Tetagitulu with
 
 
 
 
Book Release Event
 
   Subscribe To Slokas
  
     
 
  Introduction
  Home
  Foreword
  Prayer
  What is Tetagiti ?
  Commentaries
  Provide Feedback
 
శ్రీమద్భగవద్గీత
తేటగీతులలొ తెనుగుసేత
  by Late Dr. P.V. Satyanarayana Rao
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ:
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18
 
  5. పంచమాధ్యాయము : కర్మ సన్యాసయోగము
 
 1.  
  కర్మసన్యాసమును జేయ గడగు మనియు,
  చెప్పెదవు కర్మయోగంబె చేయ మరల,
  శ్రేయ మేదియొ నీరెంట జెపుమ కృష్ణ!
  ఒక్కదానినే నిశ్చయ మొనరజేసి
 
 
 2.  శ్రీ భగవానుడనెను:
  కర్మసన్యాస కర్మయో గములు రెండు
  ధరణి జనులకు మోక్షప్ర దాయకములె
  కర్మయోగము త్యాగము కన్న గూడ
  శ్రేష్ఠతరమగు పార్థ యీ రెంటి లోన
 
 
 3.  
  ఇచ్చ మచ్చరముల బాసి యెవ్వ డుండు,
  అరయదగు వాని నిత్య స న్యాసి గాను
  ద్వంద్వరహితుండె సంసార బంధములను
  పాయు సులభముగా మహా బాహువీర!
 
 
 4.  
  కర్మసన్యాస కర్మయో గమ్ములకును
  ఫలము వేర్వేరటంచు న ల్పజ్ఞు లండ్రు,
  అందు నొకటైన జక్కగా నాచరింప
  నబ్బు నీరెంటి ఫలమని ఆర్యులంద్రు
 
 
 5.  
  సాంఖ్యయోగులు బొందెడు స్థాన మేదొ,
  కర్మయోగులు జేరెడు గమ్యమదియె,
  జ్ఞాన కర్మము లొకటిగా గాంచు నెవ్వ
  డాతడె యథార్థజ్ఞాన మరయువాడు
 
 
 6.  
  కర్మనిష్కాముగ జేయ గడగ కున్న
  కర్మసన్యాస మబ్బుట కష్ట తరము,
  కరము నిష్కామముగ మౌని కర్మ సలిపి
  శీఘ్రమే బ్రహ్మ పదమును జేర వచ్చు
 
 
 7.  
  నిర్మలాత్ముడు, నిష్కామ నిష్ఠయోగి,
  నియతశారీరి, యింద్రియ నిగ్రహుండు,
  సర్వభూతాత్మ తనయాత్మ సర్వమొకటె
  యని తెలిసి చేయ, కర్మము లంటవతని
 
 
 8.  
  తత్త్వవేత్తయు, యోగయు క్తాత్మకుండు
  ఇంచుకేనియు దాజేయ నంచు దలచు,
  చూచి, విని, తాకి, వాసన జూచుచుండి,
  తినియు, శ్వాసించి, నడచి, నిద్రించియైన
 
 
 9.  
  ఇచ్చియును, బుచ్చుకొనుచు, భా షించుచుండి
  కనులు దెఱచియు, మూసియు కర్మయోగి
  ఇంద్రియములన్ని విషయాల నెపుడు దవిలి,
  తిరిగెడు నటంచు నిక్కము దెలిసియుండు
 
 
 10.  
  కర్మఫలసంగములవీడ గలిగి యెవడు,
  ఫలము బ్రహ్మార్పణంబని పనులు సేయు,
  అతడు పాపపుణ్యములచే నంటువడడు,
  తామరాకును నీరము తాకనట్లు
 
 
 11.  
  మమతబాసిన సర్వేంద్రి యములచేత,
  తనువుచే బుద్ధిచేతను మనసుచేత,
  కర్మయోగులు ఫలమందు కాంక్ష బాసి
  ఆత్మసంశుద్ధికై కర్మ మాచరింత్రు
 
 
 12.  
  కర్మజాతఫలంబుల కాంక్ష బాసి,
  పరమనైష్ఠికశాంతిని బడయు యోగి,
  కామపరవశుడై, ఫల కాంక్షయందు
  సక్తుడై బద్ధుడగుచుండ యుక్తరాగి
 
 
 13.  
  సర్వకర్మల మనసార సంత్యజించి,
  కారయితగాక చేయ దా కర్త గాక,
  పరమసుఖమును వశి నవ ద్వార యుక్త
  పురమనెడు దేహ మందున పొందు చుండు
 
 
 14.  
  కర్మకర్తృత్వమును గాని కర్మ గాని,
  కలుగ జేయడు ప్రభువు లో కమున కొకటి,
  కర్మఫలయోగమునకైన కర్త గాడు,
  పఱగు నవి యన్ని ప్రకృతిస్వ భావమునను
 
 
 15.  
  పాపపుణ్యము లొకనివి ప్రభువు గొనడు,
  కర్మ కారణ మాతడు కాదు గాన,
  జ్ఞానమును కప్పియుంట న జ్ఞాన మెపుడు,
  మోహమందున జీవులు మునిగి యుంద్రు
 
 
 16.  
  కాని, యెవరి యజ్ఞానాంధ కారమెల్ల
  నాశితంబగు నాత్మవి జ్ఞానమునను,
  వారి యా జ్ఞానమే పర బ్రహ్మపదము,
  దీప్తి మంతము జేయు నా దిత్యు భంగి
 Play This Verse
 
 17.  
  బ్రహ్మబుద్ధులు, బ్రహ్మాత్మ భావనులును,
  బ్రహ్మనిష్ఠులు, బ్రహ్మప రాయణులును,
  జ్ఞాననిర్ధూతకల్మషు లైనవారు
  పొందుదురు పునర్జన్మ వి ముక్తపదము
 Play This Verse
 
 18.  
  వినయమును, విద్యయుంగల విప్రునందు,
  గోవు నందున కరియందు కుక్కయందు,
  కుక్కపాల గుడ్చు చండాల కులజునందు,
  పండితులు, సమదర్శనుల్ బ్రహ్మగాంత్రు
 Play This Verse
 
 19.  
  చిత్తమెవరిది సమమైన స్థితిని నుండు,
  వారు తరియింతు రిలనె సం సార వనధి,
  బ్రహ్మ సమదర్శియును దోష రహితుడగుట
  వార లుందురు స్థిరముగా బ్రహ్మమందు
 
 
 20.  
  బ్రహ్మవేత్తయు, మోహవి వర్జితుండు,
  స్థిరమతియును, బ్రాహ్మీస్థిత చిత్తశీలి,
  సంతసింపడు సుఖములు సంభవింప,
  వంత జెందడు దుఃఖాలు ప్రాప్తమైన
 
 
 21.  
  బాహ్యవిషయాల నాసక్తి బాయు యోగి
  ఆత్మయందలి సుఖమునే యనుభవించు,
  బ్రహ్మయోగ వినిష్ఠుడై బఱగి యతడు,
  అక్షయపరమానందము నందుకొనును
 
 
 22.  
  ఎట్టిసుఖములు విషయ ప్ర వృత్తజములొ,
  కారణం బవే పార్థ! దుః ఖాల కెల్ల,
  మొదలు తుదియును గలవని బుధు లెఱింగి
  రతులుగారందు క్షణభంగు రములు గాన
 
 
 23.  
  తనువు నిటవీడి నరుడు తా జనక ముందె
  కామ విక్రోధజన్య వే గములనెల్ల
  యిహమునందె సమర్థుడై యెవ్వడోపు,
  ఆతడే యోగి సుఖవంతు డతడె నరుల
 
 
 24.  
  అంతరారాము డంత స్సు ఖాధికుండు,
  అంతరాత్మ ప్రదీప్తుడై యలరు నెవడు,
  బ్రహ్మభూతస్వరూపము బడసి యిలనె,
  బ్రహ్మనిర్వాణ మాయోగి బడయు పిదప
 
 
 25.  
  సంయతాత్ములు, సంచ్ఛిన్న సంశయులు
  ప్రాణిచయ హిత మందను ర క్తిమతులు
  క్షీణకల్మషులైన ఋ షి వ్రజంబు,
  బ్రహ్మనిర్వాణపదమును బడయుచుంద్రు
 
 
 26.  
  కామమును క్రోధమును బాయ గలుగువారు
  నియతచిత్తులు యింద్రియ నిగ్రహులును,
  ఆత్మవిజ్ఞానులౌ యతు లందుకొంద్రు,
  బ్రహ్మనిర్వాణపద మిహ పరములందు
 Play This Verse
 
 27.  
  బాహ్యవిషయాల మనసును బఱగ నీక,
  బొమల నడుమను దృష్టిని బూని నిలిపి,
  వాయుసంచరన్నాసికా ద్వారమందు,
  ప్రాణము నపానమును సమ పాళ్ళ నుంచి,
 
 
 28.  
  మనసు బుద్ధీంద్రియమ్ముల మసల నీక,
  భయము రాగము క్రోధము పారద్రోలి,
  మోక్షమొక్కటె కోరెడు ముని యెవండొ,
  ఆతడే నిత్యముక్తుడై యలరు వాడు
 Play This Verse
 
 29.  
  యజ్ఞతపముల భోక్త నేనగుదునంచు
  సర్వలోకములకు మహేశ్వరుడ నంచు,
  ఎల్ల భూతములకు నే సుహృదుడ నంచు,
  నరయు యోగియె శాంతి సౌఖ్యమ్ములందు.
 
 
 
 1.  
  సంన్యాసం కర్మణాం కృష్ణ
   పునర్యోగం చ శంససి
  యచ్ఛ్రేయ ఏతయోరేకం
   తన్మే బ్రూహి సునిశ్చితమ్
 
 
 2.  శ్రీభగవానువాచ:
  సంన్యాసః కర్మయోగశ్చ
   నిఃశ్రేయసకరావుభౌ
  తయోస్తు కర్మసంన్యాసా
  త్కర్మయోగో విశిష్యతే
 Play This verse
 
 3.  
  జ్ఞేయః స నిత్యసంన్యాసీ
   యో న ద్వేష్టి న కాఙ్క్షతి
  నిర్ద్వన్ద్వో హి మహాబాహో
   సుఖం బన్ధాత్ప్రముచ్యతే
 
 
 4.  
  సాంఖ్యయోగౌ పృథగ్బాలాః
   ప్రవదన్తి న పణ్డితాః
  ఏకమప్యాస్థితః సమ్య
  గుభయోర్విన్దతే ఫలమ్
 
 
 5.  
  యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం
   తద్యోగైరపి గమ్యతే
  ఏకం సాంఖ్యం చ యోగం
  చ యః పశ్యతి స పశ్యతి
 
 
 6.  
  సంన్యాసస్తు మహాబాహో
   దుఃఖమాప్తుమయోగతః
  యోగయుక్తో మునిర్బ్రహ్మ
   నచిరేణాధిగచ్ఛతి
 
 
 7.  
  యోగయుక్తో విశుద్ధాత్మా
   విజితాత్మా జితేన్ద్రియః
  సర్వభూతాత్మభూతాత్మా
   కుర్వన్నపి న లిప్యతే
 
 
 8.  
  నైవ కించిత్కరోమీతి
   యుక్తో మన్యేత తత్త్వవిత్
  పశ్యఞ్శ్రృణ్వన్స్పృశఞ్జిఘ్ర
  న్నశ్నన్‌గచ్ఛన్స్వపఞ్శ్వసన్
 
 
 9.  
  ప్రలపన్విసృజన్గృహ్ణ
  న్నున్మిషన్నిమిషన్నపి
  ఇన్ద్రియాణీన్ద్రియార్థేషు
   వర్తన్త ఇతి ధారయన్౯
 
 
 10.  
  బ్రహ్మణ్యాధాయ కర్మాణి
   సఙ్గం త్యక్త్వా కరోతి యః
  లిప్యతే న స పాపేన
   పద్మపత్రమివామ్భసా ౦
 Play This verse
 
 11.  
  కాయేన మనసా బుద్ధ్యా
   కేవలైరిన్ద్రియైరపి
  యోగినః కర్మ కుర్వన్తి
   సఙ్గం త్యక్త్వాత్మశుద్ధయే
 
 
 12.  
  యుక్తః కర్మఫలం త్యక్త్వా
   శాన్తిమాప్నోతి నైష్ఠికీమ్
  అయుక్తః కామకారేణ
   ఫలే సక్తో నిబధ్యతే
 
 
 13.  
  సర్వకర్మాణి మనసా
   సంన్యస్యాస్తే సుఖం వశీ
  నవద్వారే పురే దేహీ
   నైవ కుర్వన్న కారయన్
 
 
 14.  
  న కర్తృత్వం న కర్మాణి
   లోకస్య సృజతి ప్రభుః
  న కర్మఫలసంయోగం
  స్వభావస్తు ప్రవర్తతే
 
 
 15.  
  నాదత్తే కస్యచిత్పాపం
   న చైవ సుకృతం విభుః
  అజ్ఞానేనావృతం జ్ఞానం
   తేన ముహ్యన్తి జన్తవః
 
 
 16.  
  జ్ఞానేన తు తదజ్ఞానం
   యేషాం నాశితమాత్మనః
  తేషామాదిత్యవజ్జ్ఞానం
   ప్రకాశయతి తత్పరమ్
 Play This verse
 
 17.  
  తద్‌బుద్ధయస్తదాత్మా
  నస్తన్నిష్ఠాస్తత్పరాయణాః
  గచ్ఛన్త్యపునరావృత్తిం
   జ్ఞాననిర్ధూతకల్మషాః
 
 
 18.  
  విద్యావినయసంపన్నే
   బ్రాహ్మణే గవి హస్తిని
  శుని చైవ శ్వపాకే చ
   పణ్డితాః సమదర్శినః
 Play This verse
 
 19.  
  ఇహైవ తైర్జితః సర్గో
   యేషాం సామ్యే స్థితం మనః
  నిర్దోషం హి సమం బ్రహ్మ
   తస్మాద్బ్రహ్మణి తే స్థితాః ౯
 
 
 20.  
  న ప్రహృష్యేత్ప్రియం ప్రాప్య
  నోద్విజేత్ప్రాప్య చాప్రియమ్
  స్థిరబుద్ధిరసంమూఢో
  బ్రహ్మవిద్బ్రహ్మణి స్థితః
 
 
 21.  
  బాహ్యస్పర్శేష్వసక్తాత్మా
   విన్దత్యాత్మని యత్ సుఖమ్
  స బ్రహ్మయోగయుక్తాత్మా
  సుఖమక్షయమశ్నుతే
 
 
 22.  
  యే హి సంస్పర్శజా భోగా
   దుఃఖయోనయ ఏవ తే
  ఆద్యన్తవన్తః కౌన్తేయ
   న తేషు రమతే బుధః
 
 
 23.  
  శక్నోతీహైవ యః సోఢుం
   ప్రాక్శరీరవిమోక్షణాత్
  కామక్రోధోద్భవం వేగం
   స యుక్తః స సుఖీ నరః
 Play This verse
 
 24.  
  యోఽన్తఃసుఖోఽన్తరారామ
  స్తథాన్తర్జ్యోతిరేవ యః
  స యోగీ బ్రహ్మనిర్వాణం
   బ్రహ్మభూతోఽధిగచ్ఛతి
 
 
 25.  
  లభన్తే బ్రహ్మనిర్వాణ
  మృషయః క్షీణకల్మషాః
  ఛిన్నద్వైధా యతాత్మానః
   సర్వభూతహితే రతాః
 
 
 26.  
  కామక్రోధవియుక్తానాం
   యతీనాం యతచేతసామ్
  అభితో బ్రహ్మనిర్వాణం
   వర్తతే విదితాత్మనామ్
 
 
 27.  
  స్పర్శాన్కృత్వా బహిర్బాహ్యాం
  శ్చక్షుశ్చైవాన్తరే భ్రువోః
  ప్రాణాపానౌ సమౌ కృత్వా
   నాసాభ్యన్తరచారిణౌ
 
 
 28.  
  యతేన్ద్రియమనోబుద్ధి
  ర్మునిర్మోక్షపరాయణః
  విగతేచ్ఛాభయక్రోధో యః
   సదా ముక్త ఏవ సః
 Play This verse
 
 29.  
  భోక్తారం యజ్ఞతపసాం
   సర్వలోకమహేశ్వరమ్
  సుహృదం సర్వభూతానాం
   జ్ఞాత్వా మాం శాన్తిమృచ్ఛతి ౯
 Play This verse
 
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18