Tetagitulu with
 
 
 
 
Book Release Event
 
   Subscribe To Slokas
  
     
 
  Introduction
  Home
  Foreword
  Prayer
  What is Tetagiti ?
  Commentaries
  Provide Feedback
 
శ్రీమద్భగవద్గీత
తేటగీతులలొ తెనుగుసేత
  by Late Dr. P.V. Satyanarayana Rao
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ:
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18
 
  14. చతుర్దశాధ్యాయము : గుణత్రయవిభగయోగము
 
 1.  శ్రీ భగవానుడనెను:
  జ్ఞానములయందు నుత్తమజ్ఞానమైన
  పరమవిషయైకతత్త్వముమరల జెపుదు,
  ఇట్టిజ్ఞానము మును లెల్లరెఱిగి యుండి,
  పరమసంసిద్ధి బంధముబాసి కనిరి.
 
 
 2.  
  ఇట్టి జ్ఞానము నెవరాశ్రయింపగలరొ,
  వారు నాదు సాధర్మ్యరూపము వహింత్రు,
  సృష్టికాలము నందు జన్మింప బోరు,
  ప్రళయకాలము నందునువ్యథల బడరు.
 
 
 3.  
  యోనిగా మహద్బ్రహ్మమునుంచి నేను,
  సృష్టిబీజమ్ము నేనందుజేర్చియుంతు
  సంభవంబగు నీ భూతసంఘ మెల్ల
  నందు నుండియె యంచు నీవరయ వలయు.
 
 
 4.  
  ఎల్ల యోనుల యందుననెట్టి వేని,
  మూర్తదేహము లుద్భవమొందు నేని,
  తగగ మూలప్రకృతి వానితల్లియగును,
  తండ్రి నేనౌదు బీజప్రదాత నగుట.
 
 
 5.  
  భువిని సత్త్వ రజ స్తమములను మూడు
  ప్రభవ మొందును గుణములుప్రకృతి నుండి,
  దేహి నవ్యయ గుణము లీదేహ మందు
  పట్టి బంధించు సూ మహాబాహువీర!
 
 
 6.  
  సత్త్వగుణ మిది, మూడిటస్వచ్ఛ మగుట
  శాంతియుతమును మఱి కాంతిమంతమగును,
  జ్ఞాన సుఖముల తోడి సంగమును గూర్చి,
  బంధనము జేయు పురుషునిభరతవృషభ!
 
 
 7.  
  రాగములపుట్ట సుమ్మీ రజోగుణంబు,
  తృష్ణకా సంగమున కిదిహేతువగుచు,
  కామ్యకర్తల నాసక్తిగలుగ జేసి,
  దేహి నెంతయు పార్ఠ!బంధించు చుండు.
 
 
 8.  
  తమము నజ్ఞాన మందు నుద్భవము నొంది
  దేహధారుల నెల్ల సమ్మొహ పఱచి,
  మఱపు నలసత నిద్రలమఱగ జేసి,
  బంధనము జేయు లెస్సగాభరతవంశ్య!
 
 
 9.  
  సంగరతి గొల్పు సుఖ మందుసత్త్వగుణము,
  కామ్యకర్మల జేయింప గడగు రజము,
  తెలియు మర్జునా!తమ మిదిదేహి నెపుడు,
  మఱపు గొలుపును జ్ఞానముమాటుజేసి.
 
 
 10.  
  తమము రజములనణచి సత్త్వంబు ప్రబలు,
  ప్రబలు రజమట్లె తమము సత్త్వముల నణచి,
  అణచి ప్రబలును రెంటినినట్లె తమము,
  గుణము లొండొంటి నిట్లు లోగొనుచు నుండు.
 
 
 11.  
  ఎప్పు డీదేహమందు సర్వేంద్రియముల
  ద్వారముల నుండి జ్ఞాన దీపంబు వెలుగు,
  అపుడె సత్త్వగుణము వృద్ధియైన దనుచు,
  తెలిసికొనవలె నయ్య,కుంతీ కుమార!
 
 
 12.  
  లొభితనమును, కర్మవిలొలతయును,
  కామ్యకర్మల నాసక్తిగలుగుటయును,
  ఇచ్చయును మఱియు నశాంతియెపుడు గలుగు
  నపుడె తెలియుము రజము హెచ్చైన దనుచు.
 
 
 13.  
  సోమరితనంబు, మఱి బుద్ధిశూన్యతయును,
  మఱపు నొందుట, చిత్తముమఱులు గొంట,
  యెపుడు బుట్టుచు నుండునోయపుడె పార్థ!
  తమము హెచ్చిన దని నీవుతలప వలయు.
 
 
 14.  
  ఎపుడు సత్త్వగుణంబు వివృధ్ధ మగునొ,
  పురుషు డప్పుడ మరణముబొందు నేని,
  ఉత్తమజ్ఞానులగువారలుండు నట్టి,
  అమలలోకమ్ములకు నాతడరుగు పార్థ!
 
 
 15.  
  రజము బ్రబలము గాగ మరణము గలుగ,
  కర్మసంగుల జన్మముగలుగు చుండు,
  తమము హెచ్చిన స్థితియందుతనువు వీడ,
  మూఢయోనుల జన్మముపొందు చుండు.
 
 
 16.  
  సత్త్వగుణజాతకర్మసంచయమునకును
  నిర్మలజ్ఞాన సుఖములేనియతఫలము,
  రజసిక కర్మలకు దఃఖరసఫలంబు,
  కాని,యజ్ఞానమే తమఃకర్మఫలము.
 
 
 17.  
  సాత్వికమ్మున జ్ఞానము సంభవించు,
  రాజసమ్మున లోభమేప్రభవ మొందు,
  తామస గుణమ్ముచేతనుతఱుగ నట్టి,
  భ్రాంతి యజ్ఞానములును, బరాకు గలుగు.
 
 
 18.  
  సాత్త్వికులు నూర్ధ్వగతులకుజనుచు నుంద్రు,
  మధ్యగతులందు రాజసుల్మసలుచుంద్రు,
  నీచగుణవృత్తులందుననెలవు గొంట,
  నధమ గతులకు తామసులరుగుచుంద్రు.
 
 
 19.  
  ఎప్పు డీ గుణముల కన్ననితర మైన
  కర్త లేడని దర్శింపగలడొ ద్రష్ట,
  తెలిసికొను నెపుడు త్రిగుణాతీతపురుషు,
  నపుడె నాస్వరూపమ్ము వాడందు కొనును,
 
 
 20.  
  త్రిగుణముల నుండి పుట్టు నీదేహ మంచు
  తెలిసి వానికి దేహి యతీతు డగుచు,
  జన్మ మృత్యు జరా దుఃఖచయమునుండి,
  ముక్తుడై యమృతత్వముబొందు వాడు.
 
 
 21.  అర్జునుడనెను:
  గుణము లీమూటి నెట్టి లక్షణము లున్న
  నధిగమించినవాడగునతడు ప్రభువ!
  ఎట్టి యాచార, మెట్టి ప్రవృత్తియున్న,
  త్రిగుణవృత్తుల కాత డతీతు డగును.
 
 
 22.  శ్రీ భగవానుడనెను:
  సాత్త్వికప్రకాశము రాజస ప్రవృత్తి,
  తామసికమైన మోహముతగగ నెవ్వ
  డేది సంప్రాప్తమైన ద్వేషింప బోడొ,
  కలుగ కున్నను దానికైకాంక్ష నిడడొ;
 
 
 23.  
  ఎవ డుదాసీను భంగి వీక్షించు చుండి,
  ఎట్టి గుణములచేత చలింప బడడొ,
  వాని పను లందె గుణములువర్తిలునని,
  ఎంచి స్థిరచిత్తుడై చలియింప బోడొ;
 
 
 24.  
  స్వస్థచిత్తుడు, సుఖదఃఖసము డెవండొ,
  స్వర్ణ లోష్టాశ్మముల యందుసము డెవండొ,
  స్తుతులనిందలయందునతుల్యు డెవడొ,
  ధీరుడునుప్రియా ప్రియ సమధికు డెవడొ;
 
 
 25.  
  మానమందున, మఱి యవమానమందు,
  శత్రుమిత్రుల యెడ, సమస్వాంతు డెవడొ,
  సర్వకర్మల త్యజియించుజ్ఞాని యెవడొ,
  అట్టివాని గుణాతీతుడండ్రు పార్ఠ!
 Play This Verse
 
 26.  
  అనవరతము నన్నెవ్వ డనన్యమైన,
  భక్తియోగముచేత సేవలను సలుపు,
  త్రిగుణములు వీని కెవ్వ డతీతు డగునొ,
  బ్రహ్మసారూప్యతార్హతబడయు నతడు.
 
 
 27.  
  అవ్యయపదంబునకు, మోక్షమమృతమునకు,
  శాశ్వతంబైన ధర్మసంస్థానమునకు,
  జ్ఞానమునకు, నేకాంతికసౌఖ్యమునకు,
  స్థానమైన బ్రహ్మమున కాధార మేను.
 
 
 
 1.  శ్రీభగవానువాచ:
  పరం భూయః ప్రవక్ష్యామి
   జ్ఞానానాం జ్ఞానముత్తమమ్
  యజ్జ్ఞాత్వా మునయః
  సర్వే పరాం సిద్ధిమితో గతాః
 Play This Verse
 
 2.  
  ఇదం జ్ఞానముపాశ్రిత్య
   మమ సాధర్మ్యమాగతాః
  సర్గేఽపి నోపజాయన్తే
   ప్రలయే న వ్యథన్తి చ
 
 
 3.  
  మమ యోనిర్మహద్బ్రహ్మ
  తస్మిన్గర్భం దధామ్యహమ్
  సంభవః సర్వభూతానాం
   తతో భవతి భారత
 
 
 4.  
  సర్వయోనిషు కౌన్తేయ
  మూర్తయః సంభవన్తి యాః
  తాసాం బ్రహ్మ మహద్యోని
  రహం బీజప్రదః పితా
 Play This Verse
 
 5.  
  సత్త్వం రజస్తమ ఇతి
   గుణాః ప్రకృతిసంభవాః
  నిబధ్నన్తి మహాబాహో
   దేహే దేహినమవ్యయమ్
 
 
 6.  
  తత్ర సత్త్వం నిర్మలత్వా
  త్ప్రకాశకమనామయమ్
  సుఖసఙ్గేన బధ్నాతి
   జ్ఞానసఙ్గేన చానఘ
 Play This Verse
 
 7.  
  రజో రాగాత్మకం విద్ధి
   తృష్ణాసఙ్గసముద్భవమ్
  తన్నిబధ్నాతి కౌన్తేయ
   కర్మసఙ్గేన దేహినమ్
 Play This Verse
 
 8.  
  తమస్త్వజ్ఞానజం విద్ధి
  మోహనం సర్వదేహినామ్
  ప్రమాదాలస్యనిద్రాభి
  స్తన్నిబధ్నాతి భారత
 Play This Verse
 
 9.  
  సత్త్వం సుఖే సంజయతి
   రజః కర్మణి భారత
  జ్ఞానమావృత్య తు తమః
   ప్రమాదే సంజయత్యుత ౯
 
 
 10.  
  రజస్తమశ్చాభిభూయ
   సత్త్వం భవతి భారత
  రజః సత్త్వం తమశ్చైవ
  తమః సత్త్వం రజస్తథా ౦
 
 
 11.  
  సర్వద్వారేషు దేహేఽస్మి
  న్ప్రకాశ ఉపజాయతే
  జ్ఞానం యదా తదా విద్యా
  ద్వివృద్ధం సత్త్వమిత్యుత
 
 
 12.  
  లోభః ప్రవృత్తిరారమ్భః
  కర్మణామశమః స్పృహా
  రజస్యేతాని జాయన్తే
   వివృద్ధే భరతర్షభ
 
 
 13.  
  అప్రకాశోఽప్రవృత్తిశ్చ
   ప్రమాదో మోహ ఏవ చ
  తమస్యేతాని జాయన్తే
  వివృద్ధే కురునన్దన
 
 
 14.  
  యదా సత్త్వే ప్రవృద్ధే తు
   ప్రలయం యాతి దేహభృత్
  తదోత్తమవిదాం లోకా
  నమలాన్ప్రతిపద్యతే
 
 
 15.  
  రజసి ప్రలయం గత్వా
   కర్మసఙ్గిషు జాయతే
  తథా ప్రలీనస్తమసి
  మూఢయోనిషు జాయతే
 
 
 16.  
  కర్మణః సుకృతస్యాహుః
   సాత్త్వికం నిర్మలం ఫలమ్
  రజసస్తు ఫలం దుఃఖ
  మజ్ఞానం తమసః ఫలమ్
 
 
 17.  
  సత్త్వాత్సంజాయతే జ్ఞానం
   రజసో లోభ ఏవ చ
  ప్రమాదమోహౌ తమసో
   భవతోఽజ్ఞానమేవ చ
 
 
 18.  
  ఊర్ధ్వం గచ్ఛన్తి సత్త్వస్థా
   మధ్యే తిష్ఠన్తి రాజసాః
  జఘన్యగుణవృత్తిస్థా
  అధో గచ్ఛన్తి తామసాః
 
 
 19.  
  నాన్యం గుణేభ్యః కర్తారం
   యదా ద్రష్టానుపశ్యతి
  గుణేభ్యశ్చ పరం వేత్తి
   మద్భావం సోఽధిగచ్ఛతి ౯
 
 
 20.  
  గుణానేతానతీత్య త్రీ
  న్దేహీ దేహసముద్భవాన్
  జన్మమృత్యుజరాదుఃఖై
  ర్విముక్తోఽమృతమశ్నుతే ౦
 
 
 21.  అర్జున ఉవాచ:
  కైర్లిఙ్గైస్త్రీన్గుణానేతా
  నతీతో భవతి ప్రభో
  కిమాచారః కథం చైతాం
  స్త్రీన్గుణానతివర్తతే
 
 
 22.  శ్రీభగవానువాచ:
  ప్రకాశం చ ప్రవృత్తిం చ
   మోహమేవ చ పాణ్డవ
  న ద్వేష్టి సంప్రవృత్తాని
   న నివృత్తాని కాఙ్క్షతి
 
 
 23.  
  ఉదాసీనవదాసీనో
  గుణైర్యో న విచాల్యతే
  గుణా వర్తన్త ఇత్యేవ
   యోఽవతిష్ఠతి నేఙ్గతే
 
 
 24.  
  సమదుఃఖసుఖః స్వస్థః
  సమలోష్టాశ్మకాఞ్చనః
  తుల్యప్రియాప్రియో ధీర
  స్తుల్యనిన్దాత్మసంస్తుతిః
 
 
 25.  
  మానాపమానయోస్తుల్య
  స్తుల్యో మిత్రారిపక్షయోః
  సర్వారమ్భపరిత్యాగీ
   గుణాతీతః స ఉచ్యతే
 Play This Verse
 
 26.  
  మాం చ యోఽవ్యభిచారేణ
  భక్తియోగేన సేవతే
  స గుణాన్సమతీత్యైతా
  న్బ్రహ్మభూయాయ కల్పతే
 
 
 27.  
  బ్రహ్మణో హి ప్రతిష్ఠాహ
  మమృతస్యావ్యయస్య చ
  శాశ్వతస్య చ ధర్మస్య
  సుఖస్యైకాన్తికస్య చ
 
 
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18