Tetagitulu with
 
 
 
 
Book Release Event
 
   Subscribe To Slokas
  
     
 
  Introduction
  Home
  Foreword
  Prayer
  What is Tetagiti ?
  Commentaries
  Provide Feedback
 
శ్రీమద్భగవద్గీత
తేటగీతులలొ తెనుగుసేత
  by Late Dr. P.V. Satyanarayana Rao
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ:
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18
 
  15. పంచదశాధ్యాయము : పురుషోత్తమప్రాప్తియోగము
 
 1.  శ్రీ భగవానుడనెను:
  పైన వేళ్ళుండి కొమ్మలు బర్వు క్రింద,
  వేద మాకులౌ సంసార వృక్షమునకు,
  అవ్యయంబైన యశ్వత్థ మనెడు దీని
  వివర మెఱిగిన వాడె పో వేదవిదుడు.
 
 
 2.  
  వృక్షశాఖలు, త్రిగుణ ప్ర వృద్ధి నొంది,
  విషయ పల్లవముల తోడ విస్తరించు,
  నెగువ దిగువను వేళ్ళు వ్యా పించి క్రింద,
  కర్మబద్ధుల జేయు లో కాన ప్రజల.
 
 
 3.  
  ఇహమునం దిట్టిదని రూప మెఱుగ రాదు,
  ఆదిమధ్యాంతములు దీనివరయ లేవు,
  ఇట్టి ధృఢమూల యశ్వత్థ వృక్షమీవు,
  కూల నఱకుము వైరగ్య కులిశధార.
 
 
 4.  
  ఏ పదము జేర తిరిగి వా రిటకు రారొ,
  ఎవని నుండి యనాది ప్ర వృత్తి విరిసె,
  వానినే యాదిపురుషు, ప్ర పద్యుడనుచు,
  వెదుక దగు నాపరబ్రహ్మ పదము విడక.
 
 
 5.  
  ముక్తకాములు, నిర్మాన మోహమతులు,
  ముక్తసంగులు, ద్వంద్వ వి విముక్త ఘనులు,
  నిత్యమధ్యాత్మతత్త్వ వి నిష్థులైన
  జ్ఞాను లవ్యయపదమును గాంచ గలరు.
 Play This Verse
 
 6.  
  సూర్యుడగ్నియు చంద్రుడున్ చుక్కలన్ని,
  చేరి యేపదము వెలుగ జేయ లేరొ,
  ఏ పదము జేర తిరిగి వా రిటకు రారొ,
  అదియె నాపరమ నివాస పదము పార్థ!
 Play This Verse
 
 7.  
  జీవభూతముగా లోక జీవులందు,
  నలరు నాసనాతనమైన యంశ మొకటి,
  అదియె పంచేంద్రియముల, నా ఱగు మనస్సు
  ప్రకృతిగతమైన వానిని బట్టి లాగు
 
 
 8.  
  జీవు డీశరీరము పొంద జేరు నపుడు,
  మఱల నద్దాని విడిచి తా మరలు నపుడు,
  ఇంద్రియముల నీయాఱు గ్ర హించి చనును
  పూలతావిని గాలి కొం పోవునట్లు.
 
 
 9.  
  చెవియు, నేత్రము, చర్మము జిహ్వ, నాస
   యనెడు పంచేంద్రియమ్ముల మనసు తోడి,
  జీవు డీదేహ మం దధి ష్ఠించి యుండి,
  విషయముల వెంటనంటి సే వించు వాని
 
 
 10.  
  వెడలి చనువాడు, నించుండి వెలుగు వాడు,
  విషయభోక్తయు, గుణసమ న్వితుడునైన,
  జీవు నీమూఢజనులు ద ర్శింప లేరు,
  జ్ఞానచక్షువు గలవారు గాంత్రు వాని.
 
 
 11.  
  యత్నమున యోగిజనులు, శు ద్ధాత్మ యందె,
  ఆత్మ యందున్న పరమాత్మ నరయు చుంద్రు,
  యత్నపరులయ్యు, వా రశు ద్ధాత్ము లగుట,
  వాని దర్శింప జాలరు హీనమతులు.
 
 
 12.  
  సూర్యునందెట్టి తేజము సోకియుండి,
  జగము నంతయు భాసింప జాలి యుండు
  ఏది చంద్రాగ్నులను జేరి యెసగు నట్లె,
  తేజ మయ్యది నాదని తెలిసికొనుము.
 
 
 13.  
  భూమి జొచ్చియు నే సర్వ భూతములను,
  నెమ్మి ధరియింతు నోజో బ లమ్ము చేత,
  రసమయుండైన చంద్రుని రశ్మి చేత,
  పోషణము జేతు నేను స ర్వౌషధులను.
 
 
 14.  
  నేనె జఠరాగ్నినైన వై శ్వానరుండ,
  అఖిల ప్రాణుల దేహము లాశ్రయించి
  ఉచితరీతి ప్రాణాపానయుక్తముగను
  నాలుగువిధాన్నములను జీ ర్ణంబొనర్తు.
 
 
 15.  
  సకలజీవుల నుందు హృత్థ్సానమందు,
  నావలన గల్గు స్మృతియు జ్ఞా నమ్మపోహ,
  వేదితవ్యుడ నే సర్వ వేదములను,
  వేదకర్తను వేదాంత వేత్త నేను.
 
 
 16.  
  పురుషులిర్వురు గల రిందు భువన మందు,
  క్షరుడు, నక్షరుడను పేర్ల బఱగు వారు,
  సర్వభూతస్వరూపుని క్షరుడనండ్రు,
  నక్షరుం డండ్రు కూటస్థు డైన వాని.
 
 
 17.  
  కాని యుత్తమపురుషుడు కలడు వేరె,
  వాని బరమాత్మయని బుధు ల్పల్కుచుంద్రు,
  అతడె ముల్లోకముల నెల్ల నావరించి,
  అతడె పోషించు, నీశ్వరుం డవ్యయుండు.
 
 
 18.  
  క్షరుని కన్నను మఱియు న క్షరుని కన్న,
  నుత్తముండైన పురుషుగానొప్పు చుంట,
  అఖిలలోకాలు, వేదము లన్ని నన్ను,
  చెప్పు పురుషోత్తము డని బ్ర సిద్ధిగాను.
 
 
 19.  
  ఎవ్వడీ రీతి మౌఢ్య వి హీను డగుచు,
  అరయునో పురుషోత్తము డంచు నన్ను,
  సర్వభావములను మన సార నన్నె,
  భజన జేసి సర్వజ్ఞత బడయు నతడు.
 
 
 20.  
  గుహ్యతమమైన శాస్త్రము గూర్చి యిట్లు,
  తెలియ జెప్పితి ననఘ! వ త్సలత మెఱయ,
  చక్కగా దీనిని గ్రహింప జాలు నెవ్వ,
  డతడె జ్ఞానియై కృతకృత్యు డగును పార్థ!
 
 
 
 1.  శ్రీభగవానువాచ:
  ఊర్ధ్వమూలమధఃశాఖ
  మశ్వత్థం ప్రాహురవ్యయమ్
  ఛన్దాంసి యస్య పర్ణాని
   యస్తం వేద స వేదవిత్
 Play This Verse
 
 2.  
  అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా
  గుణప్రవృద్ధా విషయప్రవాలాః
  అధశ్చ మూలాన్యనుసంతతాని
  కర్మానుబన్ధీని మనుష్యలోకే
 
 
 3.  
  న రూపమస్యేహ తథోపలభ్యతే
  నాన్తో న చాదిర్న చ సంప్రతిష్ఠా
  అశ్వత్థమేనం సువిరూఢమూల
  మసఙ్గశస్త్రేణ దృఢేన ఛిత్త్వా
 
 
 4.  
  తతః పదం తత్పరిమార్గితవ్యం
  యస్మిన్గతా న నివర్తన్తి భూయః
  తమేవ చాద్యం పురుషం ప్రపద్యే
  యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ
 
 
 5.  
  నిర్మానమోహా జితసఙ్గదోషా
  అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః
  ద్వన్ద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞై
  ర్గచ్ఛన్త్యమూఢాః పదమవ్యయం తత్
 
 
 6.  
  న తద్భాసయతే సూర్యో
  న శశాఙ్కో న పావకః
  యద్గత్వా న నివర్తన్తే
  తద్ధామ పరమం మమ
 Play This Verse
 
 7.  
  మమైవాంశో జీవలోకే
  జీవభూతః సనాతనః
  మనఃషష్ఠానీన్ద్రియాణి
   ప్రకృతిస్థాని కర్షతి
 
 
 8.  
  శరీరం యదవాప్నోతి
   యచ్చాప్యుత్క్రామతీశ్వరః
  గృహిత్వైతాని సంయాతి
   వాయుర్గన్ధానివాశయాత్
 
 
 9.  
  శ్రోత్రం చక్షుః స్పర్శనం చ
   రసనం ఘ్రాణమేవ చ
  అధిష్ఠాయ మనశ్చాయం
   విషయానుపసేవతే ౯
 
 
 10.  
  ఉత్క్రామన్తం స్థితం వాపి
   భుఞ్జానం వా గుణాన్వితమ్
  విమూఢా నానుపశ్యన్తి
  పశ్యన్తి జ్ఞానచక్షుషః ౦
 
 
 11.  
  యతన్తో యోగినశ్చైనం
   పశ్యన్త్యాత్మన్యవస్థితమ్
  యతన్తోఽప్యకృతాత్మానో
   నైనం పశ్యన్త్యచేతసః
 
 
 12.  
  యదాదిత్యగతం తేజో
   జగద్భాసయతేఽఖిలమ్
  యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ
  తత్తేజో విద్ధి మామకమ్
 
 
 13.  
  గామావిశ్య చ భూతాని
   ధారయామ్యహమోజసా
  పుష్ణామి చౌషధీః సర్వాః
   సోమో భూత్వా రసాత్మకః
 
 
 14.  
  అహం వైశ్వానరో భూత్వా
   ప్రాణినాం దేహమాశ్రితః
  ప్రాణాపానసమాయుక్తః
  పచామ్యన్నం చతుర్విధమ్
 Play This Verse
 
 15.  
  సర్వస్య చాహం హృది సంనివిష్టో
  మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ
  వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
  వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్
 
 
 16.  
  ద్వావిమౌ పురుషౌ లోకే
   క్షరశ్చాక్షర ఏవ చ
  క్షరః సర్వాణి భూతాని
   కూటస్థోఽక్షర ఉచ్యతే
 
 
 17.  
  ఉత్తమః పురుషస్త్వన్యః
  పరమాత్మేత్యుదాహృతః
  యో లోకత్రయమావిశ్య
   బిభర్త్యవ్యయ ఈశ్వరః
 
 
 18.  
  యస్మాత్క్షరమతీతోఽహ
  మక్షరాదపి చోత్తమః
  అతోఽస్మి లోకే వేదే చ
   ప్రథితః పురుషోత్తమః
 
 
 19.  
  యో మామేవమసంమూఢో
  జానాతి పురుషోత్తమమ్
  స సర్వవిద్భజతి మాం
   సర్వభావేన భారత ౯
 
 
 20.  
  ఇతి గుహ్యతమం శాస్త్ర
  మిదముక్తం మయానఘ
  ఏతద్‌బుద్ధ్వా బుద్ధిమాన్స్యా
  త్కృతకృత్యశ్చ భారత ౦
 
 
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18