Tetagitulu with
 
 
 
 
Book Release Event
 
   Subscribe To Slokas
  
     
 
  Introduction
  Home
  Foreword
  Prayer
  What is Tetagiti ?
  Commentaries
  Provide Feedback
 
శ్రీమద్భగవద్గీత
తేటగీతులలొ తెనుగుసేత
  by Late Dr. P.V. Satyanarayana Rao
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ:
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18
 
  4. చతుర్థాద్యాయము : జ్ఞనయోగము
 
 1.  శ్రీ భగవానుడనెను:
  అనఘ! సూర్యున కవ్యయ మైన యిట్టి
  జ్ఞానయోగము గఱపియున్నాడనేను,
  వాడు దానిని జెప్పె వై వస్వతునకు,
  మనువు నిక్ష్వాకునకు జెప్పెమరలదాని
 
 
 2.  
  తరతరాలుగ నీరీతితరలు చున్న,
  నిట్టి యోగము రాజర్షులెఱిగి యుండి
  రట్టి యోగము దీర్ఘ కాలానుగతిని,
  భ్రష్టమై సంప్రదాయమునష్టమయ్యె.
 
 
 3.  
  నాదు సఖుడవు,భక్తుడ వౌదు గాన,
  అతిరహస్యము,నుత్తమ మైన యట్టి
  ఆపురాతనయోగమేనయ్యమరల
  నేడు వచియించు చుంటినినీకు పార్థ !
 
 
 4.  అర్జునుడనెను:
  ముందు కాదొకొ,సూర్యుండుబుట్టియుంట,
  నీదు జన్మము,తరువాతకాదొ,కృష్ణ!
  సృష్టియారంభమున నీవుజెప్పితంటి
  వెట్టు లీక్లిష్టహక్కు,గ్రహింతునేను.
 
 
 5.  శ్రీ భగవానుడనెను:
  జన్మ లెన్నెన్నొ యర్జునాజగతి యందు
  కడచె నాకును నీకునుగతము నందు,
  వాని నన్నింటి నెఱిగినవాడ నేను,
  నీవు మాత్ర మెఱుంగ వవేవి గాని.
 
 
 6.  
  అజుడ నయ్యును నే నవ్య యాత్మకుండ
  సర్వ భూతములకు మహే శ్వరుడ నేను,
  కాని,నాదు ప్రకృతిని స్వా ధీన పఱచి,
  ఆత్మమాయచే సంభవ మగుదు నేను.
 
 
 7.  
  ఎప్పు డెపుడు,ధర్మమ్మున కిద్ధచరిత
  హాని గలుగుచు నుండునో యవని యందు
  ఎప్పు డెపు డధర్మమునకు వృద్ధి గలుగు,
  నప్పు డపుడ, నాయంతనే నవతరింతు
 
 
 8.  
  సాధుజనులను రక్షించిసాకు కొఱకు,
  దుష్టజనులను తలబట్టిత్రుంచు కొఱకు,
  పృథ్వి ధర్మము మఱల స్థా పించు కొఱకు
  యుగ యుగము లందు సంభవ మగుదు నేను.
 
 
 9.  
  దివ్యములు జన్మ కర్మముల్ దెలియ నావి,
  ఇవ్విధంబుగ నాతత్త్వమెవ్వ డెఱుగు
  దేహమునువీడి జన్మము తిరిగి మరల
  పొంద డాతడు ఫల్గునా! పొందు నన్నె.
 
 
 10.  
  భయము,రాగము,క్రోధముబాసి మదిని,
  నన్నె యెదగొని,యెపుడు నన్నాశ్రయించి,
  తనర పలువు రాత్మజ్ఞానతపముచేత
  పూతులై, నా స్వరూపము బొందినారు.
 
 
 11.  
  ఎవ్వ రేభావముల భజి యింత్రొ నన్ను,
  ఏను వారల నట్టులేయేలికొందు,
  సర్వవిధముల పూజలుసలిపి జనులు,
  నాదు మార్గము వెంటనేనడతు రెల్ల.
 
 
 12.  
  కర్మజాతఫలంబులకాంక్ష జేసి,
  ఇతర దేవతలను గొల్తురిలను జనులు,
  మనుజసంతతికెల్ల నిమ్మహిని పార్థ!
  కర్మఫలసిద్ధి శీఘ్రమేకలుగు గాదె.
 
 
 13.  
  గుణము కర్మల విభజనకనుగుణముగ,
  సృష్టిజేసితి వర్ణచతుష్టయమును,
  అట్టి సృష్టికి కర్త నేనైన గూడ,
  అవ్యయుడ నన్నకర్తగానరయు మీవు.
 
 
 14.  
  కర్మ లెట్టివి నన్నంటగట్ట రావు,
  కర్మఫలమందు నాకెట్టికాంక్ష లేదు,
  ఎవడకర్త న భోక్త నంచెఱుగు నన్ను,
  కర్మములచేత నాతడుకట్టు వడడు.
 
 
 15.  
  మును ముముక్షువులైన పూర్వులును గూడ,
  కర్మ సలిపిరి దీని పోకల నెఱింగి,
  కాన నీవును సల్పుముకర్మ మట్లె,
  పూర్వు లే తీరు జేసిరోపూర్వ మందు.
 
 
 16.  
  కర్మ మెట్టిదొ,యెట్టి దకర్మమగునొ,
  పండితులు కూడ తెలియకభ్రాంతు లైరి,
  ఏది తెలియగ నశుభము లెల్ల తొలగు,
  నట్టి దానిని తెలిపెదనాలకింపు.
 
 
 17.  
  ఏది కర్మమొ దాని నీవెఱుగ వలయు,
  అట్టులే వికర్మమును నీవరయ వలయు,
  మఱియు నీ వకర్మము గూడనెఱుగ వలయు,
  కర్మ నిజతత్త్వ మెఱుగుటకష్టతరము.
 
 
 18.  
  కర్మ మందున నెవ్వడకర్మ జూచు,
  కర్మమును జూచు నెవ్వడకర్మ మందు,
  మనుజు లందున కడుబుద్ధిమంతు డతడె,
  అతడే యోగి,కృతకృత్యుడైన నతడె.
 
 
 19.  
  కామ సంకల్పముల వీడగలిగి యుండి,
  సకలకర్మము లెవనివిసాగుచుండు,
  కర్మ లెవనివి జ్ఞానాగ్నికాల్పబడునొ,
  అట్టి పురుషుని పండితుడండ్రు బుధులు.
 Play This Verse
 
 20.  
  కర్మఫలములయందు సంగమును వీడి,
  సతతసంతృప్తుడై నిరాశ్రయుడు నగుచు,
  కర్మ మందు ప్రవృత్తినిగలిగి కూడ,
  వాడు కర్మలు చేయనివాడె యగును.
 
 
 21.  
  ఆశల ద్యజించి, నియతచిత్తాత్మకు డయి,
  త్యక్తసర్వపరిగ్రహుడైనవాడు,
  జీవయాత్రకు మాత్రమేజేయ కర్మ,
  పాపపంకిల మాతడుబడయ బోడు.
 
 
 22.  
  తనకు దానబ్బు దానితోదనియు వాడు,
  ద్వంద్వముల కతీతుడు;విమత్సరగుణుండు,
  సిద్ధ్యసిద్ధుల యెడ సమచిత్తగుండు,
  కర్మ జేసియు,బద్ధుడుగాడు వాడు.
 Play This Verse
 
 23.  
  సంగరహితుడు,ముక్తసంసారజీవి,
  జ్ఞాననిష్ఠలో స్థిరమతియైన వాడు,
  ఈశ్వరార్థము కర్మమునెంచి సేయ,
  ఫల సహితముగ తత్కర్మవిలయ మొందు.
 
 
 24.  
  అర్పణము లన్నియును బ్రహ్మ,హవిసు బ్రహ్మ,
  హుతము హోమాగ్నులును బ్రహ్మ,హోత బ్రహ్మ,
  బ్రహ్మకర్మసమాధిచేబడయ దగిన,
  ఫలితమైనను గూడ నాబ్రహ్మమ యగు.
 
 
 25.  
  యజ్ఞకర్మము దేవతాయజన మంచు,
  కొల్చు చుందురు ఫలమెంచికొంత మంది,
  అన్యయోగులు జీవు జీవాత్మచేత,
  నాహుతులొసంగు చుంద్రు బ్రహ్మాగ్ని యందు.
 
 
 26.  
  ఇతర యోగులు కర్ణాదియింద్రియముల,
  నాహుతు లొసంగుదురు సంయమాగ్నియందు,
  అన్యయోగులు సకల శబ్దాదులైన,
  విషయముల నింద్రియాగ్నినివ్రేల్చుచుంద్రు.
 
 
 27.  
  
  ప్రాణవాయువుల సకలవ్యాపృతులను,
  ధృతిని యోగులు జ్ఞానప్రదీప్తమైన,
  యాత్మసంయమయోగాగ్నియందు వేల్తృ.
 
 
 28.  
  దానముల,దపోయజ్ఞ సాధనములందు,
  యజ్ఞభావముగొని కొందఱాచరింత్రు,
  అట్లె స్వాధ్యాయ ముల,జ్ఞానయజ్ఞములను,
  యత్నశీలురు,దృఢనిష్ఠులాచరింత్రు.
 
 
 29.  
  ప్రాణవాయువువేల్తు రపాన మందు,
  ప్రాణమున వేల్తు రితరులపాన మట్లె
  నిగ్రహించి ప్రాణాపాననియతగతుల,
  హోమ మొనరింత్రు ప్రాణనియామపరులు.
 
 
 30.  
  అన్య పురుషులు నియమితాహారులగుచు,
  ప్రాణవాయువు వేల్తు రద్దాని యందె,
  యజ్ఞవిదులైన యట్టివారంద ఱిలను,
  క్షపితకల్మషులైరి యజ్ఞముల చేత.
 
 
 31.  
  యజ్ఞశిష్టామృతము గ్రోలునట్టివారు,
  పరమశాశ్వతమౌ బ్రహ్మపదము గొంద్రు,
  యజ్ఞహీనుల కీలోకమందె లేదు,
  యింక పరలోకమున సుఖమెచట పార్థ!
 
 
 32.  
  వేదముఖమున నివి బహువిధములైన,
  యజ్ఞములు విస్తరించి విఖ్యాత మయ్యె,
  కర్మముల నుండి నివియన్నిగలుగు నంచు,
  తెలిసికొనినచో బంధాలుతెగును నీకు.
 
 
 33.  
  ద్రవ్యమయమైన యజ్ఞకర్మమున కన్న,
  జ్ఞాన యజ్ఞమె శ్రేష్ఠమైక్రాలు పార్థ!
  సర్వ కర్మలు నిర్విశేషముగ విజయ!
  ఆత్మవిజ్ఞానమందె సమాప్త మగును.
 
 
 34.  
  తత్త్వ వేత్తల,విజ్ఞానధనుల జేరి,
  వినయ సాష్టాంగ వందనవిధుల చేత,
  జ్ఞాన మర్థించి శుశ్రూషసలుపుచుండి,
  తెలియవిను వారి జ్ఞానోపదేశ మీవు.
 
 
 35.  
  బ్రహ్మవిజ్ఞాన మేదీవుబడసియున్న,
  మోహ మీగతి మరితిర్గిపొంద బోవొ,
  జ్ఞాన మద్దాని చే భూతజాల మెల్ల,
  చూచి నీయందు, నాయందుజూతు వట్లె.
 
 
 36.  
  పాపులందెల్ల మిక్కిలిపాపివయ్యు,
  పాపకృత్యములకు లెస్సపాలుపడియు,
  దాటగావచ్చు పాపపుతరణి పెలుచ,
  సర్వమును జ్ఞానమను తెప్పసాయముననె.
 
 
 37.  
  మండుమంటలు సమిధలపిండు నెట్లు,
  కాల్చివేయునో భస్మముగాగ పార్థ!
  అట్లె కర్మజాలమును,జ్ఞానానలంబు,
  సర్వమును కాల్చివేయు భస్మమ్ముగాగ.
 Play This Verse
 
 38.  
  జ్ఞాన సదృశమైన పవిత్రకారి విజయ!
  లేదు లోకమునందు వేరేది కాని,
  యోగసిద్ధుడు తాను కాలోచితముగ,
  జ్ఞాన మయ్యది తనలోనెకాంచగలుగు.
 Play This Verse
 
 39.  
  శ్రద్ధగలవానికి,గురుపరాయణునకు,
  నిర్జితేంద్రియునకు జ్ఞాననిష్ఠయబ్బు,
  ఆత్మవిజ్ఞానమును పొందియతడు పార్థ!
  పరమశాంతిని శీఘ్రమేపడయ గలడు.
 Play This Verse
 
 40.  
  జ్ఞానశూన్యుడు,శ్రద్ధావిహీనమతియు,
  సంశయాత్మకుడైన యాజనుడు చెడును,
  లేదిహమ్మును వానికిలేదు పరము,
  లేదు సుఖమైన వానికిలేశ మేని.
 Play This Verse
 
 41.  
  యోగమున సర్వకర్మలనీగువాని,
  జ్ఞాన సంఛిన్నసంశయుడైనవాని,
  ఆత్మనిష్ఠలో సుస్థిరుడైనవాని,
  కర్మ లెట్టివి యైననుకట్టరావు.
 
 
 42.  
  కాన నజ్ఞానజన్యమైకాలుచుండి,
  ఆత్మ విషయాన నీహృదిహత్తుకొన్న,
  సంశయము పార్థ!జ్ఞానాసిదీసమయజేసి,
  యోగయుక్తు డవై లెమ్ముయుద్ధమునకు.
 
 
 
 1.  శ్రీభగవానువాచ:
  ఇమం వివస్వతే యోగం
   ప్రోక్తవానహమవ్యయమ్
  వివస్వాన్మనవే ప్రాహ
   మనురిక్ష్వాకవేఽబ్రవీత్
 
 
 2.  
  ఏవం పరమ్పరాప్రాప్త
  మిమం రాజర్షయో విదుః
  స కాలేనేహ మహతా
   యోగో నష్టః పరన్తప
 
 
 3.  
  స ఏవాయం మయా తేఽద్య
  యోగః ప్రోక్తః పురాతనః
  భక్తోఽసి మే సఖా చేతి
  రహస్యం హ్యేతదుత్తమమ్
 
 
 4.  అర్జున ఉవాచ:
  అపరం భవతో జన్మ
   పరం జన్మ వివస్వతః
  కథమేతద్విజానీయాం
   త్వమాదౌ ప్రోక్తవానితి
 
 
 5.  శ్రీభగవానువాచ:
  బహూని మే వ్యతీతాని
   జన్మాని తవ చార్జున
  తాన్యహం వేద సర్వాణి
   న త్వం వేత్థ పరన్తప
 
 
 6.  
  అజోఽపి సన్నవ్యయాత్మా
   భూతానామీశ్వరోఽపి సన్
  ప్రకృతిం స్వామధిష్ఠాయ
   సంభవామ్యాత్మమాయయా
 
 
 7.  
  యదా యదా హి ధర్మస్య
   గ్లానిర్భవతి భారత
  అభ్యుత్థానమధర్మస్య
   తదాత్మానం సృజామ్యహమ్
 Play This verse
 
 8.  
  పరిత్రాణాయ సాధూనాం
   వినాశాయ చ దుష్కృతామ్
  ధర్మసంస్థాపనార్థాయ
   సమ్భవామి యుగే యుగే
 Play This verse
 
 9.  
  జన్మ కర్మ చ మే దివ్య
  మేవం యో వేత్తి తత్త్వతః
  త్యక్త్వా దేహం పునర్జన్మ
   నైతి మామేతి సోఽర్జున ౯
 
 
 10.  
  వీతరాగభయక్రోధా
   మన్మయా మాముపాశ్రితాః
  బహవో జ్ఞానతపసా
  పూతా మద్భావమాగతాః ౦
 Play This verse
 
 11.  
  యే యథా మాం ప్రపద్యన్తే
   తాంస్తథైవ భజామ్యహమ్
  మమ వర్త్మానువర్తన్తే
   మనుష్యాః పార్థ సర్వశః
 Play This verse
 
 12.  
  కాఙ్క్షన్తః కర్మణాం సిద్ధిం
   యజన్త ఇహ దేవతాః
  క్షిప్రం హి మానుషే
   లోకే సిద్ధిర్భవతి కర్మజా
 
 
 13.  
  చాతుర్వర్ణ్యం మయా సృష్టం
   గుణకర్మవిభాగశః
  తస్య కర్తారమపి మాం
   విద్ధ్యకర్తారమవ్యయమ్
 
 
 14.  
  న మాం కర్మాణి లిమ్పన్తి
   న మే కర్మఫలే స్పృహా
  ఇతి మాం యోఽభిజానాతి
   కర్మభిర్న స బధ్యతే
 
 
 15.  
  ఏవం జ్ఞాత్వా కృతం కర్మ
   పూర్వైరపి ముముక్షుభిః
  కురు కర్మైవ తస్మాత్త్వం
   పూర్వైః పూర్వతరం కృతమ్
 
 
 16.  
  కిం కర్మ కిమకర్మేతి
   కవయోఽప్యత్ర మోహితాః
  తత్తే కర్మ ప్రవక్ష్యామి
   యజ్జ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్
 
 
 17.  
  కర్మణో హ్యపి బోద్ధవ్యం
   బోద్ధవ్యం చ వికర్మణః
  అకర్మణశ్చ బోద్ధవ్యం
   గహనా కర్మణో గతిః
 
 
 18.  
  కర్మణ్యకర్మ యః పశ్యే
  దకర్మణి చ కర్మ యః
  స బుద్ధిమాన్మనుష్యేషు
   స యుక్తః కృత్స్నకర్మకృత్
 
 
 19.  
  యస్య సర్వే సమారమ్భాః
   కామసంకల్పవర్జితాః
  జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం
   తమాహుః పణ్డితం బుధాః౯
 Play This verse
 
 20.  
  త్యక్త్వా కర్మఫలాసఙ్గం
   నిత్యతృప్తో నిరాశ్రయః
  కర్మణ్యభిప్రవృత్తోఽపి
   నైవ కించిత్కరోతి సః
 
 
 21.  
  నిరాశీర్యతచిత్తాత్మా
   త్యక్తసర్వపరిగ్రహః
  శారీరం కేవలం కర్మ
   కుర్వన్నాప్నోతి కిల్బిషమ్
 
 
 22.  
  యదృచ్ఛాలాభసంతుష్టో
   ద్వన్ద్వాతీతో విమత్సరః
  సమః సిద్ధావసిద్ధౌ చ
   కృత్వాపి న నిబధ్యతే
 
 
 23.  
  గతసఙ్గస్య ముక్తస్య
   జ్ఞానావస్థితచేతసః
  యజ్ఞాయాచరతః కర్మ
   సమగ్రం ప్రవిలీయతే
 
 
 24.  
  బ్రహ్మార్పణం బ్రహ్మ హవి
  ర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్
  బ్రహ్మైవ తేన గన్తవ్యం
   బ్రహ్మకర్మసమాధినా
 Play This verse
 
 25.  
  దైవమేవాపరే యజ్ఞం
   యోగినః పర్యుపాసతే
  బ్రహ్మాగ్నావపరే యజ్ఞం
   యజ్ఞేనైవోపజుహ్వతి
 
 
 26.  
  శ్రోత్రాదీనీన్ద్రియాణ్యన్యే
   సంయమాగ్నిషు జుహ్వతి
  శబ్దాదీన్విషయానన్య
   ఇన్ద్రియాగ్నిషు జుహ్వతి
 
 
 27.  
  సర్వాణీన్ద్రియకర్మాణి
   ప్రాణకర్మాణి చాపరే
  ఆత్మసంయమయోగాగ్నౌ
   జుహ్వతి జ్ఞానదీపితే
 
 
 28.  
  ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా
   యోగయజ్ఞాస్తథాపరే
  స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ
   యతయః సంశితవ్రతాః
 
 
 29.  
  అపానే జుహ్వతి ప్రాణం
   ప్రాణేఽపానం తథాపరే
  ప్రాణాపానగతీ రుద్ధ్వా
   ప్రాణాయామపరాయణాః౯
 
 
 30.  
  అపరే నియతాహారాః
   ప్రాణాన్ప్రాణేషు జుహ్వతి
  సర్వేఽప్యేతే యజ్ఞవిదో
   యజ్ఞక్షపితకల్మషాః
 
 
 31.  
  యజ్ఞశిష్టామృతభుజో
   యాన్తి బ్రహ్మ సనాతనమ్
  నాయం లోకోఽస్త్యయజ్ఞస్య
   కుతోఽన్యః కురుసత్తమ
 
 
 32.  
  ఏవం బహువిధా యజ్ఞా
   వితతా బ్రహ్మణో ముఖే
  కర్మజాన్విద్ధి తాన్సర్వా
  నేవం జ్ఞాత్వా విమోక్ష్యసే
 
 
 33.  
  శ్రేయాన్ద్రవ్యమయాద్య
  జ్ఞాజ్జ్ఞానయజ్ఞః పరన్తప
  సర్వం కర్మాఖిలం పార్థ
   జ్ఞానే పరిసమాప్యతే
 
 
 34.  
  తద్విద్ధి ప్రణిపాతేన
   పరిప్రశ్నేన సేవయా
  ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం
   జ్ఞానినస్తత్త్వదర్శినః
 
 
 35.  
  యజ్జ్ఞాత్వా న పునర్మోహ
  మేవం యాస్యసి పాణ్డవ
  యేన భూతాన్యశేషేణ
   ద్రక్ష్యస్యాత్మన్యథో మయి
 
 
 36.  
  అపి చేదసి పాపేభ్యః
   సర్వేభ్యః పాపకృత్తమః
  సర్వం జ్ఞానప్లవేనైవ
   వృజినం సన్తరిష్యసి
 
 
 37.  
  యథైధాంసి సమిద్ధోఽగ్ని
  ర్భస్మసాత్కురుతేఽర్జున
  జ్ఞానాగ్నిః సర్వకర్మాణి
   భస్మసాత్కురుతే తథా
 
 
 38.  
  న హి జ్ఞానేన సదృశం
   పవిత్రమిహ విద్యతే
  తత్స్వయం యోగసంసిద్ధః
   కాలేనాత్మని విన్దతి
 
 
 39.  
  శ్రద్ధావాఁల్లభతే జ్ఞానం
   తత్పరః సంయతేన్ద్రియః
  జ్ఞానం లబ్ధ్వా పరాం
   శాన్తిమచిరేణాధిగచ్ఛతి ౯
 Play This verse
 
 40.  
  జ్ఞశ్చాశ్రద్దధానశ్చ
  అసంశయాత్మా వినశ్యతి
  నాయం లోకోఽస్తి న పరో
  న సుఖం సంశయాత్మనః ౦
 
 
 41.  
  యోగసంన్యస్తకర్మాణం
   జ్ఞానసంఛిన్నసంశయమ్
  ఆత్మవన్తం న కర్మాణి
   నిబధ్నన్తి ధనంజయ
 
 
 42.  
  తస్మాదజ్ఞానసమ్భూతం
   హృత్స్థం జ్ఞానాసినాత్మనః
  ఛిత్త్వైనం సంశయం యోగ
  మాతిష్ఠోత్తిష్ఠ భారత
 
 
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18