో పల్కి యిట్లు,
  శాంత రూపున మరల ద ర్శన మొసంగె,
  సౌమ్యు డగుచు నూరార్చె విశ్వాత్ము డపుడు,
  భయము సెందియున్న భీ భత్సు జూచి.
 
 
 51.  
  ఇట్టి నీ సౌమ్యమానుషా కృతిని నేను,
  కంటి చూపగ మరల నో కమల నయన!
  కూడె శాంతియు ప్రాణము కుదుట బడెను,
  స్వస్థచిత్తుడనైతి నో శాంత మూర్తి.
 
 
 52.  
  ఇప్పు డీవు గనిన రూప మేది గలదొ,
  యెంతయును దుర్లభ మది ద ర్శింపగాను,
  దేవతలు గూడ యిట్టి నా దివ్య రూపు
  చూడ నిత్యము కాంక్షించు చుంద్రు లెస్స.
 Play This Verse
 
 53.  
  వేర తపముల దానాది విధుల చేత,
  యజ్ఞ కర్మములను జేసి యైన గాని,
  ప్రీతి నన్నిప్పు డెట్లు ద ర్సించినావొ,
  అట్టి రూపున దర్శింప నలవి గాను.
 
 
 54.  
  ఇవ్విధంబున నారూప మెఱగుటకును,
  నన్ను దర్శింప నైక్యమై నన్నె పొంద,
  అన్యచింతన చేత నే నలవి గాను,
  పార్థ! సులభుడ కేవల భక్తి చేత.
 Play This Verse
 
 55.  
  సంగమును వీడి నాకర్మ సలుపు నెవడు,
  పరమ సంప్రాప్యు నను నమ్ము భక్తు డెవడు,
  ప్రాణచయ మందు నిర్వైర భావు డెవడు,
  వాడె నను పొంద జాలిన వాడు పార్థ!
 Play This Verse
 
 
 1.  అర్జున ఉవాచ:
  మదనుగ్రహాయ పరమం
  గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్
  యత్త్వయోక్తం వచస్తేన
   మోహోఽయం విగతో మమ
 
 
 2.  
  భవాప్యయౌ హి భూతానాం
   శ్రుతౌ విస్తరశో మయా
  త్వత్తః కమలపత్రాక్ష
  మాహాత్మ్యమపి చావ్యయమ్
 
 
 3.  
  ఏవమేతద్యథాత్థ త్వ
  మాత్మానం పరమేశ్వర
  ద్రష్టుమిచ్ఛామి తే రూప
  మైశ్వరం పురుషోత్తమ
 
 
 4.  
  మన్యసే యది తచ్ఛక్యం
   మయా ద్రష్టుమితి ప్రభో
  యోగేశ్వర తతో మే త్వం
   దర్శయాత్మానమవ్యయమ్
 
 
 5.  శ్రీభగవానువాచ:
  పశ్య మే పార్థ రూపాణి
  శతశోఽథ సహస్రశః
  నానావిధాని దివ్యాని
   నానావర్ణాకృతీని చ
 Play This Verse
 
 6.  
  పశ్యాదిత్యాన్వసూన్రుద్రా
  నశ్వినౌ మరుతస్తథా
  బహూన్యదృష్టపూర్వాణి
   పశ్యాశ్చర్యాణి భారత
 
 
 7.  
  ఇహైకస్థం జగత్కృత్స్నం
   పశ్యాద్య సచరాచరమ్
  మమ దేహే గుడాకేశ
  యచ్చాన్యద్ ద్రష్టుమిచ్ఛసి
 
 
 8.  
  న తు మాం శక్యసే ద్రష్టు
  మనేనైవ స్వచక్షుషా
  దివ్యం దదామి తే చక్షుః
  పశ్య మే యోగమైశ్వరమ్
 
 
 9.  సంజయ ఉవాచ:
  ఏవముక్త్వా తతో రాజ
  న్మహాయోగేశ్వరో హరిః
  దర్శయామాస పార్థాయ
   పరమం రూపమైశ్వరమ్ ౯
 
 
 10.  
  అనేకవక్త్రనయన
  మనేకాద్భుతదర్శనమ్
  అనేకదివ్యాభరణం
   దివ్యానేకోద్యతాయుధమ్ ౦
 
 
 11.  
  దివ్యమాల్యామ్బరధరం
   దివ్యగన్ధానులేపనమ్
  సర్వాశ్చర్యమయం దేవ
  మనన్తం విశ్వతోముఖమ్
 
 
 12.  
  దివి సూర్యసహస్రస్య
   భవేద్యుగపదుత్థితా
  యది భాః సదృశీ సా స్యా
  ద్భాసస్తస్య మహాత్మనః
 
 
 13.  
  తత్రైకస్థం జగత్కృత్స్నం
   ప్రవిభక్తమనేకధా
  అపశ్యద్దేవదేవస్య
  శరీరే పాణ్డవస్తదా
 
 
 14.  
  తతః స విస్మయావిష్టో
   హృష్టరోమా ధనంజయః
  ప్రణమ్య శిరసా దేవం
   కృతాఞ్జలిరభాషత
 
 
 15.  
  పశ్యామి దేవాంస్తవ దేవ దేహే
  సర్వాంస్తథా భూతవిశేషసంఘాన్
  బ్రహ్మాణమీశం కమలాసనస్థ
  మృషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్
 Play This Verse
 
 16.  
  అనేకబాహూదరవక్త్రనేత్రం
  పశ్యామి త్వాం సర్వతోఽనన్తరూపమ్
  నాన్తం న మధ్యం న పునస్తవాదిం
  పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప
 Play This Verse
 
 17.  
  కిరీటినం గదినం చక్రిణం చ
  తేజోరాశిం సర్వతో దీప్తిమన్తమ్
  పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమన్తా
  ద్దీప్తానలార్కద్యుతిమప్రమేయమ్
 
 
 18.  
  త్వమక్షరం పరమం వేదితవ్యం
  త్వమస్య విశ్వస్య పరం నిధానమ్
  త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా
  సనాతనస్త్వం పురుషో మతో మే
 
 
 19.  
  అనాదిమధ్యాన్తమనన్తవీర్య
  మనన్తబాహుం శశిసూర్యనేత్రమ్
  పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం
  స్వతేజసా విశ్వమిదం తపన్తమ్ ౯
 
 
 20.  
  ద్యావాపృథివ్యోరిదమన్తరం హి
  వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః
  దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం
  లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ ౦
 
 
 21.  
  అమీ హి త్వాం సురసంఘా విశన్తి
  కేచిద్భీతాః ప్రాఞ్జలయో గృణన్తి
  స్వస్తీత్యుక్త్వా మహర్షిసిద్ధసంఘాః
  స్తువన్తి త్వాం స్తుతిభిః పుష్కలాభిః
 
 
 22.  
  రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా
  విశ్వేఽశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ
  గన్ధర్వయక్షాసురసిద్ధసంఘా
  వీక్షన్తే త్వాం విస్మితాశ్చైవ సర్వే
 
 
 23.  
  రూపం మహత్తే బహువక్త్రనేత్రం
  మహాబాహో బహుబాహూరుపాదమ్
  బహూదరం బహుదంష్ట్రాకరాలం
  దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహమ్
 
 
 24.  
  నభఃస్పృశం దీప్తమనేకవర్ణం
  వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్
  దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాన్తరాత్మా
  ధృతిం న విన్దామి శమం చ విష్ణో
 
 
 25.  
  దంష్ట్రాకరాలాని చ తే ముఖాని
  దృష్ట్వైవ కాలానలసన్నిభాని
  దిశో న జానే న లభే చ శర్మ
  ప్రసీద దేవేశ జగన్నివాస
 Play This Verse
 
 26.  
  అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః
  సర్వే సహైవావనిపాలసంఘైః
  భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ
  సహాస్మదీయైరపి యోధముఖ్యైః
 
 
 27.  
  వక్త్రాణి తే త్వరమాణా విశన్తి
  దంష్ట్రాకరాలాని భయానకాని
  కేచిద్విలగ్నా దశనాన్తరేషు
  సందృశ్యన్తే చూర్ణితైరుత్తమాఙ్గైః
 
 
 28.  
  యథా నదీనాం బహవోఽమ్బువేగాః
  సముద్రమేవాభిముఖా ద్రవన్తి
  తథా తవామీ నరలోకవీరా
  విశన్తి వక్త్రాణ్యభివిజ్వలన్తి
 
 
 29.  
  యథా ప్రదీప్తం జ్వలనం పతఙ్గా
  విశన్తి నాశాయ సమృద్ధవేగాః
  తథైవ నాశాయ విశన్తి లోకా
  స్తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః ౯
 
 
 30.  
  లేలిహ్యసే గ్రసమానః సమన్తా
  ల్లోకాన్సమగ్రాన్వదనైర్జ్వలద్భిః
  తేజోభిరాపూర్య జగత్సమగ్రం
  భాసస్తవోగ్రాః ప్రతపన్తి విష్ణో ౦
 
 
 31.  
  ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో
  నమోఽస్తు తే దేవవర ప్రసీద
  విజ్ఞాతుమిచ్ఛామి భవన్తమాద్యం
  న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్
 
 
 32.  శ్రీభగవానువాచ:
  కాలోఽస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో
  లోకాన్సమాహర్తుమిహ ప్రవృత్తః
  ఋతేఽపి త్వాం న భవిష్యన్తి సర్వే
  యేఽవస్థితాః ప్రత్యనీకేషు యోధాః
 Play This Verse
 
 33.  
  తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్వ
  జిత్వా శత్రూన్ భుఙ్క్ష్వ రాజ్యం సమృద్ధమ్
  మయైవైతే నిహతాః పూర్వమేవ
  నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్
 
 
 34.  
  ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
  కర్ణం తథాన్యానపి యోధవీరాన్
  మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్ఠా
  యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్
 Play This Verse
 
 35.  
  ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య
  కృతాఞ్జలిర్వేపమానః కిరీటీ
  నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం
  సగద్గదం భీతభీతః ప్రణమ్య
 
 
 36.  
  స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా
  జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ
  రక్షాంసి భీతాని దిశో ద్రవన్తి
  సర్వే నమస్యన్తి చ సిద్ధసంఘాః
 
 
 37.  
  కస్మాచ్చ తే న నమేరన్మహాత్మన్
  గరీయసే బ్రహ్మణోఽప్యాదికర్త్రే
  అనన్త దేవేశ జగన్నివాస
  త్వమక్షరం సదసత్తత్పరం యత్
 
 
 38.  
  త్వమాదిదేవః పురుషః పురాణ
  స్త్వమస్య విశ్వస్య పరం నిధానమ్
  వేత్తాసి వేద్యం చ పరం చ ధామ
  త్వయా తతం విశ్వమనన్తరూప
 
 
 39.  
  వాయుర్యమోఽగ్నిర్వరుణః శశాఙ్కః
  ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ
  నమో నమస్తేఽస్తు సహస్రకృత్వః
  పునశ్చ భూయోఽపి నమో నమస్తే ౯
 
 
 40.  
  నమః పురస్తాదథ పృష్ఠతస్తే
  నమోఽస్తు తే సర్వత ఏవ సర్వ
  అనన్తవీర్యామితవిక్రమస్త్వం
  సర్వం సమాప్నోషి తతోఽసి సర్వః ౦
 
 
 41.  
  సఖేతి మత్వా ప్రసభం యదుక్తం
  హే కృష్ణ హే యాదవ హే సఖేతి
  అజానతా మహిమానం తవేదం
  మయా ప్రమాదాత్ప్రణయేన వాపి
 
 
 42.  
  యచ్చావహాసార్థమసత్కృతోఽసి
  విహారశయ్యాసనభోజనేషు
  ఏకోఽథవాప్యచ్యుత తత్సమక్షం
  తత్క్షామయే త్వామహమప్రమేయమ్
 
 
 43.  
  పితాసి లోకస్య చరాచరస్య
  త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్
  న త్వత్సమోఽస్త్యభ్యధికః కుతోఽన్యో
  లోకత్రయేఽప్యప్రతిమప్రభావ
 
 
 44.  
  తస్మాత్ప్రణమ్య ప్రణిధాయ కాయం
  ప్రసాదయే త్వామహమీశమీడ్యమ్
  పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః
  ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్
 
 
 45.  
  అదృష్టపూర్వం హృషితోఽస్మి దృష్ట్వా
  భయేన చ ప్రవ్యథితం మనో మే
  తదేవ మే దర్శయ దేవ రూపం
  ప్రసీద దేవేశ జగన్నివాస
 
 
 46.  
  కిరీటినం గదినం చక్రహస్త
  మిచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ
  తేనైవ రూపేణ చతుర్భుజేన
  సహస్రబాహో భవ విశ్వమూర్తే
 Play This Verse
 
 47.  
  మయా ప్రసన్నేన తవార్జునేదం
  రూపం పరం దర్శితమాత్మయోగాత్
  తేజోమయం విశ్వమనన్తమాద్యం
  యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్
 
 
 48.  
  న వేదయజ్ఞాధ్యయనైర్న దానై
  ర్న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః
  ఏవంరూపః శక్య అహం నృలోకే
  ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర
 
 
 49.  
  మా తే వ్యథా మా చ విమూఢభావో
  దృష్ట్వా రూపం ఘోరమీదృఙ్మమేదమ్
  వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం
  తదేవ మే రూపమిదం ప్రపశ్య ౯
 
 
 50.  
  ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా
  స్వకం రూపం దర్శయామాస భూయః
  ఆశ్వాసయామాస చ భీతమేనం
  భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా ౦
 
 
 51.  
  దృష్ట్వేదం మానుషం రూపం
   తవ సౌమ్యం జనార్దన
  ఇదానీమస్మి సంవృత్తః
  సచేతాః ప్రకృతిం గతః
 
 
 52.  
  సుదుర్దర్శమిదం రూపం
  దృష్టవానసి యన్మమ
  దేవా అప్యస్య రూపస్య
   నిత్యం దర్శనకాఙ్క్షిణః
 Play This Verse
 
 53.  
  నాహం వేదైర్న తపసా
   న దానేన న చేజ్యయా
  శక్య ఏవంవిధో ద్రష్టుం
  దృష్టవానసి మాం యథా
 
 
 54.  
  భక్త్యా త్వనన్యయా శక్య
   అహమేవంవిధోఽర్జున
  జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన
   ప్రవేష్టుం చ పరంతప
 
 
 55.  
  మత్కర్మకృన్మత్పరమో
   మద్భక్తః సఙ్గవర్జితః
  నిర్వైరః సర్వభూతేషు యః
   స మామేతి పాణ్డవ
 
 
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18