Tetagitulu with
 
 
 
 
Book Release Event
 
   Subscribe To Slokas
  
     
 
  Introduction
  Home
  Foreword
  Prayer
  What is Tetagiti ?
  Commentaries
  Provide Feedback
 
శ్రీమద్భగవద్గీత
తేటగీతులలొ తెనుగుసేత
  by Late Dr. P.V. Satyanarayana Rao
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ:
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18
 
  17. సప్తదశాధ్యాయము: శ్రద్ధాత్రయవిభాగము
 
 1.  అర్జునుడనెను:
  శాస్త్రవిధులను విడనాడి శ్రద్ధతోడ,
  అర్చనల నెవ్వ రేనియు నాచరింప,
  ఎట్టి నిష్ఠయొ వారి దీ వెఱుగ జెపుమ,
  సాత్త్వికమొ, రాజసమొ, తామ సంబొ కృష్ణ!
 
 
 2.  శ్రీ భగవానుడనెను:
  త్రివిధములు శ్రద్ధ లీ భువి దేహులందు,
  సాత్త్వికము, రాజసము తామ సంబు నాగ
  వారి వారి స్వభావమువలన గలుగు,
  పూర్వజన్మసంస్కారానుపూర్వకముగ.
 
 
 3.  
  సర్వమానవు లందున శ్రద్ధ గలుగు,
  వారి తొలిబాము సంస్కార భావ సరణి,
  ఈమనుష్యుండు పార్థ! శ్ర ద్ధామయుండు,
  ఎవని శ్రద్ధ యెట్టిదొ పూర్వ మిప్పు డదియె.
 Play This Verse
 
 4.  
  దేవతల యజియింత్రు సా త్త్వికజనంబు,
  రాక్షసుల, యక్షుల, యజింత్రు రాజసికులు,
  ప్రేత భూత గణంబు ల ర్చించు చుంద్రు
  తామసికులైన జనులు భూ తలము నందు.
 
 
 5.  
  దంభమాను లహంకార దర్పగుణులు,
  కామ, రాగ బలాన్విత గర్వమతులు,
  ఏవి మూఢులు శాస్త్ర వి హీనమైన,
  ఘోర తపముల జేయగా కోరుచుంద్రొ;
 
 
 6.  
  ఈ శరీరమందున్న స ర్వేంద్రియముల,
  ఆత్మ యందున్న పరమాత్మనైన నన్ను,
  కృఛ్రవ్రతములతో కృశి యింప జేయు,
  వారి నెఱుగుమ యసుర స్వ భావులనుచు.
 
 
 7.  
  ఇష్టమైన యాహారములెల్లరకును
  మూడు విధములు, శ్రద్ధలు మూటి వలెను,
  యజ్ఞ దాన తపోవిధు లట్లె గలవు,
  వినుము తెలిపెద వాని వి భేదములను.
 
 
 8.  
  ఆయురారోగ్యబలసత్త్వ దాయకములు,
  ప్రీతికరములు, సుఖశాంతి వృద్ధిదములు,
  స్థిరములును, రస్య హృద్య సు స్నిగ్ధములును,
  సాత్త్వికుల కిష్టమైన భో జనములగును.
 
 
 9.  
  కారమును, చేదు, పులుపుప్పు గలిగినవియు,
  ఎండినవి, దప్పి, వేడి గ ల్గించునవియు,
  శోక, రోగ, దుఃఖమ్ముల కాకరములు
  భోజనము లిష్టమైనవి రాజసులకు.
 
 
 10.  
  చల్దియైనవి తిన జవి జచ్చినవియు,
  పులిసియున్నవి, దుర్గంధ కలితములును,
  ఎంగిలైనవి పూజకు హేయములును,
  ఇష్టములు తామసజనుల కట్టి తిండ్లు.
 
 
 11.  
  ఎట్టి యజ్ఞము ఫలము నాశింప బోక,
  చేయ కర్తవ్యమని స్థిర చిత్తమెసగ,
  శాస్త్రనిర్దిష్టముగ నది సలుపబడిన,
  అట్టి యజ్ఞము సాత్త్విక మైన దగును.
 
 
 12.  
  కాని, యెట్టి యజ్ఞము ఫలా కాంక్ష జేసి,
  కేవలము డాంబికమునకు కీర్తికొఱకు,
  ఆచరింతురో పార్థ! నీ వరయ వలయు,
  నట్టి యజ్ఞము, రాజస మైన దనుచు.
 
 
 13.  
  శాస్త్రసమ్మతమే గాక శ్రద్ధ లేక,
  మంత్రమే లేక దక్షిణ మాటలేక,
  అన్నదానము లేక చే యంగ బడిన,
  యట్టి యజ్ఞము తామస మైన దండ్రు.
 
 
 14.  
  దేవ గురు భూసుర ప్రాజ్ఞ సేవనమును,
  శౌచ గుణమును హింసను సలుప కుంట,
  బ్రహ్మచర్యము సరళ ప్ర వర్తనమును,
  దైహికంబగు తపమని తలప బడును.
 
 
 15.  
  వాక్య మితరుల నుద్వేగ బఱప నిదియు,
  ప్రియము, హితమును, సత్యము బెంచు నదియు,
  సతతమును వేదశాస్త్రముల్ జదువుటయును,
  వాఙ్మయంబైన తపమని పల్క బడును.
 
 
 16.  
  చిత్తనైర్మల్యమును, సౌమ్య చిత్తవృత్తి,
  ఆత్మనిగ్రహమును వాఙ్ని యామకమును,
  భావసంశుద్ధి యనువాని భరత పుత్ర!
  మానసికమగు తప మని జ్ఞాను లండ్రు.
 
 
 17.  
  యుక్తచిత్తులునై ఫలా సక్తి లేక,
  త్రివిధమగు నిట్టి తపమును దీక్షబూని,
  సలుపగా నరులత్యంత శ్రద్ధతోడ,
  అట్టి తపమును సాత్త్విక మైన దండ్రు.
 
 
 18.  
  పూజ సత్కార మానముల్ పొందగోరి,
  దంభమడరగ తపమెట్టిదైనగాని,
  చేయ నది రాజసిక మని చెప్పబడును,
  అస్థిర మశాశ్వతమగు నట్టి దిలను.
 
 
 19.  
  మూఢ చిత్తులు దుర్నయ బుద్ధితోడ,
  తమకు పీడను గలిగించు తపముగాని,
  పరుల కెగ్గొనరించు త పంబుగాని,
  చేయ నది తామసిక మని చెప్పబడును.
 
 
 20.  
  దేశ కాల పాత్రములను దెలిసియుండి,
  దాన మెయ్యది తనకు క ర్తవ్యమనుచు,
  మరల నీయంగ జాలని నరుల కీయ,
  దాన మది సాత్త్వికం బని తలప బడును.
 
 
 21.  
  ఏది ప్రత్యుపకార మ ర్థించి కాని,
  ఏది ఫలము తిరిగి య పేక్షించి కాని,
  క్లేశ మొందుచు నిచ్చ లే కేది యొసగు,
  దాన మది రాజసిక మని తలపబడును.
 
 
 22.  
  దేశ కాలము లేమియు దెలిసికొనక,
  అతిథి సత్కారమే లేక యవగణించి,
  ఈవి యెట్టి దపాత్రున కిచ్చు నేని,
  దాన మది తామసికమని తలపబడును.
 
 
 23.  
  త్రివిధములుగ బ్రహ్మంబుగ ని ర్దేశ్య మయ్యె
  అనఘ! యిట్లు ఓంతత్సత్తులనెడు పేర్ల,
  ఆది యందట్టి బ్రహ్మము నందు నుండె
  బ్రాహ్మణులు, శ్రుతుల్, యజ్ఞముల్ బయలువెడలె.
 
 
 24.  
  కాన శాస్త్రనిర్దిష్టమౌ కర్మలైన
  యజ్ఞ దాన తపఃకర్మ లాచరింప,
  ఓమ్మనుచు నాదిలో నామ ముచ్చరింత్రు,
  సతతమును బ్రహ్మవాదులు సవ్యసాచి!
 
 
 25.  
  యజ్ఞములు జేయ, తపముల నాచరింప,
  వివిధ దాన ధర్మక్రియా విధు లొనర్ప,
  మోక్షకాములు, తచ్ఛబ్ద ముచ్చరింత్రు,
  ఫలము గోరక నాబ్రహ్మ పదము జేర.
 
 
 26.  
  సత్తన యదార్థవాచక సంజ్ఞ మగును,
  శ్రేష్ఠ మను నర్థమును గూడ జెప్పనగును,
  అఖిల శుభకర్మములు సల్పు నపుడు గూడ,
  వాడబడుచుండు సచ్చబ్ద వాచకంబు.
 
 
 27.  
  యజ్ఞ తపముల దానము లందు గలుగు,
  స్థితిని సత్తను పేరుతో చెప్పుచుంద్రు,
  భగవదర్థంబు కర్మల భక్తితోడ,
  చేయ నదియును సత్తని చెప్పబడును.
 
 
 28.  
  యజ్ఞ తపములు మఱియు దా నాది విధులు
  సలుపబడు నెట్టి కర్మలుశ్రద్ధ లేక,
  పార్థ! వాని నసత్తని పల్కుచుంద్రు,
  ఇహపరము లందు ఫలముల నీయవవ్వి.
 
 
 
 1.  అర్జున ఉవాచ:
  యే శాస్త్రవిధిముత్సృజ్య
  యజన్తే శ్రద్ధయాన్వితాః
  తేషాం నిష్ఠా తు కా కృష్ణ
   సత్త్వమాహో రజస్తమః
 
 
 2.  శ్రీభగవానువాచ:
  త్రివిధా భవతి శ్రద్ధా
   దేహినాం సా స్వభావజా
  సాత్త్వికీ రాజసీ చైవ
   తామసీ చేతి తాం శృణు
 Play This Verse
 
 3.  
  సత్త్వానురూపా సర్వస్య
   శ్రద్ధా భవతి భారత
  శ్రద్ధామయోఽయం పురుషో
   యో యచ్ఛ్రద్ధః స ఏవ సః
 
 
 4.  
  యజన్తే సాత్త్వికా దేవా
  న్యక్షరక్షాంసి రాజసాః
  ప్రేతాన్భూతగణాంశ్చాన్యే
  యజన్తే తామసా జనాః
 Play This Verse
 
 5.  
  అశాస్త్రవిహితం ఘోరం
   తప్యన్తే యే తపో జనాః
  దమ్భాహంకారసంయుక్తాః
  కామరాగబలాన్వితాః
 
 
 6.  
  కర్షయన్తః శరీరస్థం
  భూతగ్రామమచేతసః
  మాం చైవాన్తఃశరీరస్థం
   తాన్విద్ధ్యాసురనిశ్చయాన్
 
 
 7.  
  ఆహారస్త్వపి సర్వస్య
   త్రివిధో భవతి ప్రియః
  యజ్ఞస్తపస్తథా దానం
   తేషాం భేదమిమం శృణు
 
 
 8.  
  ఆయుఃసత్త్వబలారోగ్య
  సుఖప్రీతివివర్ధనాః
  రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా
  ఆహారాః సాత్త్వికప్రియాః
 
 
 9.  
  కట్‌వమ్లలవణాత్యుష్ణ
  తీక్ష్ణరూక్షవిదాహినః
  ఆహారా రాజసస్యేష్టా
   దుఃఖశోకామయప్రదాః ౯
 
 
 10.  
  యాతయామం గతరసం
   పూతి పర్యుషితం చ యత్
  ఉచ్ఛిష్టమపి చామేధ్యం
  భోజనం తామసప్రియమ్ ౦
 
 
 11.  
  అఫలాకాఙ్క్షిభిర్యజ్ఞో
  విధిదృష్టో య ఇజ్యతే
  యష్టవ్యమేవేతి మనః
   సమాధాయ స సాత్త్వికః
 
 
 12.  
  అభిసంధాయ తు ఫలం
   దమ్భార్థమపి చైవ యత్
  ఇజ్యతే భరతశ్రేష్ఠ
  తం యజ్ఞం విద్ధి రాజసమ్
 
 
 13.  
  విధిహీనమసృష్టాన్నం
   మన్త్రహీనమదక్షిణమ్
  శ్రద్ధావిరహితం యజ్ఞం
  తామసం పరిచక్షతే
 
 
 14.  
  దేవద్విజగురుప్రాజ్ఞ
  పూజనం శౌచమార్జవమ్
  బ్రహ్మచర్యమహింసా
  చ శారీరం తప ఉచ్యతే
 
 
 15.  
  అనుద్వేగకరం వాక్యం
  సత్యం ప్రియహితం చ యత్
  స్వాధ్యాయాభ్యసనం చైవ
   వాఙ్మయం తప ఉచ్యతే
 Play This Verse
 
 16.  
  మనః ప్రసాదః సౌమ్యత్వం
   మౌనమాత్మవినిగ్రహః
  భావసంశుద్ధిరిత్యేత
  త్తపో మానసముచ్యతే
 
 
 17.  
  శ్రద్ధయా పరయా తప్తం
  తపస్తత్త్రివిధం నరైః
  అఫలాకాఙ్క్షిభిర్యుక్తైః
  సాత్త్వికం పరిచక్షతే
 
 
 18.  
  సత్కారమానపూజార్థం
  తపో దమ్భేన చైవ యత్
  క్రియతే తదిహ ప్రోక్తం
  రాజసం చలమధ్రువమ్
 
 
 19.  
  మూఢగ్రాహేణాత్మనో
  యత్పీడయా క్రియతే తపః
  పరస్యోత్సాదనార్థం వా
   తత్తామసముదాహృతమ్ ౯
 
 
 20.  
  దాతవ్యమితి యద్దానం
   దీయతేఽనుపకారిణే
  దేశే కాలే చ పాత్రే చ
  తద్దానం సాత్త్వికం స్మృతమ్ ౦
 
 
 21.  
  యత్తు ప్రత్యుపకారార్థం
  ఫలముద్దిశ్య వా పునః
  దీయతే చ పరిక్లిష్టం
  తద్దానం రాజసం స్మృతమ్
 
 
 22.  
  అదేశకాలే యద్దాన
  మపాత్రేభ్యశ్చ దీయతే
  అసత్కృతమవజ్ఞాతం
   తత్తామసముదాహృతమ్
 
 
 23.  
  తత్సదితి నిర్దేశో
  బ్రహ్మణస్త్రివిధః స్మృతః
  బ్రాహ్మణాస్తేన వేదాశ్చ
   యజ్ఞాశ్చ విహితాః పురా
 
 
 24.  
  తస్మాదోమిత్యుదాహృత్య
  యజ్ఞదానతపఃక్రియాః
  ప్రవర్తన్తే విధానోక్తాః
  సతతం బ్రహ్మవాదినామ్
 
 
 25.  
  తదిత్యనభిసన్ధాయ
   ఫలం యజ్ఞతపఃక్రియాః
  దానక్రియాశ్చ వివిధాః
  క్రియన్తే మోక్షకాఙ్క్షిభిః
 
 
 26.  
  సద్భావే సాధుభావే చ
   సదిత్యేతత్ప్రయుజ్యతే
  ప్రశస్తే కర్మణి తథా
   సచ్ఛబ్దః పార్థ యుజ్యతే
 
 
 27.  
  యజ్ఞే తపసి దానే చ
   స్థితిః సదితి చోచ్యతే
  కర్మ చైవ తదర్థీయం
   సదిత్యేవాభిధీయతే
 
 
 28.  
  అశ్రద్ధయా హుతం దత్తం
   తపస్తప్తం కృతం చ యత్
  అసదిత్యుచ్యతే పార్థ
  న చ తత్ప్రేత్య నో ఇహ
 
 
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18