Tetagitulu with
 
 
 
 
Book Release Event
 
   Subscribe To Slokas
  
     
 
  Introduction
  Home
  Foreword
  Prayer
  What is Tetagiti ?
  Commentaries
  Provide Feedback
 
శ్రీమద్భగవద్గీత
తేటగీతులలొ తెనుగుసేత
  by Late Dr. P.V. Satyanarayana Rao
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ:
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18
 
  3. తృతీయాధ్యాయము : కర్మయోగము
 
 1.  అర్జునుడనెను:
  జ్ఞాననిష్ఠయె కర్మము సలుపుకన్న
  మిన్నయని నీ యభిప్రాయ మేని యిపుడు
  ఘోరమౌ యుద్ధ కర్మము కోరి సలుప
  కేశవా! యేల నను నియోగింతు వీవు?
 
 
 2.  
  కలగలపులైన చతుర వాక్యముల తోడ,
  నాదుబుద్ధిని భ్రమగొల్పునట్టు లుంటి,
  శ్రేయమొనగూడు నెద్దానిచేత నాకు,
  ఒక్కటే దాని నిశ్చయమొనర జెపుమ.
 
 
 3.  శ్రీ భగవానుడనెను:
  ద్వివిధనిష్ఠల నీలోక విదితముగను,
  అనఘ! చెప్పితి సృష్ట్యాది యందె నేను,
  సాంఖ్యులకు జ్ఞానయోగపు సాధనమును,
  కర్మయోగులు నిష్కామ కర్మ సలుప
 
 
 4.  
  విహితకర్మల జేయక విడిచి పుచ్చ
  పురుషు డెవ్వడు నైష్కర్మ్య మొంద లేడు,
  కాని కర్మ మాత్రంబె త్యా గంబు జేయ,
  పొందజాలడు మనుజుడు మోక్షసిద్ధి
 
 
 5.  
  కర్మమును జేయ కెపు డొక్క క్షణము గాని
  మనగ జాలడు జగమందు మనుజు డెవడు,
  ప్రకృతి జాత గుణంబుల బద్ధుడగుచు
  కర్మమును జేయ ప్రతిజీవి కడగుచుండు.
 
 
 6.  
  సకల కర్మేంద్రియముల యాచరణముడిపి,
  ఇంద్రియార్థములను మూఢుడెవడు గాని,
  మనసు నందున వీడకస్మరణ జేయు,
  తగగ నతడు కపట వర్తనుడు సూవె.
 
 
 7.  
  మనసు చేత జ్ఞానేంద్రియ గణము నెవ్వ
  డణచి యుంచియు, కర్మేంద్రి యముల చేత,
  కర్మయోగము సలుపు సం గమును వీడి
  ఆతడే, యర్జునా! శ్రేష్ఠు డైన వాడు.
 
 
 8.  
  కాన, కర్మమే శ్రేష్ఠ మ కర్మ కన్న,
  నియత కర్మము సలుపుము నీవు పార్థ!
  స్వీయకర్మము నీ విక జేయకున్న,
  కడువ జాలదు నీ మను గడయుగూడ.
 
 
 9.  
  ఈశ్వరార్థము గాకుండు నెట్టి కర్మ,
  కర్మబద్ధుల జేయు లో కాన నదియె,
  కాన, భగవదర్థంబుగ కర్మ మీవు
  ముక్తసంగుడవై నిష్ఠ బూని సలుపు.
 
 
 10.  
  ప్రజల నీయజ్ఞముల తోడ సృజన జేసి
  పల్కెసృష్ట్యాదిలో ప్రజా పతియు నిట్లు,
  "యజ్ఞముల జేసి యభివృద్ధి నందుకొనుడు,
  ఇష్టకామమ్ములివియు మీ కిచ్చు బిదికి".
 
 
 11.  
  తృప్తి బఱపుడు క్రతువులదేవతలను,
  వారలిత్తురుమీకు సువర్షములను,
  అట్టు లన్యోన్యసంభావ్యులయ్యు మీరు,
  పరమనిశ్రేయస పదంబుబడయ గలరు.
 
 
 12.  
  దేవతలు యజ్ఞముల చేత దృప్తి నొంది,
  యిష్టభోగములను వార లిత్తురుగద,
  ఇవ్వగొని వారికవి తిరి గివ్వ బోక,
  తానె కుడుచునొ మ్రుచ్చన దగును వాని.
 
 
 13.  
  యజ్ఞశేషము సజ్జను లారగించి
  సర్వపాప విముక్తులై జనుచు నుంద్రు,
  కూర్మి తమకోసమే వండి కుడుతు రెవరొ,
  అఘము భుజియించు పాపాత్ము లట్టి వారె.
 
 
 14.  
  అన్నమున ప్రాణికోటి యు త్పన్నమగును
  అన్నముద్భవమొందు వర్షాంబువులను
  వర్షములు యజ్ఞకర్మము వలన గలుగు
  యజ్ఞములుగల్గు సత్కర్మ మాచరింప.
 
 
 15.  
  వేదములనుండి కర్మమువెడలె సుమ్ము,
  పరగు వేదము లక్షరబ్రహ్మ నుండి,
  వేద మన్నిట వ్యాప్తమైవెలయు గాన,
  నిత్యమును యజ్ఞమందదినిలిచియుండు.
 
 
 16.  
  ననుసరించి ప్రవర్తింప నట్టి వాడు
  ననుసరించి ప్రవర్తింప నట్టి వాడు
  లోక మందున విషయ వి లోలుడగుచు,
  వ్యర్థ జీవనుడైన పా పాత్ముడగును.
 
 
 17.  
  ననుసరించి ప్రవర్తింప నట్టి వాడు
  ఆత్మరతిదేలి సంతృప్తిననుభవించు,
  ఆత్మయందట్లె సంతుష్టుడగు నెవండు,
  వాని కెట్టి కర్తవ్యముగాని లేదు.
 Play This Verse
 
 18.  
  కర్మజేసిన మానిన గాని భువిని,
  పుణ్యపాపము లతనికి పొసగ బోవు,
  జ్ఞాని కే ప్రాణితో బ్రయో జనము లేమి
  వాని కెవ్వని నర్థింప బనియు లేదు.
 Play This Verse
 
 19.  
  కాన సతతము పార్థ! ని ష్కామముగను,
  చేయదగినట్టి కర్మమే చేయు మీవు,
  అట్లనాసక్తుడై కర్మ మాచరించు,
  పురుషుడే పరమపదమ్ము పొందగలడు.
 
 
 20.  
  కర్మ జనకాదు లెల్ల ని ష్కామముగనె,
  చేసి పొందిరి పూర్వము చిత్తశుద్ధి,
  లొక సంగ్రహదృష్టినే లో వహించి,
  కర్మమును జేయ తగు నీవు కాంక్ష బాసి
 
 
 21.  
  శ్రేష్ఠు లెట్టెట్టి కర్మలజేయు చుందు
  రల్పు లట్టట్టి వానినేయాచ రింత్రు,
  శ్రేష్ఠు లేప్రమాణములనుస్వీకరింతు
  రట్టి వానినే యీలోకులనుసరింత్రు.
 Play This Verse
 
 22.  
  నాకు కర్తవ్య మీమూడులోకములను,
  కొంచెమైనను లేదోయికుంతి పుత్ర!
  పొందనిది,పొందతగినదియెందు లేదు,
  కాని వర్తింతు నెపుడు నేకర్మమందె.
 Play This Verse
 
 23.  
  అప్రమత్తుడనై నేనొ కప్పుడేని,
  కర్మ మందు ప్రవృత్తుడ గాక యున్న,
  సర్వవిధముల నను జూచి సకల జనులు
  నాదు మార్గము వెంటనే నడతురుగద.
 Play This Verse
 
 24.  
  కర్మ నే జేయకున్న లో కములు పార్థ!
  నడచి, చెడుమార్గములయందు నష్ట పడును,
  కర్తనయ్యును వర్ణ సం కరమునకును,
  ప్రజల చేజేత చెఱిచిన వాడ నగుదు.
 
 
 25.  
  పాండవా పామరజనంబు వసుధలోన
  సక్తులై యెట్లు కర్మల సలుపు వారొ,
  వదలి యాకాంక్షనెల్ల వి ద్వాంసు లట్లె,
  చేయవలె కర్మ లోకుల శ్రేయ మెంచి.
 
 
 26.  
  కర్మములజేయ నాసక్తి గలిగి యున్న
  పామరుల బుద్ధి కలతల బఱచబోక,
  సర్వకర్మలు వారలు సలుప జేసి,
  సలుప వలె కర్మ పూని వి జ్ఞాని కూడ.
 
 
 27.  
  ప్రకృతి గుణములు మూడింటి బలిమిచేత
  సర్వవిధముల కర్మలు సాగు చుండ,
  మూఢమనుజు డహంకార బుద్ధి నొంది,
  తాను మాత్రమె కర్తగా తలచుచుండు.
 
 
 28.  
  తత్త్వవేత్త మహాభుజ సత్త్వశాలి!
  గుణములును, కర్మముల వి భజనము నెఱిగి,
  తిరుగు విషయములంటి యిం ద్రియము లనుచు
  తెలిసి సక్తుడుగాడు క ర్తృత్వమందు.
 
 
 29.  
  ప్రకృతిగుణముల కెంతయు భ్రాంతి జెంది
  సకలదేహేంద్రి యక్రియా సక్తులైన,
  మంద బుద్ధుల, నల్పజ్ఞ మానవులను,
  తగదు సర్వజ్ఞులకు కల తలను బఱప.
 
 
 30.  
  ఆత్మవిజ్ఞానబుద్ధి నీ వాశ్రయించి
  సర్వకర్మల నాయందె సన్యసించు,
  ఆశ మమతల నీమన సార విడిచి,
  యుద్ధమునుసల్పు శోకశూ న్యుండ వగుచు.
 
 
 31.  
  ఇట్టి నామతము మనుజు లెవ్వరేని,
  శ్రద్ధ తోడను, ననసూయ బుద్ధి తోడ,
  నిత్య మనుసరింతురో బహు నిష్ఠ బూని,
  వారలును కర్మబంధాలు వాయు వారె.
 
 
 32.  
  నేను జెప్పిన మతమిదినింద జేసి
  యనుసరింప రసూయతో నల్పమతులు,
  అరయు మవ్వారినెల్ల నష్టాత్ములైన
  జ్ఞానశూన్యులునౌ మూఢ జనులు గాగ.
 
 
 33.  
  జ్ఞానియే తన పూర్వ సం స్కార సరణి,
  పనులు జేయ ప్రకృతి కను గుణము గాను,
  ప్రాణు లనుసరింపరె తమ ప్రకృతి నట్లె,
  ప్రకృతి నెవ్వరు నిగ్రహిం పంగలారు!
 
 
 34.  
  ఇంద్రియములన్ని విషయప్ర వృత్త మగుట,
  రాగవిద్వేషగుణము లే ర్పడుచునుండు,
  వశము గారాదు పురుషుడు వాని కెపుడు;
  శాంతికామున కవి బద్ధ శత్రులు గద!
 
 
 35.  
  స్వీయ ధర్మమె శ్రేష్ఠము విగుణ మయ్యు,
  చక్కగా పరధర్మము సలుపు కంటె,
  మరణమైనను స్వీయధ ర్మమున మేలు,
  పరులధర్మము లెంతయు భయకరములు.
 
 
 36.  అర్జునుడనెను:
  అయిన, దేని చేత బ్రయుక్తు డగుచు నుండి,
  బలముగా నియోజితుడైన వాని యట్లు,
  ఇచ్ఛలేకయె పాపపు కృత్యములను,
  చేయు పురుషుండు వీడు, వా ర్ష్ణేయ! చెపుమ
 
 
 37.  శ్రీ భగవానుడనెను:
  అదియె కామము, క్రోధమ్ము నదియె పార్థ!
  పొదలు నిది రజోగుణమున బుట్టుచుండి,
  పాపకారణ మిది; తృప్తి బఱపరాని,
  పరమ శత్రువు తెలియు మీ ప్రజల కిలను.
 
 
 38.  
  నిప్పునెరీతి పొగచుట్టి కప్పియుండు,
  అద్దమందెట్లు మాలిన్య మంటి యుండు
  శిశువు నేగతి మూయంగ జేయు మావి
  జ్ఞానమును కామ మట్టులే కప్పి యుండు.
 Play This Verse
 
 39.  
  ఎంత నింపిన దీనికి దృప్తి లేదు,
  ఆశరూపాన జెలగు కా మానలంబు,
  జ్ఞానమును కామధూమము కప్పియుండు,
  జ్ఞాని కిది నిత్యశత్రువు గా గ్రహింపు.
 
 
 40.  
  మనసు బుద్ధీంద్రియమ్ములి మ్మహిని పార్థ!
  ఆశ్రయంబులు కామము కండ్రు బుధులు
  అండగొని వీని జ్ఞానమును నావరించి,
  దేహి నీకామ మెపుడు స మ్మోహపఱచు.
 
 
 41.  
  అందుచే నింద్రియమ్ముల నాది యందె,
  అర్జునా! నీదు స్వాధీనమందు నుంచి,
  జ్ఞాన విజ్ఞాన నాశన కారియైన
  పాప రూపపు కామము రూపు మాపు.
 
 
 42.  
  దేహమున కన్న శ్రేష్ఠ మిం ద్రియగణంబు,
  వాని కన్నను మనసు, నా పైది బుద్ధి
  అట్టి బుద్ధికి బరమైన యట్టి దాత్మ,
  అట్టి పరమాత్మయే సర్వ సాక్షి యండ్రు
 Play This Verse
 
 43.  
  అట్లు బుద్ధికి పరమైన యాత్మ నెఱిగి,
  నిశ్చయాత్మక బుద్ధి, చే నిలిపి మనసు,
  కామరూపున నోర్వ శ క్యంబు గాని
  వైరి గెల్వుము లే, మహా బాహువీర!
 Play This Verse
 
 
 1.  అర్జున ఉవాచ:
  జ్యాయసీ చేత్కర్మణస్తే
   మతా బుద్ధిర్జనార్దన
  తత్కిం కర్మణి ఘోరే మాం
   నియోజయసి కేశవ
 
 
 2.  
  వ్యామిశ్రేణేవ వాక్యేన
   బుద్ధిం మోహయసీవ మే
  తదేకం వద నిశ్చిత్య
   యేన శ్రేయోఽహమాప్నుయామ్
 
 
 3.  శ్రీభగవానువాచ:
  లోకేఽస్మిన్ద్వివిధా నిష్ఠా
   పురా ప్రోక్తా మయానఘ
  జ్ఞానయోగేన సాంఖ్యానాం
   కర్మయోగేన యోగినామ్
 Play This verse
 
 4.  
  న కర్మణామనారమ్భా
  న్నైష్కర్మ్యం పురుషోఽశ్నుతే
  న చ సంన్యసనాదేవ
   సిద్ధిం సమధిగచ్ఛతి
 
 
 5.  
  న హి కశ్చిత్క్షణమపి
   జాతు తిష్ఠత్యకర్మకృత్
  కార్యతే హ్యవశః కర్మ
   సర్వః ప్రకృతిజైర్గుణైః
 
 
 6.  
  కర్మేన్ద్రియాణి సంయమ్య
   య ఆస్తే మనసా స్మరన్
  ఇన్ద్రియార్థాన్విమూఢాత్మా
   మిథ్యాచారః స ఉచ్యతే
 
 
 7.  
  యస్త్విన్ద్రియాణి మనసా
   నియమ్యారభతేఽర్జున
  కర్మేన్ద్రియైః కర్మయోగ
  మసక్తః స విశిష్యతే
 
 
 8.  
  నియతం కురు కర్మ త్వం
   కర్మ జ్యాయో హ్యకర్మణః
  శరీరయాత్రాపి చ తే
   న ప్రసిద్ధ్యేదకర్మణః
 
 
 9.  
  యజ్ఞార్థాత్కర్మణోఽన్య
  త్ర లోకోఽయం కర్మబన్ధనః
  తదర్థం కర్మ కౌన్తేయ
  ముక్తసఙ్గః సమాచర౯
 
 
 10.  
  సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా
   పురోవాచ ప్రజాపతిః
  అనేన ప్రసవిష్యధ్వ
  మేష వోఽస్త్విష్టకామధుక్ ౦
 
 
 11.  
  దేవాన్భావయతానేన
   తే దేవా భావయన్తు వః
  పరస్పరం భావయన్తః
   శ్రేయః పరమవాప్స్యథ
 
 
 12.  
  ఇష్టాన్భోగాన్హి వో దేవా
   దాస్యన్తే యజ్ఞభావితాః
  తైర్దత్తానప్రదాయైభ్యో
   యో భుఙ్క్తే స్తేన ఏవ సః
 
 
 13.  
  యజ్ఞశిష్టాశినః సన్తో
   ముచ్యన్తే సర్వకిల్బిషైః
  భుఞ్జతే తే త్వఘం పాపా
   యే పచన్త్యాత్మకారణాత్
 
 
 14.  
  అన్నాద్భవన్తి భూతాని
   పర్జన్యాదన్నసమ్భవః
  యజ్ఞాద్భవతి పర్జన్యో
  యజ్ఞః కర్మసముద్భవః
 Play This verse
 
 15.  
  కర్మ బ్రహ్మోద్భవం విద్ధి
   బ్రహ్మాక్షరసముద్భవమ్
  తస్మాత్సర్వగతం బ్రహ్మ
   నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్
 
 
 16.  
  ననుసరించి ప్రవర్తింప నట్టి వాడు
  నానువర్తయతీహ యః
  అఘాయురిన్ద్రియారామో
  మోఘం పార్థ స జీవతి
 Play This verse
 
 17.  
  ననుసరించి ప్రవర్తింప నట్టి వాడు
  స్యాదాత్మతృప్తశ్చ మానవః
  ఆత్మన్యేవ చ సన్తుష్ట
  స్తస్య కార్యం న విద్యతే
 
 
 18.  
  నైవ తస్య కృతేనార్థో
   నాకృతేనేహ కశ్చన
  న చాస్య సర్వభూతేషు
   కశ్చిదర్థవ్యపాశ్రయః
 
 
 19.  
  తస్మాదసక్తః సతతం
   కార్యం కర్మ సమాచర
  అసక్తో హ్యాచరన్కర్మ
   పరమాప్నోతి పూరుషః
 
 
 20.  
  కర్మణైవ హి సంసిద్ధి
  మాస్థితా జనకాదయః
  లోకసంగ్రహమేవాపి
   సంపశ్యన్కర్తుమర్హసి
 
 
 21.  
  యద్యదాచరతి శ్రేష్ఠ
  స్తత్తదేవేతరో జనః
  స యత్ప్రమాణం కురు
  తే లోకస్తదనువర్తతే
 Play This verse
 
 22.  
  న మే పార్థాస్తి కర్తవ్యం
   త్రిషు లోకేషు కించన
  నానవాప్తమవాప్తవ్యం
   వర్త ఏవ చ కర్మణి
 
 
 23.  
  యది హ్యహం న వర్తేయం
   జాతు కర్మణ్యతన్ద్రితః
  మమ వర్త్మానువర్తన్తే
   మనుష్యాః పార్థ సర్వశః
 
 
 24.  
  ఉత్సీదేయురిమే లోకా
   న కుర్యాం కర్మ చేదహమ్
  సంకరస్య చ కర్తా స్యా
  ముపహన్యామిమాః ప్రజాః
 
 
 25.  
  సక్తాః కర్మణ్యవిద్వాంసో
   యథా కుర్వన్తి భారత
  కుర్యాద్విద్వాంస్తథాసక్తశ్చి
  కీర్షుర్లోకసంగ్రహమ్
 
 
 26.  
  న బుద్ధిభేదం జనయే
  దజ్ఞానాం కర్మసఙ్గినామ్
  జోషయేత్సర్వకర్మాణి
   విద్వాన్యుక్తః సమాచరన్
 
 
 27.  
  ప్రకృతేః క్రియమాణాని
   గుణైః కర్మాణి సర్వశః
  అహంకారవిమూఢాత్మా
   కర్తాహమితి మన్యతే
 
 
 28.  
  తత్త్వవిత్తు మహాబాహో
   గుణకర్మవిభాగయోః
  గుణా గుణేషు వర్తన్త
   ఇతి మత్వా న సజ్జతే
 
 
 29.  
  ప్రకృతేర్గుణసంమూఢాః
   సజ్జన్తే గుణకర్మసు
  తానకృత్స్నవిదో మన్దా
  న్కృత్స్నవిన్న విచాలయేత్౯
 
 
 30.  
  మయి సర్వాణి కర్మాణి
   సంన్యస్యాధ్యాత్మచేతసా
  నిరాశీర్నిర్మమో భూత్వా
   యుధ్యస్వ విగతజ్వరః
 Play This verse
 
 31.  
  యే మే మతమిదం నిత్య
  మనుతిష్ఠన్తి మానవాః
  శ్రద్ధావన్తోఽనసూయన్తో
  ముచ్యన్తే తేఽపి కర్మభిః
 
 
 32.  
  యే త్వేతదభ్యసూయన్తో
   నానుతిష్ఠన్తి మే మతమ్
  సర్వజ్ఞానవిమూఢాం
  స్తాన్విద్ధి నష్టానచేతసః
 
 
 33.  
  సదృశం చేష్టతే స్వస్యాః
  ప్రకృతేర్జ్ఞానవానపి
  ప్రకృతిం యాన్తి భూతాని
   నిగ్రహః కిం కరిష్యతి
 
 
 34.  
  ఇన్ద్రియస్యేన్ద్రియస్యార్థే
   రాగద్వేషౌ వ్యవస్థితౌ
  తయోర్న వశమాగచ్ఛే
  త్తౌ హ్యస్య పరిపన్థినౌ
 
 
 35.  
  శ్రేయాన్స్వధర్మో విగుణః
   పరధర్మాత్స్వనుష్ఠితాత్
  స్వధర్మే నిధనం శ్రేయః
   పరధర్మో భయావహః
 Play This verse
 
 36.  అర్జున ఉవాచ:
  అథ కేన ప్రయుక్తోఽయం
   పాపం చరతి పూరుషః
  అనిచ్ఛన్నపి వార్ష్ణేయ
   బలాదివ నియోజితః
 
 
 37.  శ్రీభగవానువాచ:
  కామ ఏష క్రోధ ఏష
   రజోగుణసముద్భవః
  మహాశనో మహాపాప్మా
   విద్ధ్యేనమిహ వైరిణమ్
 
 
 38.  
  ధూమేనావ్రియతే వహ్ని
  ర్యథాదర్శో మలేన చ
  యథోల్బేనావృతో గర్భ
  స్తథా తేనేదమావృతమ్
 Play This verse
 
 39.  
  ఆవృతం జ్ఞానమేతేన
   జ్ఞానినో నిత్యవైరిణా
  కామరూపేణ కౌన్తేయ
   దుష్పూరేణానలేన చ౯
 
 
 40.  
  ఇన్ద్రియాణి మనో బుద్ధి
  రస్యాధిష్ఠానముచ్యతే
  ఏతైర్విమోహయత్యేష
   జ్ఞానమావృత్య దేహినమ్ ౦
 
 
 41.  
  తస్మాత్త్వమిన్ద్రియాణ్యాదౌ
   నియమ్య భరతర్షభ
  పాప్మానం ప్రజహి హ్యేనం
   జ్ఞానవిజ్ఞాననాశనమ్
 
 
 42.  
  ఇన్ద్రియాణి పరాణ్యాహు
  రిన్ద్రియేభ్యః పరం మనః
  మనసస్తు పరా బుద్ధి
  ర్యోబుద్ధేః పరతస్తు సః
 
 
 43.  
  ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా
  సంస్తభ్యాత్మానమాత్మనా
  జహి శత్రుం మహాబాహో
   కామరూపం దురాసదమ్
 
 
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18