Tetagitulu with
 
 
 
 
Book Release Event
 
   Subscribe To Slokas
  
     
 
  Introduction
  Home
  Foreword
  Prayer
  What is Tetagiti ?
  Commentaries
  Provide Feedback
 
శ్రీమద్భగవద్గీత
తేటగీతులలొ తెనుగుసేత
  by Late Dr. P.V. Satyanarayana Rao
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ:
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18
 
  2. ద్వితీయాధ్యాయము : సాంఖ్య యోగము
 
 1.  
  అట్లు కృపచేత పరవశు డైనవాని,
  కన్నులశ్రు పూర్ణంబులై కలగువాని,
  బహువిషాదము నొందిన పాండుసుతుని,
  చూచి యీమాటలనె మధు సూదనుండు.
 Play This verse
 
 2.  
  ఇట్టి సమ్మోహ మర్జునా ! యెచటినుండి,
  విషమ సమయమునందు బ్రా ప్తించె నీకు,
  తగని దార్యుల కస్వర్గ దాయకమును,
  కరము నీ కిది యపకీర్తి కరముగాదె.
 Play This verse
 
 3.  
  దైన్యమును పొందవలదు కా తరుని భంగి,
  తగదు నీకిట్టి దీ యుద్ధ తరుణ మందు,
  తుచ్ఛమగు గాన హృదినున్న దుర్బలతను,
  త్రోసి లెమ్మిక విజయ ! శ త్రువుల దునుమ.
 Play This verse
 
 4.  
  తగుదునని యెట్లు రణమందు తాత భీష్మ,
  గురువరేణ్యుని ద్రోణుని గూడ నేను,
  సాయకములతో నెదురొడ్డ సాహసింతు,
  పూజనీయులు వారుగా మురవిదారి !
 Play This verse
 
 5.  
  గురువుల మహానుభావుల గూల్చు కంటె,
  ఇలను భిక్షాన్నమే భుజి యింప మేలు,
  కాని వధియింప గురులర్థ కాములంచు,
  కుడువ వలె వారి నెత్తురు కూడె మహిని.
 Play This verse
 
 6.  
  మనమె గెల్తుమో, గెల్తురో మనల వారె,
  శ్రేష్ఠతర మేదో తెలియదీ రెంట నాకు,
  ఎవరు హతులైన జీవింప నిష్టపడమొ,
  ధార్తరాష్ట్రులు వారలే తాకి రెదుట.
 
 
 7.  
  దీనుడను నాదు ధైర్యము దెబ్బతినెను,
  అడిగెదను ధర్మమూఢుడ నగుట మిమ్ము,
  శ్రేయ మేదియొ నాకు ని శ్చితము జెపుమ,
  శిష్యుడను మీ ప్రపన్ను శా సించి నన్ను.
 Play This verse
 
 8.  
  పృథ్వి రిపుశూన్యరాజ్య సం వృద్ధి గాని,
  పరగ నమరాధిపత్యము బడసి గాని,
  ఏది నా యీంద్రియముల ద హించు చుండె,
  నట్టి శోకాగ్ని జల్లార్చు నది యొఱుంగ .
 
 
 9.  
  ఆ గుడాకేశు డాశత్రు హంతకుండు
  యిట్లు మాటడి ,యా హృషీ కేశు తోడ,
  "చేయ యుద్ధము, గోవింద ! చేయ " నంచు,
  పల్కి యంతనె మౌన భా వము వహించె .
 
 
 10.  
  ఉభయ సేనల నడుమ గూ ర్చుండి యిట్లు,
  వగల బొగులుచు నున్న యా పార్ఠు జూచి,
  పరిహసించెడు లీల ని బ్భంగి బల్కె,
  మందహాసము జేయుచు మాధవుండు.
 
 
 11.  
  దుఃఖపడరానివారికైదుఃఖ పడుచు,
  ప్రాజ్ఞ వాక్యము లెన్నియోపల్కు దీవు,
  చన్న మఱియున్న తమబంధు సఖుల గూర్చి
  పండితులు పార్థ!దుఃఖాలపాలు గారు.
 Play This verse
 
 12.  
  నేను నీవును గాని యీనృపులు గాని,
  పూర్వ మెన్నడు లేక పోవుటయు లేదు,
  అట్లె యికముందు నీ మనమందఱమును
  లేక పోవుదు మనుమాటలేనె లేదు.
 Play This verse
 
 13.  
  దేహి జీవికి యీ స్థూలదేహమందు
  బాల్య,యౌవన,జర లెట్లుప్రాప్తమగునొ,
  అట్లె ప్రాప్తించు నితర దేహంబు గూడ,
  దీనిచే మోహితులు గారుధీరు లెవరు.
 Play This verse
 
 14.  
  కాని విషయేంద్రియంబులుకలుగ జేయు,
  భువిని శీతోష్ణ సుఖ దుఃఖములను పార్థ!
  వచ్చి పోయెడు నివి యశాశ్వతము గాన,
  వాని ధీరుడవై యోర్వవలయు నీవు.
 
 
 15.  
  పురుష వృషభమయే ధీర పురుషవరుని,
  యిట్టి ద్వంద్వాలు వ్యథలను బెట్ట లేవొ,
  సకల సుఖదుఃఖముల యెడసము డెవండొ,
  వాడె యర్హుండగు నమృత త్వమును బొంద.
 
 
 16.  
  ఉనికి లేకుంట సద్వస్తువునకు లేదు,
  ఉనికి యెన్న డసద్వస్తువునకు లేదు,
  అరసి చూచిరి యాత్మ దేహముల రెంటి,
  నిశితరూపము తత్వార్థనిపుణమతులు.
 Play This verse
 
 17.  
  ఏది సర్వమీ జగతి వ్యాపించి మించు,
  అరయు మద్దాని నవినాశినాత్మగాను,
  అవ్యయంబగు గాన నీయాత్మ నెవడు,
  చెఱుప జాలడు దానికిన్జేటు లేదు.
 Play This verse
 
 18.  
  ఆత్మదాల్చు శరీరములంత మొందు,
  నిత్యుడై యీశరీరుడునెగడు నండ్రు,
  ఆత్మయవినాశి యప్రమేయంబు పార్థ!
  కాన యుద్ధము చేయగాకడగు మీవు.
 
 
 19.  
  ఆత్మ నెవ్వడు తలచునోహంత యనియు,
  ఆత్మ నెవ్వడు యెంచునోహతుని గాను,
  వార లిర్వురు తెలియనివారె సుమ్ము,
  హంత కాదది మఱియునుహతము కాదు.
 
 
 20.  
  పుట్ట దొక్కప్పు డీయాత్మగిట్ట దెపుడు,
  ఉండి యొకపుడు మఱల లేకుండ బోదు,
  ఆత్మ నిత్యము శాశ్వతమజ మనాది,
  హతము కాదది హతము దేహంబె యగును.
 Play This verse
 
 21.  
  జనన మరణములును జరాక్షయము లేదు,
  ఆత్మ యవినాశి నిత్య మవ్యయ మజంబు,
  ఇట్లు తెలిసిన పూరుషుండెవ్వడైన,
  నెవని జంపించు,పార్థ !వాడెవని జంపు.
 
 
 22.  
  జీర్ణవస్త్రముల బరిత్యజించి నరుడు,
  క్రొత్త వస్త్రము లెట్లు తాకూర్మి దాల్చు,
  జీర్ణదేహముల బరిత్యజించి దేహి,
  క్రొత్త దేహము లట్లె చేకొనియు దాల్చు.
 Play This verse
 
 23.  
  శస్త్రములు నాత్మ ఛేదింపజాల నెపుడు,
  అగ్ని దహియింప జాల దీయాత్మ నెపుడు,
  జలము దీనిని తడుపంగజాల కుండు,
  గాలి యైనను యెండింపజాలి లేదు.
 Play This verse
 
 24.  
  చీల్చరానిది యీయాత్మకాల్ప బడదు,
  తడుప రానిది యెండింపతరము గాదు,
  శాశ్వతము నిత్య మీయాత్మసర్వగతము,
  స్థాణు వచలము బహు సనాతనము పార్థ!
 Play This verse
 
 25.  
  మనసు కందని దీయాత్మకనుల బడదు,
  ఆత్మ యవికారి యని, బుధులనుచునుంద్రు,
  ఇట్టిదని దీని నిజతత్వమెఱిగి యుండి,
  వగను బొందుట భారతాతగవు గాదు.
 
 
 26.  
  కాని యీయాత్మ నీవెల్లకాలములను,
  పుట్టి గిట్టెడిదని తలపోయు దేని,
  అట్టి పట్టున గూడ మహా భుజుండ!
  తగవుగాదిట్లు నీపు పెన్వగను జెంద.
 Play This verse
 
 27.  
  జనన మొందిన దానికిచావు ధ్రువము,
  మరణ మొందిన మరల జన్మంబు ధ్రువము,
  కాన, తప్పింప జాలని దాని గూర్చి,
  వగను బొగులగ నీ కిదితగవు గాదు.
 Play This verse
 
 28.  
  ఆది భూతము లవ్యక్తమగుచు నుండు,
  వ్యక్తమై తోచు మద్యమునందె పార్థ!
  నాశమై కూడ కావు ప్రకాశితములు,
  ఇట్టివానికి దుఃఖింపనేల నీవు.
 Play This verse
 
 29.  
  చూచు నొక్కడు దీనినిచోద్యమట్లు,
  చెప్పునొక్కడు దీనినిచిత్ర మట్లు,
  వినును వేరొక్కడిది యెంతొవింత యట్లు,
  అట్లగుట దీని నిజత త్వమరయ డెవడు.
 
 
 30.  
  అన్ని దెహము లందుననలరు చున్న,
  దెహి నిత్యుడు, వాని వధింప లేము,
  కాన, నీసర్వభూత సంఘముల గూర్చి,
  వగను బొందుట భారతా! తగునె నీకు.
 
 
 31.  
  స్వీయధర్మము మిగుల యోచించి కూడ,
  పార్థ! నీవిట్లు చలియింపపాడి గాదు,
  ధర్మయుద్ధముకన్న నీధరణి వేరె,
  కలుగ బోదెట్టి శ్రేయముక్షత్రియునకు.
 
 
 32.  
  అప్రయత్నముగానె,సం ప్రాప్తమగుచు,
  ద్వారములు దెఱ్చియుంచినస్వర్గమైన,
  యుద్ధ మిట్టిది లభియించుచుండు వారు,
  క్రీడి!సుఖవంతులైన క్షత్రియులు సుమ్ము.
 
 
 33.  
  కాని కౌంతేయ!యిపుడట్లుగాక నీవు,
  ధర్మ్య సంగ్రామమిది చేయదలప వేని,
  దాన నీకీర్తి నీక్షాత్రధర్మములను
  కోలుపడి ఘోరపాపముకొందు వీవు.
 
 
 34.  
  క్రీడి!జనులెల్ల నీయపకీర్తి గూర్చి,
  చిరము తరుగని కథలనుచెప్పుకొంద్రు,
  మానధనులకి ట్లపకీర్తిమాట బడుట,
  మరణమున కన్న మిగుల దుర్బరము గాదె.
 
 
 35.  
  భయముచే యుద్ధమందుండిపాఱి తనుచు,
  యీమహారథు లెల్ల నిన్నెంచు చుంద్రు,
  ఎవరు సమ్మాన్యుగా పూర్వమెంచినారొ,
  చులకనగ వారె, నిన్నికచూడగలరు.
 
 
 36.  
  నీదు సామర్థ్యమును వారునింద జేసి,
  నోట వచియింపగారానిమాట లెన్నొ,
  పల్కుచుందురు నీ శత్రుపక్ష జనులు,
  ఇంతకును మిన్న దుఃఖమింకేమి గలదు.
 
 
 37.  
  హతుడవో స్వర్గసుఖములెయబ్బు నీకు,
  గెల్తువో నీవు రహిని భోగింతు విలను,
  కాన లెమ్మిక కౌంతేయకలత దేఱి,
  యుద్ధమును జేయ కృతనిశ్చయుండ వగుచు.
 
 
 38.  
  కష్ట సుఖములు, మఱి లాభనష్టములును,
  జయ పరాజయములనెల్లసమత నెంచి,
  పిదప సిద్ధము గమ్మీవు పెనగి పోర,
  పాపమును పొంద వీవిట్టి పథము గొనిన.
 
 
 39.  
  ఆత్మతత్వము నిట్లు, సాంఖ్యమున జెపితి,
  కాని,నీవెట్టి జ్ఞానము కలిగి యున్న,
  కర్మబంధము లన్నియున్ కట్టు వాయు,
  కర్మయోగము వినుమదికౌరవేంద్ర!
 
 
 40.  
  కొంత సాధించి విడిచిన కొఱత లేదు,
  ప్రత్యవాయము దానిచేపడయ రాదు,
  ఇమ్మహాధర్మ్య మించుకయేని సేయ,
  కాచు భవభయఘోరసాగరము నుండి.
 
 
 41.  
  నిశ్చయాత్మకమై యొకేనిష్ఠ నుండు,
  పార్థ! నిష్కామయోగియౌవాని బుద్ధి,
  చంచలాత్మకు,నవ్యవసాయబుద్ధి,
  వివిధ శాఖోప శాఖలైవిస్తరించు.
 
 
 42.  
  స్వర్గమున కన్న నన్యాపవర్గ మేది,
  పొంద లే దిహ పరకర్మములను జేయ,
  వేదవాదము లందల్పవేదులిట్లు,
  పల్కుచుందురు పుష్పితవాక్యములను.
 
 
 43.  
  కర్మఫలమైన జన్మముకలుగ జేయు,
  సిరియు నైశ్వర్య భోగముల్సెంద జేయు,
  బహువిధములైన కర్మలపలుకుచుంద్రు,
  కామచిత్తులు స్వర్లోకకాము లగుచు.
 
 
 44.  
  సకలసుఖభోగభాగ్య ప్రసక్తి చేత,
  చిత్త మెవరిది యిట్లు వచింప బడునొ,
  వారలను నిశ్చయంబుగవారి బుద్ధి,
  నిశ్చల సమాధియందుననిలుపలేదు.
 
 
 45.  
  వేదములు జెప్పు త్రైగుణ్యవిషయములను,
  కాని,త్రైగుణ్యుడవు నీవుగాకు పార్థ!
  ద్వంద్వముల బాసి,నిత్య సత్త్వస్థు డగుము,
  క్షేమ యోగము వీగి దర్శింపు మాత్మ.
 
 
 46.  
  నీర మంతట వెల్లువైనిండి యుండ,
  కూపజలమెంత పని సమకూర్ప గలుగు,
  సర్వ వేదముల వలని సాయ మంతె,
  కర్మఫలవేత్త బ్రహ్మ విజ్ఞాని కగును.
 
 
 47.  
  కలదు నీకధికారముకర్మమందె,
  లేదు ఫలమునం దెన్నడులేశ మైన,
  కర్మఫలహేతు వైననుగాకు మీవు,
  కాని సంగివి గాకు మకర్మమందు.
 
 
 48.  
  కర్మఫలములయందు సంగమును వీడి,
  సిద్ధ్యసిద్ధులలో సమస్థితిని నుండి,
  యోగయుక్తుడవై కర్మమూని సలుపు,
  మట్టి సమభావమే యోగమండ్రు బుధులు.
 
 
 49.  
  కామ్యకర్మము లందాసగలిగి యుంట,
  కరము నీచము బుద్ధియోగమ్ము కంటె,
  బుద్ధియోగమె శరణముపొంద నెమకు,
  ఫలము గోరెడువారు కృపణులు పార్థ!
 
 
 50.  
  ఎవడు సమబుద్ధియుక్తుడై యెసగు నతడె,
  పాప పుణ్యఫలంబులబాయు నిలనె,
  కాన నిష్కామకర్మయోగంబె సలుపు,
  కర్మముల కౌశలంబె యోగంబు విజయ.
 
 
 51.  
  ఒనర బ్రాజ్ఞులు నిష్కామయోగివరులు,
  కర్మ జాతఫలంబులకాంక్ష బాసి,
  జన్మ బంధాలనుండి మోక్షమును బొంది,
  చేటెఱుంగని చోటునుజేరుకొనిరి.
 
 
 52.  
  మోహపంకము నందునమునగబోక,
  దాట గలుగునొ నీబుద్ధిదాని నెపుడు,
  విన్న విననున్న ప్రతిఫలవిషయమందు,
  అర్జునా! నీకు నిర్వేదమపుడె యబ్బు.
 
 
 53.  
  వివిధకర్మఫలంబులవినుట చేత,
  చెదరి పోయిన నీబుద్ధిస్థిరముగాను,
  నిశ్చలముగ సమాధిలోనిలుచు నెప్పు,
  డప్పుడే యోగ మర్జునాయబ్బు నీకు.
 
 
 54.  
  స్థిరసమాధిష్ఠు నిష్ఠ యేతీరునున్న,
  పల్కబడు కేశవా!స్థితప్రజ్ఞు డనగ,
  ఎట్లు మాటాడు, స్థితధీరుడెట్టులుండు,
  ఎట్లు కూర్చుండు వర్తనమెట్టులుండు.
 
 
 55.  
  మనసు బెనవేసి మసలు కామముల నెవడు,
  సర్వమెప్పుడు మనసారసంత్యజించి,
  అత్మచే పొందు సంతుష్టినాత్మయందె,
  అట్టివాని స్థితప్రజ్ఞుడందు రపుడు.
 Play This verse
 
 56.  
  దుఃఖేష్వనుద్విగ్నమనాః
  సుఖేషు విగతస్పృహః
  వీతరాగభయక్రోధ
  స్థితధీర్మునిరుచ్యతే
 
 
 57.  
  ఎవ్వడసక్తి శూన్యుడైయెల్లయెడల
  శుభములశుభము లెయ్యేవిచొప్పడి విన,
  హర్ష విద్వేషముల మదినడర నీడో,
  అతని ప్రజ్ఞ ప్రతిష్ఠితమైన దగును.
 
 
 58.  
  కూర్మమంగము లన్ని లోగొనెడు భంగి,
  విషయముల నుండి యింద్రియవితతి నెల్ల,
  ఎప్పు డీయోగి వెనుకకుద్రిప్పునపుడె,
  అతని ప్రజ్ఞ ప్రతిష్టిత మైన దగును.
 
 
 59.  
  దేహి విషయ నిరాహారదీక్ష నున్న,
  యింద్రియార్థములను నిగ్రహించు గాని,
  విషయతృష్ణయు వానినివీడ కుండు,
  పరము దర్శింప బాయు, పిపాస కూడ.
 
 
 60.  
  పార్థ ! పురుషు డెంతటి యత్నపరుడు గాని,
  యెట్టి విజ్ఞాని గాని,యీయింద్రియములు,
  కలతలను బెట్టియును బలాత్కారముగను,
  వాని మనసును తమవైపు పట్టిలాగు.
 
 
 61.  
  అట్టి యింద్రియములనెల్లనణచి యుంచి,
  యోగమందు మత్పరత గూర్చుండ వలయు,
  యింద్రియములట్లు స్వాధీనమెవని కగునొ,
  అతని ప్రజ్ఞ ప్రతిష్ఠితమైన దగును.
 
 
 62.  
  విషయ చింతన జేయు పూరుషున కెపుడు,
  విషయసుఖముల యందాసవిడువ కుండు,
  కామములు గల్గు విషయ సంగమము వలన,
  కోరికలవల్ల బుట్టును క్రోధ గుణము.
 
 
 63.  
  అట్టి క్రోధంబు వలన మోహంబు పుట్టు,
  మోహమందుండి విస్మృతిబుట్టు చుండు,
  స్మృతియు నశియింప బుద్ధి నశించు సుమ్ము,
  బుద్ధి నశియింప భ్రష్టుడైపోవు నతడు.
 
 
 64.  
  కాన రాగవిద్వేషముల్కడకు ద్రోసి,
  యింద్రియములన్ని విషయ ప్రవృత్తమయ్యు,
  ఆత్మస్వాధీనమై యవియలరుచున్న
  సంయతాత్ముడు బొందు, ప్రసాదసిద్ధి.
 
 
 65.  
  చిత్తనైర్మల్య మాతడుచెంది యున్న
  సకల సుఖదుఃఖములు నుపశమన మొందు,
  శాంత చిత్తుడునైన ప్రసన్నబుద్ధి
  నిశ్చలత శీఘ్రమే బ్రహ్మనిష్ఠ నుండు.
 
 
 66.  
  ఒనర దాత్మైకబుద్ధి యయుక్తునకును,
  బ్రహ్మభావ మయుక్తుడుబడయ లేడు,
  శాంతి గలుగదు పరమార్ధచింతలేక,
  శాంతి లేకున్న సుఖమెట్లుసంభవించు.
 
 
 67.  
  విషయగతమైన యింద్రియవితతి యందు,
  మనసు నెద్దాని దవిలి తామరలు చుండు,
  అతని ప్రజ్ఞ నాయింద్రియమ్మపహరించు,
  గాలి నావను నీటిపైకలచుమాడ్కి.
 
 
 68.  
  కాన, అర్జునా! యింద్రియకరణములను,
  విషయముల వెంట బడనీకవెనుక ద్రిప్పి,
  ఎవ్వ డన్నియెడల నిగ్రహింప గలడొ,
  అతని ప్రజ్ఞ ప్రతిష్ఠితమైన దగును.
 
 
 69.  
  సర్వ భుతములకు నిశాసమయ మేదొ,
  సంయమీంద్రుడు మేల్కొనుసమయ మదియె,
  సర్వ భుతముల్ మేల్కొనుసమయ మేదొ,
  ఆత్మ దర్శించు మౌని కయ్యదియె రాత్రి.
 
 
 70.  
  నీరు నిండుగ నదులన్నిజేర నెట్లు,
  కడలి పొంగదొ చెలియలికట్టదాటి,
  కామములు నట్లె చేరగాకలగ నతడె,
  పొందు శాంతిని, కామోపభొగి కాదు.
 
 
 71.  
  నేను నాదను భావమునెగడ నీక,
  సర్వకామములను మనసార విడచి,
  విషయ వాంఛల పురుషుండువీడు నెవడు,
  పరమశాంతి పదంబునుబడయు నతడె.
 Play This verse
 
 72.  
  ఇదియె బ్రాహ్మీస్థితియనినీవెఱుగు పార్థ!
  మోహమొందడు దీనినిపొందు వాడు,
  అట్టి స్థితినున్న పోకాలమందు గూడ,
  బ్రహ్మనిర్వాణ మాతడు పడయ గలడు.
 Play This verse
 
 
 1.  
  తం తథా కృపయావిష్ట
  మశ్రుపూర్ణాకులేక్షణమ్
  విషీదన్తమిదం వాక్య
  మువాచ మధుసూదనః
 
 
 2.  
  కుతస్త్వా కశ్మలమిదం
  విషమే సముపస్థితమ్
  అనార్యజుష్టమస్వర్గ్య
  మకీర్తికరమర్జున
 
 
 3.  
  క్లైబ్యం మా స్మ గమః పార్థ
  నైతత్త్వయ్యుపపద్యతే
  క్షుద్రం హృదయదౌర్బల్యం
  త్యక్త్వోత్తిష్ఠ పరన్తప
 
 
 4.  
  కథం భీష్మమహం సంఖ్యే
  ద్రోణం చ మధుసూదన
  ఇషుభిః ప్రతి యోత్స్యామి
  పూజార్హావరిసూదన
 
 
 5.  
  గురూనహత్వా హి మహానుభావాన్
  శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే
  హత్వార్థకామాంస్తు గురూనిహైవ
  భుఞ్జీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్
 
 
 6.  
  న చైతద్విద్మః కతరన్నో గరీయో
  యద్వా జయేమ యది వా నో జయేయుః
  యానేవ హత్వా న జిజీవిషామ
  స్తేఽవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః
 
 
 7.  
  కార్పణ్యదోషోపహతస్వభావః
  పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః
  యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
  శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్
 
 
 8.  
  న హి ప్రపశ్యామి మమాపనుద్యాద్
  యచ్ఛోకముచ్ఛోషణమిన్ద్రియాణామ్
  అవాప్య భూమావసపత్నమృద్ధం
  రాజ్యం సురాణామపి చాధిపత్యమ్
 
 
 9.  
  ఏవముక్త్వా హృషీకేశం
  గుడాకేశః పరన్తప
  న యోత్స్య ఇతి గోవిన్ద
  ముక్త్వా తూష్ణీం బభూవ హ ౯
 
 
 10.  
  తమువాచ హృషీకేశః
  ప్రహసన్నివ భారత
  సేనయోరుభయోర్మధ్యే
  విషీదన్తమిదం వచః
 
 
 11.  
  అశోచ్యానన్వశోచస్త్వం
  ప్రజ్ఞావాదాంశ్చ భాషసే
  గతాసూనగతాసూంశ్చ
  నానుశోచన్తి పణ్డితాః
 Play This verse
 
 12.  
  న త్వేవాహం జాతు నాసం
  న త్వం నేమే జనాధిపాః
  న చైవ న భవిష్యామః
  సర్వే వయమతః పరమ్
 
 
 13.  
  దేహినోఽస్మిన్యథా దేహే
  కౌమారం యౌవనం జరా
  తథా దేహాన్తరప్రాప్తి
  ర్ధీరస్తత్ర న ముహ్యతి
 Play This verse
 
 14.  
  మాత్రాస్పర్శాస్తు కౌన్తేయ
  శీతోష్ణసుఖదుఃఖదాః
  ఆగమాపాయినోఽనిత్యా
  స్తాంస్తితిక్షస్వ భారత
 
 
 15.  
  యం హి న వ్యథయన్త్యే
  తే పురుషం పురుషర్షభ
  సమదుఃఖసుఖం ధీరం
  సోఽమృతత్వాయ కల్పతే
 
 
 16.  
  నాసతో విద్యతే భావో
  నాభావో విద్యతే సతః
  ఉభయోరపి దృష్టోఽన్త
  స్త్వనయోస్తత్త్వదర్శిభిః
 
 
 17.  
  అవినాశి తు తద్విద్ధి
  యేన సర్వమిదం తతమ్
  వినాశమవ్యయస్యాస్య
  న కశ్చిత్కర్తుమర్హతి
 
 
 18.  
  అన్తవన్త ఇమే దేహా
  నిత్యస్యోక్తాః శరీరిణః
  అనాశినోఽప్రమేయస్య
  తస్మాద్యుధ్యస్వ భారత
 
 
 19.  
  య ఏనం వేత్తి హన్తారం
  యశ్చైనం మన్యతే హతమ్
  ఉభౌ తౌ న విజానీతో
  నాయం హన్తి న హన్యతే౯
 
 
 20.  
  న జాయతే మ్రియతే వా కదాచి
  న్నాయం భూత్వా భవితా వా న భూయః
  అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో
  న హన్యతే హన్యమానే శరీరే ౦
 
 
 21.  
  వేదావినాశినం నిత్యం
  య ఏనమజమవ్యయమ్
  కథం స పురుషః పార్థ
  కం ఘాతయతి హన్తి కమ్
 
 
 22.  
  వాసాంసి జీర్ణాని యథా విహాయ
  నవాని గృహ్ణాతి నరోఽపరాణి
  తథా శరీరాణి విహాయ జీర్ణా
  న్యన్యాని సంయాతి నవాని దేహీ
 Play This verse
 
 23.  
  నైనం ఛిన్దన్తి శస్త్రాణి
  నైనం దహతి పావకః
  న చైనం క్లేదయన్త్యాపో
  న శోషయతి మారుతః
 Play This verse
 
 24.  
  అచ్ఛేద్యోఽయమదాహ్యోఽ
  యమక్లేద్యోఽశోష్య ఏవ చ
  నిత్యః సర్వగతః స్థాణు
  రచలోఽయం సనాతనః
 
 
 25.  
  అవ్యక్తోఽయమచిన్త్యోఽయ
  మవికార్యోఽయముచ్యతే
  తస్మాదేవం విదిత్వైనం
   నానుశోచితుమర్హసి
 
 
 26.  
  అథ చైనం నిత్యజాతం
  నిత్యం వా మన్యసే మృతమ్
  తథాపి త్వం మహాబాహో
  నైవం శోచితుమర్హసి
 
 
 27.  
  జాతస్య హి ధ్రువో మృత్యు
  ర్ధ్రువం జన్మ మృతస్య చ
  తస్మాదపరిహార్యేఽర్థే న
  త్వం శోచితుమర్హసి
 Play This verse
 
 28.  
  అవ్యక్తాదీని భూతాని
  వ్యక్తమధ్యాని భారత
  అవ్యక్తనిధనాన్యేవ
  తత్ర కా పరిదేవనా
 
 
 29.  
  ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేన
  మాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః
  ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి
  శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్౯
 
 
 30.  
  దేహీ నిత్యమవధ్యోఽయం
  దేహే సర్వస్య భారత
  తస్మాత్సర్వాణి భూతాని
  న త్వం శోచితుమర్హసి౦
 
 
 31.  
  స్వధర్మమపి చావేక్ష్య
  న వికమ్పితుమర్హసి
  ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోఽన్య
  త్క్షత్రియస్య న విద్యతే
 
 
 32.  
  యదృచ్ఛయా చోపపన్నం
  స్వర్గద్వారమపావృతమ్
  సుఖినః క్షత్రియాః పార్థ
  లభన్తే యుద్ధమీదృశమ్
 
 
 33.  
  అథ చేత్త్వమిమం ధర్మ్యం
  సంగ్రామం న కరిష్యసి
  తతః స్వధర్మం కీర్తిం చ
  హిత్వా పాపమవాప్స్యసి
 
 
 34.  
  అకీర్తిం చాపి భూతాని
  కథయిష్యన్తి తేఽవ్యయామ్
  సమ్భావితస్య చాకీర్తి
  ర్మరణాదతిరిచ్యతే
 
 
 35.  
  భయాద్రణాదుపరతం
  మంస్యన్తే త్వాం మహారథాః
  యేషాం చ త్వం బహుమతో
   భూత్వా యాస్యసి లాఘవమ్
 
 
 36.  
  అవాచ్యవాదాంశ్చ బహూ
  న్వదిష్యన్తి తవాహితాః
  నిన్దన్తస్తవ సామర్థ్యం
   తతో దుఃఖతరం ను కిమ్
 
 
 37.  
  హతో వా ప్రాప్స్యసి స్వర్గం
   జిత్వా వా భోక్ష్యసే మహీమ్
  తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ
  యుద్ధాయ కృతనిశ్చయః
 Play This verse
 
 38.  
  సుఖదుఃఖే సమే కృత్వా
  లాభాలాభౌ జయాజయౌ
  తతో యుద్ధాయ యుజ్యస్వ
  నైవం పాపమవాప్స్యసి
 
 
 39.  
  ఏషా తేఽభిహితా సాంఖ్యే
   బుద్ధిర్యోగే త్విమాం శృణు
  బుద్ధ్యా యుక్తో యయా పార్థ
   కర్మబన్ధం ప్రహాస్యసి౯
 
 
 40.  
  నేహాభిక్రమనాశోఽస్తి
   ప్రత్యవాయో న విద్యతే
  స్వల్పమప్యస్య ధర్మస్య
   త్రాయతే మహతో భయాత్
 
 
 41.  
  వ్యవసాయాత్మికా బుద్ధి
  రేకేహ కురునన్దన
  బహుశాఖా హ్యనన్తాశ్చ
   బుద్ధయోఽవ్యవసాయినామ్
 
 
 42.  
  యామిమాం పుష్పితాం వాచం
   ప్రవదన్త్యవిపశ్చితః
  వేదవాదరతాః పార్థ
   నాన్యదస్తీతి వాదినః
 
 
 43.  
  కామాత్మానః స్వర్గపరా
   జన్మకర్మఫలప్రదామ్
  క్రియావిశేషబహులాం
   భోగైశ్వర్యగతిం ప్రతి
 
 
 44.  
  భోగైశ్వర్యప్రసక్తానాం
   తయాపహృతచేతసామ్
  వ్యవసాయాత్మికా బుద్ధిః
   సమాధౌ న విధీయతే
 
 
 45.  
  త్రైగుణ్యవిషయా వేదా
   నిస్త్రైగుణ్యో భవార్జున
  నిర్ద్వన్ద్వో నిత్యసత్త్వస్థో
  నిర్యోగక్షేమ ఆత్మవాన్
 
 
 46.  
  యావానర్థ ఉదపానే
   సర్వతః సంప్లుతోదకే
  తావాన్సర్వేషు వేదేషు
   బ్రాహ్మణస్య విజానతః
 
 
 47.  
  కర్మణ్యేవాధికారస్తే
   మా ఫలేషు కదాచన
  మా కర్మఫలహేతుర్భూ
  ర్మా తే సఙ్గోఽస్త్వకర్మణి
 Play This verse
 
 48.  
  యోగస్థః కురు కర్మాణి
   సఙ్గం త్యక్త్వా ధనంజయ
  సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా
   సమత్వం యోగ ఉచ్యతే
 
 
 49.  
  దూరేణ హ్యవరం కర్మ
   బుద్ధియోగాద్ధనంజయ
  బుద్ధౌ శరణమన్విచ్ఛ
   కృపణాః ఫలహేతవః
 
 
 50.  
  బుద్ధియుక్తో జహాతీహ
   ఉభే సుకృతదుష్కృతే
  తస్మాద్యోగాయ యుజ్యస్వ
   యోగః కర్మసు కౌశలమ్
 
 
 51.  
  కర్మజం బుద్ధియుక్తా హి
   ఫలం త్యక్త్వా మనీషిణః
  జన్మబన్ధవినిర్ముక్తాః
   పదం గచ్ఛన్త్యనామయమ్
 
 
 52.  
  యదా తే మోహకలిలం
   బుద్ధిర్వ్యతితరిష్యతి
  తదా గన్తాసి నిర్వేదం
   శ్రోతవ్యస్య శ్రుతస్య చ
 
 
 53.  
  శ్రుతివిప్రతిపన్నా తే
   యదా స్థాస్యతి నిశ్చలా
  సమాధావచలా బుద్ధి
  స్తదా యోగమవాప్స్యసి
 
 
 54.  
  స్థితప్రజ్ఞస్య కా భాషా
   సమాధిస్థస్య కేశవ
  స్థితధీః కిం ప్రభాషేత
   కిమాసీత వ్రజేత కిమ్
 
 
 55.  
  ప్రజహాతి యదా కామా
  న్సర్వాన్పార్థ మనోగతాన్
  ఆత్మన్యేవాత్మనా తుష్టః
   స్థితప్రజ్ఞస్తదోచ్యతే
 
 
 56.  
  దుఃఖేష్వనుద్విగ్నమనాః
  సుఖేషు విగతస్పృహః
  వీతరాగభయక్రోధ
  స్థితధీర్మునిరుచ్యతే
 Play This verse
 
 57.  
  యః సర్వత్రానభిస్నేహస్త
  త్తత్ప్రాప్య శుభాశుభమ్
  నాభినన్దతి న ద్వేష్టి
   తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా
 
 
 58.  
  యదా సంహరతే చాయం
   కూర్మోఽఙ్గానీవ సర్వశః
  ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్య
  స్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా
 
 
 59.  
  విషయా వినివర్తన్తే
   నిరాహారస్య దేహినః
  రసవర్జం రసోఽప్యస్య
   పరం దృష్ట్వా నివర్తతే౯
 
 
 60.  
  యతతో హ్యపి కౌన్తేయ
   పురుషస్య విపశ్చితః
  ఇన్ద్రియాణి ప్రమాథీని
   హరన్తి ప్రసభం మనః
 
 
 61.  
  తాని సర్వాణి సంయమ్య
   యుక్త ఆసీత మత్పరః
  వశే హి యస్యేన్ద్రియాణి
   తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా
 
 
 62.  
  ధ్యాయతో విషయాన్పుంసః
   సఙ్గస్తేషూపజాయతే
  సఙ్గాత్సంజాయతే కామః
   కామాత్క్రోధోఽభిజాయతే
 Play This verse
 
 63.  
  క్రోధాద్భవతి సంమోహః
  సంమోహాత్స్మృతివిభ్రమః
  స్మృతిభ్రంశాద్బుద్ధినాశో
   బుద్ధినాశాత్ప్రణశ్యతి
 Play This verse
 
 64.  
  రాగద్వేషవియుక్తైస్తు
   విషయానిన్ద్రియైశ్చరన్
  ఆత్మవశ్యైర్విధేయాత్మా
   ప్రసాదమధిగచ్ఛతి
 
 
 65.  
  ప్రసాదే సర్వదుఃఖానాం
   హానిరస్యోపజాయతే
  ప్రసన్నచేతసో హ్యాశు
   బుద్ధిః పర్యవతిష్ఠతే
 
 
 66.  
  నాస్తి బుద్ధిరయుక్తస్య
   న చాయుక్తస్య భావనా
  న చాభావయతః శాన్తి
  రశాన్తస్య కుతః సుఖమ్
 
 
 67.  
  ఇన్ద్రియాణాం హి చరతాం
   యన్మనోఽను విధీయతే
  తదస్య హరతి ప్రజ్ఞాం
   వాయుర్నావమివామ్భసి
 
 
 68.  
  తస్మాద్యస్య మహాబాహో
   నిగృహీతాని సర్వశః
  ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్య
  స్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా
 
 
 69.  
  యా నిశా సర్వభూతానాం
  తస్యాం జాగర్తి సంయమీ
  యస్యాం జాగ్రతి భూతాని
   సా నిశా పశ్యతో మునేః
 
 
 70.  
  ఆపూర్యమాణమచలప్రతిష్ఠం
  సముద్రమాపః ప్రవిశన్తి యద్వత్
  తద్వత్కామా యం ప్రవిశన్తి సర్వే
  స శాన్తిమాప్నోతి న కామకామీ ౦
 
 
 71.  
  విహాయ కామాన్యః సర్వాన్
   పుమాంశ్చరతి నిఃస్పృహః
  నిర్మమో నిరహంకారః
   స శాన్తిమధిగచ్ఛతి
 
 
 72.  
  ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ
   నైనాం ప్రాప్య విముహ్యతి
  స్థిత్వాస్యామన్తకాలేఽపి
   బ్రహ్మనిర్వాణమృచ్ఛతి
 Play This verse
 
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18