Tetagitulu with
 
 
 
 
Book Release Event
 
   Subscribe To Slokas
  
     
 
  Introduction
  Home
  Foreword
  Prayer
  What is Tetagiti ?
  Commentaries
  Provide Feedback
 
శ్రీమద్భగవద్గీత
తేటగీతులలొ తెనుగుసేత
  by Late Dr. P.V. Satyanarayana Rao
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ:
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18
 
  16. షోడశాధ్యాయము: దైవాసురసంపద్విభాగయోగము
 
 1.  
  చిత్తసంశుద్ధి నిర్భయచిత్తవృత్తి,
  జ్ఞానయోగమునందు నేకాగ్ర నిష్ఠ,
  సరళవర్తన, మింద్రియసంయమమును,
  తపము,యజ్ఞము,స్వాధ్యాయదానములును;
 
 
 2.  
  సత్యము, నహింస, త్యాగము,శాంతగుణము,
  కొండెబుద్ధియు, లేమి, నక్రోధ గుణము,
  భూతదయయును, చంచలబుద్ధిలేమి,
  లజ్జయును, మార్దవము, నలోలతయు మఱియు;
 
 
 3.  
  క్షమము, తేజము, ధృతియునుశౌచగుణము
  దురభిమానము లేమి, నద్రోహబుద్ధి,
  దైవసంపద జన్ముడైతనరు వాని
  గుణము లివి యనితెలియుముకురు కుమార!
 
 
 4.  
  దంభమును, క్రోధ మభిమానదర్పములును,
  పరగ నజ్ఞాన పరుషస్వభావములును,
  అసురసంపద జన్మకునర్హుడైన
  యతడు పొందెడు గుణము లంచరయు మీవు.
 
 
 5.  
  దైవసంపద మోక్షప్రదాయకంబు,
  అసురసంపద భవబంధమంట గట్టు,
  నీవు దైవాంశమునను జన్మించినావు,
  కాన, శోకింప వల దయ్యకౌరవేంద్ర
 
 
 6.  
  దైవిక మ్మాసుర మ్మనిధరణి యందు,
  రెండు విధములుగా భూతసృష్టి గలదు,
  వినిచితిని దైవికాంశముల్విస్తరముగ
  ఆసురాంశమ్ము లీ వికనాలకింపు.
 
 
 7.  
  ఎట్టి కర్మము లందు ప్రవృత్తివలయు,
  ఎట్టి కర్మము లందు నివృత్తివలయు,
  అసురభావము కలవారలరయ లేరు
  శుచియు సత్య మాచారముల్శూన్యమగుట
 
 
 8.  
  అసురు లప్రతిష్ఠ మసత్యమండ్రు జగతి,
  నీశ్వరుండును లేడనియెంత్రువారు,
  మిథునజన్యము కాని దేమియును లేదు
  కామహేతువు కానిదికలదె వేరె.
 
 
 9.  
  అట్టి నాస్తికదృష్టి వారాశ్రయించి
  అల్పమతులు,నీచులు వినష్టాత్ములైన,
  యుగ్రకర్ములు,శత్రువులుద్భవించి,
  జగము నశియించు కర్మలసలుపుచుంద్రు.
 
 
 10.  
  అపరిమితమైన కామమునాశ్రయించి,
  దంభ దర్పాభిమాన మదాన్వితులయి,
  ఎగ్గు తలపెట్టి యవివేకమగ్గలింప,
  కడగి వర్తింతు రపవిత్రకర్మలందు.
 
 
 11.  
  అపరిమితమైన చింతనమందు మునిగి,
  అంత్యకాలము వరకదియాశ్రయించి,
  కామభొగమె పరమ లక్ష్యముగ నెంచి,
  యిదియె పురుషార్ధమని నిశ్చయించు కొనుచు;
 
 
 12.  
  వందలును వేల యాశలబద్ధు లగుచు,
  కామ విక్రోధ పూర్ణులైగ్రాలు చుండి,
  గడన సేతురు కామ భోగార్థు లగుచు,
  కుటిలవృత్తుల ధనమునుకోట్లకొలది.
 
 
 13.  
  ఇదిగొ యీయాస్తి నాకు లభించె నేడు
  దీనిచే కోర్కెలెల్లనుతీర్చుకొందు,
  ఇదిగొ యీధనమంతయునిపుడ నాది,
  ఇంత ధన మిక ముందు నాకిట్లె యబ్బు;
 
 
 14.  
  ఈ విరోధిని హతమొనరించి నాడ,
  ఇట్లె యితరుల హతమొనరింతు గూడ,
  నేనె ఈశ్వరుడను, భోగినైన నేనె,
  నేనె బలశాలి, సిద్ధుడనేనె సుఖిని;
 
 
 15.  
  భాగ్యవంతుడ నే గొప్పవంశజుడను,
  ఇతరు డెవ్వడు సముడు నా కిచట గలడు,
  దాన మిడ, వేల్వ హర్షింపదగుదు నేనె,
  యనుచు నసురు లజ్ఞాన మోహమును బొంది;
 
 
 16.  
  బహుళవిషయైకచిత్త విభ్రాంతులగుచు,
  మోహజాలముచే చుట్టుముట్ట బడియు,
  విషయభోగప్రసక్తినివిడువ లేక,
  ఘోరనరకము నందునగూలు చుంద్రు.
 
 
 17.  
  ఆత్మసంభావితులు, స్తబ్దులవినయులును
  ధనమదాంధు లహంకారదర్పగుణులు,
  నామ మాత్రమే యైన యజ్ఞం బొనర్త్రు
  అవిధి పూర్వకముగ దంభమడర గాను.
 
 
 18.  
  అహము, బలమును, దర్పమునతిశయిల్ల,
  కామవిక్రోధములకునుకట్టువడుచు,
  స్వ పర దేహములందునవఱలు నన్ను,
  ఈసడింతురు విద్వేషహృదయు లగుచు.
 
 
 19.  
  క్రూర కర్ముల,విద్వేషపూరితులను,
  అశుభకర్మలు సల్పు నరాధములను
  అసురయోనుల యందె నేననవరతము,
  ఘోరసంసారములు పొందకూల ద్రోతు.
 
 
 20.  
  జన్మ జన్మకు నీమూఢజనులు పార్ఠ!
  అశుభయాసురయోనులేయాశ్రయించి,
  పొంద జాలకయే నన్నుపోవు చుందు
  రంత కంతకధోగతులందు జేర.
 
 
 21.  
  క్రోధమును కామమును లోభగుణము లనెడు
  మూడు ద్వారములు నరకమునకు గలవు,
  ఆత్మనాశనహేతువులైన వివ్వి,
  కాన, నీమూడు త్యజియింపగడగవలయు.
 
 
 22.  
  తమముతో జెలగు నరకద్వారములను,
  మూటి నుండియు నరుడు విముక్తి బొంది,
  ఆత్మశ్రేయస్కరంబైనదాచరించి,
  తత్ఫలంబగు పరమ పదంబు బొందు.
 
 
 23.  
  శాస్త్రవిధు లెవ్వడివి విసర్జనము జేసి,
  యిచ్చ వచ్చిన యట్లు వ ర్తించు చుండు,
  నెట్టి పురుషార్థసిద్ధినినెనయ డతడు,
  లేదు మోక్షము భువినైనలేదు సుఖము.
 Play This Verse
 
 24.  
  కాన, శాస్త్రమే నీకు బ్రమాణ మగును,
  కార్యము నకార్యమీవు నిక్కము గ్రహింప,
  శాస్త్రవిధు లన్ని చక్కగసంగ్రహించి,
  కర్మ మిల జేయ నర్హుడకమ్ము పార్ఠ!
 
 
 
 1.  
  అభయం సత్త్వసంశుద్ధి
  ర్జ్ఞానయోగవ్యవస్థితిః
  దానం దమశ్చ యజ్ఞశ్చ
   స్వాధ్యాయస్తప ఆర్జవమ్
 
 
 2.  
  అహింసా సత్యమక్రోధ
  స్త్యాగః శాన్తిరపైశునమ్
  దయా భూతేష్వలోలుప్త్వం
   మార్దవం హ్రీరచాపలమ్
 
 
 3.  
  తేజః క్షమా ధృతిః శౌచ
  మద్రోహో నాతిమానితా
  భవన్తి సంపదం దైవీ
  మభిజాతస్య భారత
 Play This Verse
 
 4.  
  దమ్భో దర్పోఽభిమానశ్చ
  క్రోధః పారుష్యమేవ చ
  అజ్ఞానం చాభిజాతస్య
  పార్థ సంపదమాసురీమ్
 Play This Verse
 
 5.  
  దైవీ సంపద్విమోక్షాయ
   నిబన్ధాయాసురీ మతా
  మా శుచః సంపదం దైవీ
  మభిజాతోఽసి పాణ్డవ
 
 
 6.  
  ద్వౌ భూతసర్గౌ లోకేఽస్మి
  న్దైవ ఆసుర ఏవ చ
  దైవో విస్తరశః ప్రోక్త
  ఆసురం పార్థ మే శృణు
 
 
 7.  
  ప్రవృత్తిం చ నివృత్తిం చ
   జనా న విదురాసురాః
  న శౌచం నాపి చాచారో
  న సత్యం తేషు విద్యతే
 
 
 8.  
  అసత్యమప్రతిష్ఠం తే
  జగదాహురనీశ్వరమ్
  అపరస్పరసంభూతం
   కిమన్యత్కామహైతుకమ్
 
 
 9.  
  ఏతాం దృష్టిమవష్టభ్య
   నష్టాత్మానోఽల్పబుద్ధయః
  ప్రభవన్త్యుగ్రకర్మాణః
  క్షయాయ జగతోఽహితాః ౯
 
 
 10.  
  కామమాశ్రిత్య దుష్పూరం
   దమ్భమానమదాన్వితాః
  మోహాద్‌గృహీత్వాసద్గ్రాహా
  న్ప్రవర్తన్తేఽశుచివ్రతాః ౦
 
 
 11.  
  చిన్తామపరిమేయాం చ
   ప్రలయాన్తాముపాశ్రితాః
  కామోపభోగపరమా
  ఏతావదితి నిశ్చితాః
 
 
 12.  
  ఆశాపాశశతైర్బద్ధాః
  కామక్రోధపరాయణాః
  ఈహన్తే కామభోగార్థ
  మన్యాయేనార్థసఞ్చయాన్
 
 
 13.  
  ఇదమద్య మయా లబ్ధ
  మిమం ప్రాప్స్యే మనోరథమ్
  ఇదమస్తీదమపి మే
   భవిష్యతి పునర్ధనమ్
 
 
 14.  
  అసౌ మయా హతః శత్రు
  ర్హనిష్యే చాపరానపి
  ఈశ్వరోఽహమహం భోగీ
   సిద్ధోఽహం బలవాన్సుఖీ
 
 
 15.  
  ఆఢ్యోఽభిజనవానస్మి
  కోఽన్యోఽస్తి సదృశో మయా
  యక్ష్యే దాస్యామి మోదిష్య
   ఇత్యజ్ఞానవిమోహితాః
 
 
 16.  
  అనేకచిత్తవిభ్రాన్తా
  మోహజాలసమావృతాః
  ప్రసక్తాః కామభోగేషు
   పతన్తి నరకేఽశుచౌ
 
 
 17.  
  ఆత్మసంభావితాః స్తబ్ధా
   ధనమానమదాన్వితాః
  యజన్తే నామయజ్ఞైస్తే
  దమ్భేనావిధిపూర్వకమ్
 
 
 18.  
  అహంకారం బలం దర్పం
   కామం క్రోధం చ సంశ్రితాః
  మామాత్మపరదేహేషు
   ప్రద్విషన్తోఽభ్యసూయకాః
 
 
 19.  
  తానహం ద్విషతః క్రురా
  న్సంసారేషు నరాధమాన్
  క్షిపామ్యజస్రమశుభా
  నాసురీష్వేవ యోనిషు ౯
 
 
 20.  
  ఆసురీం యోనిమాపన్నా
   మూఢా జన్మని జన్మని
  మామప్రాప్యైవ కౌన్తేయ
   తతో యాన్త్యధమాం గతిమ్ ౦
 
 
 21.  
  త్రివిధం నరకస్యేదం
  ద్వారం నాశనమాత్మనః
  కామః క్రోధస్తథా లోభ
  స్తస్మాదేతత్త్రయం త్యజేత్
 Play This Verse
 
 22.  
  ఏతైర్విముక్తః కౌన్తేయ
   తమోద్వారైస్త్రిభిర్నరః
  ఆచరత్యాత్మనః శ్రేయ
  స్తతో యాతి పరాం గతిమ్
 
 
 23.  
  యః శాస్త్రవిధిముత్సృజ్య
   వర్తతే కామకారతః
  న స సిద్ధిమవాప్నోతి న
  సుఖం న పరాం గతిమ్
 Play This Verse
 
 24.  
  తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం
   తే కార్యాకార్యవ్యవస్థితౌ
  జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం
  కర్మ కర్తుమిహార్హసి
 
 
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18