Tetagitulu with
 
 
 
 
Book Release Event
 
   Subscribe To Slokas
  
     
 
  Introduction
  Home
  Foreword
  Prayer
  What is Tetagiti ?
  Commentaries
  Provide Feedback
 
శ్రీమద్భగవద్గీత
తేటగీతులలొ తెనుగుసేత
  by Late Dr. P.V. Satyanarayana Rao
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ:
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18
 
  12. ద్వాదశాధ్యాయము : భక్తియోగము
 
 1.  
  సతము నిన్నిట్లు నిష్ఠతోసగుణునిగను,
  నిన్నె యవ్యక్తు నక్షరునిర్గుణునిగ,
  పర్యుపాసించు భక్తులెవ్వారుగలరొ,
  యోగ విత్తము లెవ్వరాయుభయులందు.
 
 
 2.  
  మదిని నను జేర్చి నాలో నిమగ్నులగుచు
  నిత్యయుక్తిని నన్నే కనిష్ఠ నెవరు,
  శ్రద్ధ మీఱ నుపాసనసల్పుచుంద్రొ,
  యోగితములని వారి నేనొప్పుకొందు.
 
 
 3.  
  కాని యెవ్వ రవ్యక్తు, నక్క్షరు, నచింత్యు,
  నప్రమేయుని, కూటస్ఠు,నచలు,ధ్రువుని,
  నిర్గుణబ్రహ్మ మంతయునిండియున్న
  వాని బూజింతురో నిష్ఠబూని యుండి;
 
 
 4.  
  ఇంద్రియ సమూహమును, నిగ్రహించియుంచి,
  యెల్ల యెడలను సమ బుద్ధినెసగు చుండి,
  సర్వభూతహితము మనసార నెంచు,
  వారలును గూడ నను బొందువారె పార్ధ!
 
 
 5.  
  నిర్గుణోపాసనా సక్తినియమ రతులు,
  నధిక తర మగు శ్రమములననుభవింత్రు,
  కష్టకరమైన దవ్యక్తగతిని జేర,
  మనుజు లెల్లరు దేహాభిమాను లగుట.
 
 
 6.  
  కాని యెవ్వరేనియు సర్వ కర్మములను,
  నాకె యర్పించి పరముగానన్నె యెంచి,
  కడగి కేవల భక్తి యోగంబుచేత,
  నన్నుపాసించి నన్నె ధ్యానమ్మొ నర్చి;
 
 
 7.  
  చిత్ద్తమున నన్నె యెవ్వరుజేర్చి యుంత్రొ,
  క్రీడి!వారల నే నుద్ధరించు చుందు,
  ప్రబల మృత్యు సంసార వారాశి నుండి,
  శీఘ్రకాలమె దరికి నేజేర వేసి.
 
 
 8.  
  మనసు నాయందె పెనవేసికొనగ నిమ్ము,
  బుద్ధి నాయందె తిరముగాబూన నిమ్ము,
  ముందు నాయందె నివసించియుందు వీవు,
  లేదు సందియ మిందునలేశ మైన.
 
 
 9.  
  చిత్త మట్టుల నాయందుస్థిరముగాను,
  నిలుప శక్యము గాదేనినీకు పార్థ!
  సతత మభ్యాసయోగ మాచరణ బూని,
  నన్నె పొందగ గోరి యత్నమును సలుపు.
 
 
 10.  
  అభ్యసింప నశక్తుడవైన నింక,
  పరగ మత్కర్మలందు తత్పరుడ వగుము,
  కర్మముల నట్లు నా కొఱకై యొనర్ప,
  పొందవచ్చును సంసిద్ధిపొలుపు మీఱ.
 
 
 11.  
  ఇంక నిది కూడ శక్తి లే దేని జేయ,
  శరణుగొని నన్ను కర్మలసలుపు మీవు,
  సర్వకర్మఫలంబులసంత్యజించి,
  సంయతాత్ముండవై యుండుసతత మట్లు.
 
 
 12.  
  జ్ఞాన మభ్యాస యోగము కన్న మేలు,
  జ్ఞానమున కన్న శ్రేష్ఠముధ్యాన మగును,
  కర్మఫలవిసర్జన దానికన్న మేలు,
  శాంతి శీఘ్రమె కలుగు, త్యాగాంత మందు.
 
 
 13.  
  సర్వ భూతము లందు ద్వేషమును లేక,
  దయయు మైత్రియు లోన దాదలచు వాడు,
  నేను నాదను భావములేని వాడు,
  కష్టసుఖముల సముడునుక్షాంతి యుతుడు.
 
 
 14.  
  సతత సంతుష్టుడును, యోగిసత్తముండు,
  సంయతాత్ముడు, సంఛిన్నసంశయుండు,
  మనసు బుద్ధిని నాయందెయునుచు వాడు,
  అట్టి భక్తు డెవండొ, నాకతడె ప్రియుడు.
 
 
 15.  
  లోక మెవ్వని జూచియులుగ్గ డిలదొ,
  లోకము నెవండు జూచియులుగ్గడిలడొ,
  హర్ష మీర్ష్య భయప్రవాహముల నుండి,
  ముక్తు డెవ్వడొ, నా ప్రియభక్తు డతడె.
 Play This Verse
 
 16.  
  దక్షుడును, శుచి యెవ డనపేక్షకుండొ,
  వీతభయుడును, నిష్పక్షపాతి యెవడొ,
  కామ్యకర్మములను జేయకడగ డెవడొ,
  అట్టి నాభక్తు డే ప్రియుడగును నాకు.
 
 
 17.  
  ద్వేష మొందడొ, యెవడు సంతోష పడడొ,
  పగల బొగులడొ, యేది కావలయు ననడొ,
  పాప పుణ్యఫలంబులబాయు నెవడొ,
  భక్తు డాతడె ప్రియమైనవాడు నాకు.
 
 
 18.  
  శత్రు మిత్రుల యెడ సమస్వాంతు డెవడొ,
  మన్ననల తెగడికల సమాను డెవడొ,
  శీత తాపము లందునస్థిరు డెవండొ,
  సంగరహితుడు సుఖదుఃఖసము డెవండొ;
 
 
 19.  
  స్తుతియు నిందల యందునతుల్యు డెవడొ,
  కలిగి నంతకె తుష్టినిగాంచు నెవడొ,
  స్థిరమతియు, మౌని యెవ్వ డస్థిర నివాసి,
  అతడె ప్రియభక్తుడగు నరులందు నాకు.
 
 
 20.  
  ఇట్టి ధర్మ్యా మృతము భక్తులెవరు గాని,
  శ్రద్ధ మీఱగ మత్పరాసక్తి తోడ,
  చెప్పురీతి నుపాసనజేయు వారొ,
  అట్టి భక్తులు నాకు నత్యంత ప్రియులు.
 
 
 
 1.  
  ఏవం సతతయుక్తా యే
   భక్తాస్త్వాం పర్యుపాసతే
  యే చాప్యక్షరమవ్యక్తం
   తేషాం కే యోగవిత్తమాః
 
 
 2.  
  మయ్యావేశ్య మనో యే మాం
   నిత్యయుక్తా ఉపాసతే
  శ్రద్ధయా పరయోపేతాస్తే
  మే యుక్తతమా మతాః
 Play This Verse
 
 3.  
  యే త్వక్షరమనిర్దేశ్య
  మవ్యక్తం పర్యుపాసతే
  సర్వత్రగమచిన్త్యం చ
   కూటస్థమచలం ధ్రువమ్
 
 
 4.  
  సంనియమ్యేన్ద్రియగ్రామం
   సర్వత్ర సమబుద్ధయః
  తే ప్రాప్నువన్తి మామేవ
   సర్వభూతహితే రతాః
 
 
 5.  
  క్లేశోఽధికతరస్తేషా
  మవ్యక్తాసక్తచేతసామ్
  అవ్యక్తా హి గతిర్దుఃఖం
  దేహవద్భిరవాప్యతే
 
 
 6.  
  యే తు సర్వాణి కర్మాణి
  మయి సంన్యస్య మత్పరాః
  అనన్యేనైవ యోగేన
  మాం ధ్యాయన్త ఉపాసతే
 
 
 7.  
  తేషామహం సముద్ధర్తా
   మృత్యుసంసారసాగరాత్
  భవామి నచిరాత్పార్థ
  మయ్యావేశితచేతసామ్
 
 
 8.  
  మయ్యేవ మన ఆధత్స్వ
   మయి బుద్ధిం నివేశయ
  నివసిష్యసి మయ్యేవ
   అత ఊర్ధ్వం న సంశయః
 
 
 9.  
  అథ చిత్తం సమాధాతుం
   న శక్నోషి మయి స్థిరమ్
  అభ్యాసయోగేన తతో
   మామిచ్ఛాప్తుం ధనంజయ ౯
 
 
 10.  
  అభ్యాసేఽప్యసమర్థోఽ
  సి మత్కర్మపరమో భవ
  మదర్థమపి కర్మాణి
  కుర్వన్సిద్ధిమవాప్స్యసి ౦
 
 
 11.  
  అథైతదప్యశక్తోఽసి
   కర్తుం మద్యోగమాశ్రితః
  సర్వకర్మఫలత్యాగం
   తతః కురు యతాత్మవాన్
 
 
 12.  
  శ్రేయో హి జ్ఞానమభ్యాసా
  జ్జ్ఞానాద్ధ్యానం విశిష్యతే
  ధ్యానాత్కర్మఫలత్యాగ
  స్త్యాగాచ్ఛాన్తిరనన్తరమ్
 Play This Verse
 
 13.  
  అద్వేష్టా సర్వభూతానాం
   మైత్రః కరుణ ఏవ చ
  నిర్మమో నిరహంకారః
   సమదుఃఖసుఖః క్షమీ
 
 
 14.  
  సంతుష్టః సతతం యోగీ
   యతాత్మా దృఢనిశ్చయః
  మయ్యర్పితమనోబుద్ధి
  ర్యో మద్భక్తః స మే ప్రియః
 
 
 15.  
  యస్మాన్నోద్విజతే లోకో
   లోకాన్నోద్విజతే చ యః
  హర్షామర్షభయోద్వేగై
  ర్ముక్తో యః స చ మే ప్రియః
 
 
 16.  
  అనపేక్షః శుచిర్దక్ష
   ఉదాసీనో గతవ్యథః
  సర్వారమ్భపరిత్యాగీ
   యో మద్భక్తః స మే ప్రియః
 Play This Verse
 
 17.  
  యో న హృష్యతి న ద్వేష్టి
   న శోచతి న కాఙ్క్షతి
  శుభాశుభపరిత్యాగీ
  భక్తిమాన్యః స మే ప్రియః
 
 
 18.  
  సమః శత్రౌ చ మిత్రే చ
   తథా మానాపమానయోః
  శీతోష్ణసుఖదుఃఖేషు
   సమః సఙ్గవివర్జితః
 Play This Verse
 
 19.  
  తుల్యనిన్దాస్తుతిర్మౌనీ
   సన్తుష్టో యేన కేనచిత్
  అనికేతః స్థిరమతి
  ర్భక్తిమాన్మే ప్రియో నరః ౯
 Play This Verse
 
 20.  
  యే తు ధర్మ్యామృతమిదం
   యథోక్తం పర్యుపాసతే
  శ్రద్దధానా మత్పరమా
   భక్తాస్తేఽతీవ మే ప్రియాః ౦
 
 
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18