Tetagitulu with
 
 
 
 
Book Release Event
 
   Subscribe To Slokas
  
     
 
  Introduction
  Home
  Foreword
  Prayer
  What is Tetagiti ?
  Commentaries
  Provide Feedback
 
శ్రీమద్భగవద్గీత
తేటగీతులలొ తెనుగుసేత
  by Late Dr. P.V. Satyanarayana Rao
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ:
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18
 
  13. త్రయోదశాధ్యాయము : క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము
 
 1.  
  ప్రకృతి యన నేది, పురుషుడె వ్వాడతండు,
  ఏది క్షేత్రము, క్షేత్రజ్ఞు డె వ్వడతడు,
  జ్ఞాన మన నేది, జ్ఞేయ మ నంగ నేది,
  తెలుప గోరెద వీనిని దేవ! మిమ్ము.
 
 
 2.  
  సర్వ కర్మలు సలుపంగ స్థాన మైన,
  యీ శరీరమె క్షేత్రమం చెఱుగు మీవు,
  ఎవడు క్షేత్రమ్ము బూర్తిగా నెరుగ గలడొ,
  తత్త్వవేత్తలు వాని, క్షే త్రజ్ఞు డండ్రు.
 Play This Verse
 
 3.  
  అన్ని క్షేత్రములందు చె ల్వమరగాను,
  వెలయు క్షేత్రజ్ఞునిగ నన్ను దెలిసి కొనుము,
  ఏది క్షేత్రమున్, క్షేత్రజ్ఞు నెఱుగ జేయు,
  నట్టిదే యదార్ధ జ్ఞాన మందు నేను.
 
 
 4.  
  క్షేత్ర మది యేదొ, యెట్టి వి శేషములదొ,
  కలుగు నెందుండియో, యే వి కారములదొ,
  ఎట్టి మహితుడొ, క్షేత్రజ్ఞు డెట్టి వాడొ,
  చెప్పెదను విను వాని సం క్షేపముగను.
 
 
 5.  
  ఋషులు కీర్తించి, రవ్వాని నెన్నొ గతుల,
  వేదములు నిర్ణయించె వే ర్వేరుగాను,
  బ్రహ్మసూత్రాల, నుపనిష ద్వాక్యములను,
  హేతుబద్ధముగ వినిశ్చ యింప బడియె.
 
 
 6.  
  ఐదు సూక్ష్మ భూతమ్ముల వ్యక్తమైన,
  మూలప్రకృతి, యహంకృతి బుద్ధి, మనసు,
  జ్ఞాన కర్మేంద్రియమ్ములు గలసి పదియు,
  ఐంద్రియకమైన విషయమ్ము లైదు గలవు.
 
 
 7.  
  సుఖము, దుఃఖము, నిచ్ఛ న సూయ తోడ,
  దనరు దేహేంద్రియములు చే తనము, ధృతియు,
  ఈ వికారాన్విత శరీర మేది కలదొ,
  క్షేత్రమందురు దాని సం క్షేపముగను.
 
 
 8.  
  స్వాభి మానమువీడి, దం భమును బాసి,
  క్షాంతియు నహింస దాల్చి యార్జవము గూడి,
  సద్గురూపాసనయును, శౌ చమును గలిగి,
  ఆత్మ నాయత్తపఱచి, స్థై ర్యము వహించి;
 Play This Verse
 
 9.  
  ఇంద్రియార్థము లందెట్టి యిచ్చ నిడక,
  మనసులో నహంకారము మసల నీక,
  జన్మ మృత్యువులను మఱి జరయు, వ్యాధి
  దుఃఖముల గల్గు చుండెడి దోష మరసి;
 Play This Verse
 
 10.  
  ఆలు బిడ్డల యందు, గృ హాదు లందు,
  నాది నావారను నభిమా నమును వదలి,
  నిత్య మన్నిట సమచిత్త నిరతి మెలగి,
  ప్రియము నప్రియ మందొకే దృష్టి నెఱపి;
 Play This Verse
 
 11.  
  అన్య మెఱుగని నాయోగ మభ్యసించి,
  వ్యభిచరింపని యేకాంత భక్తి నెఱపి,
  నిర్జనస్థానమందేక నిష్ఠ నిలిచి,
  జనసమూహము జేరనా సక్తి విడచి;
 Play This Verse
 
 12.  
  అనవరతమాత్మ రూపము నరయు చుంట,
  తత్త్వవిజ్ఞానదృష్టిని తవిలి యుంట,
  జ్ఞాన మని చెప్పుచుందురు జ్ఞాన ధనులు,
  అన్య సాధన మజ్ఞాన మగును పార్థ!
 Play This Verse
 
 13.  
  ఏది తెలియగ పురుషుం డ మృతము బొందు,
  ఆది రహిత పరబ్రహ్మ మైన దేదొ,
  దేని నందురొ సదసత్తు కాని దనుచు,
  జ్ఞేయ మేదియొ దాని నే జెపుదు వినుము.
 
 
 14.  
  అంతటను కాలు సేతులు నంత కనులు,
  తలలు, ముఖములు, చెవులు, నం తటను గల్గి,
  జ్ఞేయమైనట్టి యాబ్రహ్మ చెలగి దెసల,
  నంతటను నిండి యీలోక మావరించె.
 
 
 15.  
  ఇంద్రియంబుల నెల్ల భా సింప జేయు,
  కాని, లేదొక్క యింద్రియ మైన దనకు,
  సంగమే లేక పోషించు సర్వజగతి,
  గుణములే లేక, భోగించు గుణములన్ని.
 
 
 16.  
  సకల భూత చరాచర సంఘమందు,
  వెలుపలను లోన నీ బ్రహ్మ వెలుగు చుండు,
  చూడ లే మది సూక్ష్మాతి సూక్ష్మమగుట,
  జ్ఞాని దరినుండు, దౌల న జ్ఞాని కుండు.
 
 
 17.  
  అట్టి యీ బ్రహ్మ మవిభక్త మైనదయ్యు,
  భూతముల భిన్నమైనట్లు పొల్చు చుండు,
  భూతముల ప్రోచి, పొలియించి పుట్ట జేయు,
  నట్టి బ్రహ్మమె జ్ఞేయమం చరయు మీవు.
 
 
 18.  
  సూర్య చంద్రుల వెలుగులో జ్యోతి యదియె,
  అంధకారమునకు బర మైన దదియె,
  జ్ఞానమును, జ్ఞేయమును, జ్ఞాన గమ్య మదియె
  ఎల్లప్రాణుల హృది న ధిష్టించు నదియె.
 
 
 19.  
  క్షేత్రమును, జ్ఞానమును, మఱి జ్ఞేయ మిట్లు
  చెప్పితిని పార్థ! నీకు సం క్షేపముగను,
  దీని నిట్లు నాభక్తుడు తెలిసి కొనిన,
  అర్హుడగు వాడు నాభావ మందు కొనగ.
 
 
 20.  
  పూరుషుండును, ప్రకృతి, యి ర్వురును గూడ,
  ఆదిరహితు లటంచు నీ వరయ వలయు
  ఇంద్రియ వికారగుణములునెల్ల పార్థ!
  ప్రభవ మొందును తెలియుము ప్రకృతి నుండె.
 
 
 21.  
  కార్య కారణముల నెల్ల కలుగ జేయ,
  ప్రకృతియే కారణంబని పల్కు చుంద్రు,
  ఎపుడు సుఖదుఃఖము లనుభ వించుటకును,
  పురుషుడే హేతువంచు చెప్పుదురు బుధులు.
 
 
 22.  
  పురుషు డెప్పుడు ప్రకృతిని పొందియుంట
  నతడు ప్రకృతిజన్యగుణమ్ము లనుభవించు,
  ఆ గుణములందె యాసక్తి యమరి యుంట
  మంచి చెడు యోనులందు జ న్మించు చుండు.
 
 
 23.  
  ఈ శరీరము నందు వ సించు వాడు,
  పరుడు, పురుషుం, డుపద్రష్ట, భర్త, భోక్త,
  వాడె యనుమోదకుడు, మహే శ్వరు డతండె,
  వాడె పరమాత్మ యని కూడ పల్క బడును.
 
 
 24.  
  ఎవడు గుణసహితముగ ప్ర కృతిని మఱియు
  పురుషు నీరీతి నెఱుగు సం పూర్ణముగను,
  ఎవ్విధంబుల వాడు వ ర్తించి యైన
  పొంద డాతండు జన్మమీ భువిని మరల.
 
 
 25.  
  ధ్యానయోగమ్ముచే కొంద ఱాత్మయందె,
  ఆత్మచేతనె పరమాత్మ నరయుచుంద్రు,
  సాంఖ్యయోగము కొందఱు సలిపి కాంత్రు,
  కాంతు రితరులు నిష్కామ కర్మ సలిపి.
 Play This Verse
 
 26.  
  అన్యు లీగతి పరమాత్మ నరయ లేక,
  సలుపుదు రుపాసన ముపదే శాను సరణి,
  అట్లు శ్రుతిపరాయణభక్తు లైన కూడ,
  మృత్యుసంసారజలధి త రించు చుంద్రు.
 
 
 27.  
  స్థావరము జంగమంబైన సత్త్వ మొకటి,
  కొంచె మేదైన భువి నుద్భవించు నేని,
  ప్రకృతి పురుష సం యోగ కా రణము చేత,
  కలిగె నది యని తెలియగా వలయు పార్థ!
 Play This Verse
 
 28.  
  సర్వభూతము లందున సముడు గాను,
  నాశవస్తువులందవి నాశి గాను,
  వెలయు పరమాత్మనెవ్వడు తెలిసి కొనునొ,
  ఆతడే యాత్మతత్త్వయా థార్థ్యమెఱుగు.
 
 
 29.  
  వాని బరమాత్మ, నీశు, సర్వత్రసముని,
  వాసుదేవుని దర్శించు వా డెవండు,
  తన్ను తానెట్లు హింసింప తలపు గొనును,
  కాన నుత్తమగతి పొంద గలుగు వాడు.
 
 
 30.  
  త్రికరణములైన కర్మల దెలియ నెవడు,
  సర్వవిధముల బ్రకృతియే సలుపు నంచు,
  అట్లె, చూచు నకర్తగా నాత్మ నెవ్వ
  డట్టి వాడె సమ్యగ్దర్సి యైన వాడు.
 
 
 31.  
  ఎపుడు వివిధ భూతమ్ముల నెల్ల నెవ్వ
  డాత్మ యొకదాని యందెయు న్నట్లు జూచు,
  దాని యందుండె విస్తార మైన దనుచు,
  నరయు నప్పుడె బ్రహ్మమై యలరు నతడు.
 
 
 32.  
  ఆదిరహితుడు, నిర్గుణుం డగుట జేసి,
  అవ్యయుండైన యీపర మాత్మ పార్థ!
  ఈ శరీరములో వసి యించి కూడ,
  కర్మలిప్తుడు కాడు త త్కర్త గాడు.
 
 
 33.  
  ఆకసంబెట్లు నంతట వ్యాప్త మయ్యు
  నంటు బడకుండు నతిసూక్ష్మ మగుట జేసి,
  ఎల్ల దేహములన్ వసి యించు నట్టి,
  ఆత్మ యట్టులె గుణముల కంటు వడదు.
 Play This Verse
 
 34.  
  లోకముల వీని నెల్ల ది వాకరుండు,
  ఎట్టు లొక్కరుడే బ్రకా శింప జేయు,
  ఎల్ల క్షేత్రము లట్లె క్షే త్రీశ్వరుండు,
  దీప్తిమంతము జేయు కుం తీకుమార!
 
 
 35.  
  ఇట్లు క్షేత్రము క్షేత్రజ్ఞు లిర్వురి యెడ,
  నంతరము జ్ఞానచక్షుల గాంతు రెవరొ,
  అట్లె భూతప్రకృతి మోక్ష మరయ గలరొ,
  పరమపదమును వారలే పడయ గలరు.
 
 
 
 1.  
  ప్రకృతిం పురుషం చైవ
  క్షేత్రం క్షేత్రజ్ఙం ఏవచ
  ఏతద్ వేదితమిఛ్ఛామి
  జ్ఞానం జ్ఞేయం చ కేశవ
 
 
 2.  
  ఇదం శరీరం కౌన్తేయ
  క్షేత్రమిత్యభిధీయతే
  ఏతద్యో వేత్తి తం ప్రాహుః
  క్షేత్రజ్ఞ ఇతి తద్విదః
 Play This Verse
 
 3.  
  క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి
  సర్వక్షేత్రేషు భారత
  క్షేత్రక్షేత్రజ్ఞయోర్జ్ఞానం
   యత్తజ్జ్ఞానం మతం మమ
 
 
 4.  
  తత్క్షేత్రం యచ్చ యాదృక్చ
   యద్వికారి యతశ్చ యత్
  స చ యో యత్ప్రభావశ్చ
   తత్సమాసేన మే శృణు
 
 
 5.  
  ఋషిభిర్బహుధా గీతం
  ఛన్దోభిర్వివిధైః పృథక్
  బ్రహ్మసూత్రపదైశ్చైవ
  హేతుమద్భిర్వినిశ్చితైః
 
 
 6.  
  మహాభూతాన్యహంకారో
  బుద్ధిరవ్యక్తమేవ చ
  ఇన్ద్రియాణి దశైకం చ
   పఞ్చ చేన్ద్రియగోచరాః
 
 
 7.  
  ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం
  సంఘాతశ్చేతనా ధృతిః
  ఏతత్క్షేత్రం సమాసేన
   సవికారముదాహృతమ్
 
 
 8.  
  అమానిత్వమదమ్భిత్వ
  మహింసా క్షాన్తిరార్జవమ్
  ఆచార్యోపాసనం శౌచం
   స్థైర్యమాత్మవినిగ్రహః
 
 
 9.  
  ఇన్ద్రియార్థేషు వైరాగ్య
  మనహంకార ఏవ చ
  జన్మమృత్యుజరావ్యాధి
  దుఃఖదోషానుదర్శనమ్
 
 
 10.  
  అసక్తిరనభిష్వఙ్గః
  పుత్రదారగృహాదిషు
  నిత్యం చ సమచిత్తత్వ
  మిష్టానిష్టోపపత్తిషు ౯
 
 
 11.  
  మయి చానన్యయోగేన
   భక్తిరవ్యభిచారిణీ
  వివిక్తదేశసేవిత్వ
  మరతిర్జనసంసది ౦
 
 
 12.  
  అధ్యాత్మజ్ఞాననిత్యత్వం
  తత్త్వజ్ఞానార్థదర్శనమ్
  ఏతజ్జ్ఞానమితి ప్రోక్త
  మజ్ఞానం యదతోఽన్యథా
 Play This Verse
 
 13.  
  జ్ఞేయం యత్తత్ప్రవక్ష్యామి
   యజ్జ్ఞాత్వామృతమశ్నుతే
  అనాది మత్పరం బ్రహ్మ
   న సత్తన్నాసదుచ్యతే
 
 
 14.  
  సర్వతః పాణిపాదం త
  త్సర్వతోఽక్షిశిరోముఖమ్
  సర్వతః శ్రుతిమల్లోకే
  సర్వమావృత్య తిష్ఠతి
 
 
 15.  
  సర్వేన్ద్రియగుణాభాసం
   సర్వేన్ద్రియవివర్జితమ్
  అసక్తం సర్వభృచ్చైవ
  నిర్గుణం గుణభోక్తృ చ
 
 
 16.  
  బహిరన్తశ్చ భూతానా
  మచరం చరమేవ చ
  సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం
   దూరస్థం చాన్తికే చ తత్
 
 
 17.  
  అవిభక్తం చ భూతేషు
  విభక్తమివ చ స్థితమ్
  భూతభర్తృ చ తజ్జ్ఞేయం
  గ్రసిష్ణు ప్రభవిష్ణు చ
 
 
 18.  
  జ్యోతిషామపి తజ్జ్యోతి
  స్తమసః పరముచ్యతే
  జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం
   హృది సర్వస్య విష్ఠితమ్
 
 
 19.  
  ఇతి క్షేత్రం తథా జ్ఞానం
   జ్ఞేయం చోక్తం సమాసతః
  మద్భక్త ఏతద్విజ్ఞాయ
  మద్భావాయోపపద్యతే
 
 
 20.  
  ప్రకృతిం పురుషం చైవ
  విద్ధ్యనాదీ ఉభావపి
  వికారాంశ్చ గుణాంశ్చైవ
  విద్ధి ప్రకృతిసంభవాన్ ౯
 
 
 21.  
  కార్యకరణకర్తృత్వే
   హేతుః ప్రకృతిరుచ్యతే
  పురుషః సుఖదుఃఖానాం
   భోక్తృత్వే హేతురుచ్యతే ౦
 Play This Verse
 
 22.  
  పురుషః ప్రకృతిస్థో హి
  భుఙ్‌క్తే ప్రకృతిజాన్గుణాన్
  కారణం గుణసఙ్గోఽస్య
   సదసద్యోనిజన్మసు
 
 
 23.  
  ఉపద్రష్టానుమన్తా చ
   భర్తా భోక్తా మహేశ్వరః
  పరమాత్మేతి చాప్యుక్తో
   దేహేఽస్మిన్పురుషః పరః
 
 
 24.  
  య ఏవం వేత్తి పురుషం
   ప్రకృతిం చ గుణైః సహ
  సర్వథా వర్తమానోఽపి
  న స భూయోఽభిజాయతే
 
 
 25.  
  ధ్యానేనాత్మని పశ్యన్తి
   కేచిదాత్మానమాత్మనా
  అన్యే సాంఖ్యేన యోగేన
  కర్మయోగేన చాపరే
 
 
 26.  
  అన్యే త్వేవమజానన్తః
  శ్రుత్వాన్యేభ్య ఉపాసతే
  తేఽపి చాతితరన్త్యేవ
  మృత్యుం శ్రుతిపరాయణాః
 
 
 27.  
  యావత్సంజాయతే కించి
  త్సత్త్వం స్థావరజఙ్గమమ్
  క్షేత్రక్షేత్రజ్ఞసంయోగా
  త్తద్విద్ధి భరతర్షభ
 
 
 28.  
  సమం సర్వేషు భూతేషు
   తిష్ఠన్తం పరమేశ్వరమ్
  వినశ్యత్స్వవినశ్యన్తం
   యఃపశ్యతి స పశ్యతి
 Play This Verse
 
 29.  
  సమం పశ్యన్హి సర్వత్ర
   సమవస్థితమీశ్వరమ్
  న హినస్త్యాత్మనాత్మానం
   తతో యాతి పరాం గతిమ్
 
 
 30.  
  ప్రకృత్యైవ చ కర్మాణి
   క్రియమాణాని సర్వశః
  యః పశ్యతి తథాత్మా
  నమకర్తారం స పశ్యతి ౯
 
 
 31.  
  యదా భూతపృథగ్భావ
  మేకస్థమనుపశ్యతి
  తత ఏవ చ విస్తారం
  బ్రహ్మ సంపద్యతే తదా ౦
 
 
 32.  
  అనాదిత్వాన్నిర్గుణత్వా
  త్పరమాత్మాయమవ్యయః
  శరీరస్థోఽపి కౌన్తేయ
   న కరోతి న లిప్యతే
 Play This Verse
 
 33.  
  యథా సర్వగతం సౌక్ష్మ్యా
  దాకాశం నోపలిప్యతే
  సర్వత్రావస్థితో దేహే
  తథాత్మా నోపలిప్యతే
 
 
 34.  
  యథా ప్రకాశయత్యేకః
  కృత్స్నం లోకమిమం రవిః
  క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం
   ప్రకాశయతి భారత
 Play This Verse
 
 35.  
  క్షేత్రక్షేత్రజ్ఞయోరేవ
  మన్తరం జ్ఞానచక్షుషా
  భూతప్రకృతిమోక్షం చ
   యే విదుర్యాన్తి తే పరమ్
 
 
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18