Tetagitulu with
 
 
 
 
Book Release Event
 
   Subscribe To Slokas
  
     
 
  Introduction
  Home
  Foreword
  Prayer
  What is Tetagiti ?
  Commentaries
  Provide Feedback
 
శ్రీమద్భగవద్గీత
తేటగీతులలొ తెనుగుసేత
  by Late Dr. P.V. Satyanarayana Rao
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ:
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18
 
  6. షష్ఠాధ్యాయము : ఆత్మసంయమయోగము
 
 1.  శ్రీ భగవానుడనెను:
  కర్మఫలముల యందునకాంక్షగొనక,
  విహితకర్మము లెవ్వడువిడక సేయు,
  అతడె సన్యాసి,యోగియునగును గాని,
  యజ్ఞ దాన తపః క్రియాత్యాగి కాడు.
 
 
 2.  
  ఏది సన్యాసమని పెద్దలెంచినారొ,
  దానినే యోగ మంచునుదలపు మీవు,
  సకల సంకల్పముల ఫలసహితముగను,
  త్యాగమును సేయ కొక్కడుయోగికాడు.
 
 
 3.  
  జ్ఞానయోగ మారోహింపబూను మునికి,
  సాధనం బని చెపిరి నిష్కామకర్మ,
  జ్ఞానయోగ సుస్థిరుడైనమౌని కగును,
  సర్వకర్మ నివృత్తియేసాధనంబు.
 
 
 4.  
  ఇంద్రియార్ధము లందెవ్వడిచ్చ గొనక,
  సర్వకర్మములం దనాసక్తు డగుచు,
  సకల సంకల్పము లెపుడుసన్యసించు,
  అప్పుడతని యోగారూఢుడండ్రు బుధులు.
 
 
 5.  
  నిష్కళంకపు బుద్ధిచేనీదు మనసు,
  నుద్ధరింపు, మధోగతినొంద నీకు,
  నిర్మలాత్మయె బంధువునీకు నెపుడు,
  నీదు కలుషిత చిత్తమేనీ విరోధి.
 Play This Verse
 
 6.  
  ఎవని మనసు జయించు దేహేంద్రియముల,
  వాని మనసే యతని కాత్మబంధువగును,
  ఎవని మనసట్టివాని జయింప లేదొ,
  అదియె నతనికి రిపునట్లుహాని జేయు.
 
 
 7.  
  సంయతాత్ముడు చిత్తప్రశాంతశీలి,
  తుల్యుడై సుఖదుఃఖ శీతోష్ణములను,
  (సమగ)నుండి మానావమానములయందు,
  వఱలు పరమాత్మసంస్థితభావు డగుచు.
 
 
 8.  
  జ్ఞానవిజ్ఞాన తృప్తాత్ముడైనవాని,
  నిర్జితేంద్రియు,కూటస్థు,నిశ్చలితుని,
  పసిడి, మట్టిని,రాలొకేపగిది జూచు,
  యుక్తపురుషుని నారూఢయోగియండ్రు.
 
 
 9.  
  మిత్రులందు,సుహృదులందు,శత్రులందు,
  బంధు,మధ్యస్థ, తాటస్థ్యపాపు లందు,
  సాధువులయందు,ద్వేష్యులసమతనుండు,
  యుక్తపురుషుని నారూఢయోగియండ్రు.
 
 
 10.  
  కాంక్షలను బాసి,ధన పరిగ్రహణ మాని,
  దేహము మనస్సు తనకు స్వాధీన పఱచి,
  యోగి నిర్జనస్థానమందొకడెయుండి,
  సతత మంతఃకరణ సమాహితమొనర్చి;
 
 
 11.  
  మిగుల పల్లము లేని, పెన్మిఱ్ఱులేని,
  శుద్ధి జేసిన యొంటరిచోటునందు,
  కుశలు మృగచర్మవస్త్రముల్గూర్చి వరుస,
  తనకు స్థిరమైనయాసనమొనర జేసి;
 
 
 12.  
  అందు గూర్చుండి మనసు నేకాగ్రపఱచి,
  వివిధచిత్తేంద్రియక్రియావృత్తులణచి,
  యోగి యంతఃకరణ శుద్ధినొందు కొఱకు,
  అభ్యసింపగవలె యోగమచలు డగుచు.
 
 
 13.  
  తలయు,మెడయును,నొడలునుతలక నీక,
  సమముగా నిల్పి మనసు నిశ్చలత నెఱపి,
  చూపు నటు నిటు దిక్కులచొనప బోక,
  తనదు భ్రూమధ్యమందునదనర నిలిపి;
 
 
 14.  
  శాంతమానసుడై భయభ్రాంతి బాసి,
  బ్రహ్మచర్యవ్రతస్థిరత్వమున నిలిచి,
  మనసు నియమించి,నాలోనిమగ్ను డగుచు,
  యోగమందు మత్పరత గూర్చుండ వలయు.
 
 
 15.  
  నియతమానసు డింద్రియనిగ్రహుండు,
  యోగి మనసెపుడు సమాధినుంచి యిట్లు,
  ధ్యానమును జేసి,యస్మదధీనమైన,
  పరమ నిర్వాణమౌ శాంతిపదము బొందు.
 
 
 16.  
  వెక్కసము గాక భుజియించువెక్కలికిని,
  మరియు నేమియు దిననట్టిమానవునకు,
  కరము నిద్రాణున కతిజాగరిత కైన,
  ఫల్గునా!ధ్యానయోగముపట్టువడదు.
 
 
 17.  
  సముచితాహారి నియత సంచారి మఱియు
  తగిన మెలుకువయు, తగు నిద్ర గలవాడు,
  కర్మముల యుక్తరీతినిగడపువాడు,
  దుఃఖహరమైన యోగముదొరయ గలుగు.
 
 
 18.  
  చిత్తమును నిగ్రహింపగజేసి యుంచి,
  ఆత్మయందె సమహితుడగు నెవండు
  సర్వకామేచ్చలను వీడజాలు నెప్పు
  డప్పుడే యోగియని వానిననుచు నుంద్రు.
 
 
 19.  
  వాయుగీతిలేనిచోట,దీపంబు యెట్లు
  కదలికే లేక వెలుగు నేకాగ్రముగను,
  అట్లె, యాత్మసంయమయోగమభ్యసించు
  యోగి, చిత్తమేకాగ్రమైయుండ వలయు.
 
 
 20.  
  నిగ్రహింపబడి యోగనిష్ఠవలన
  చిత్త మెయ్యెడ నుపరతిజెందియుండు
  ఆత్మచే నేస్థితిని బరమాత్మ జూచి
  అనుభవించునొ యానందమాత్మయందె;
 
 
 21.  
  ఎట్టి స్ఠితియందు నింద్రియాలెఱుగ లేక
  నే యనంతసుఖము బుద్ధియే గ్రహించు,
  తెలిసి దానిని యోగి యేస్ఠితిని నున్న
  ఆత్మ తత్త్వము నందె తానచలు డగునొ;
 
 
 22.  
  ఆత్మసుఖలాభ మెట్టిదియబ్బియున్న
  యితర లాభము మిన్నగానెంచబోడొ,
  ఆత్మతత్త్వము నెద్ధానినాశ్రయింప,
  దుస్సహంబగు దుఃఖాలదురపిలండొ;
 
 
 23.  
  దుకఃఖసంయోగ మద్దానితొలగ ద్రోయు
  స్ఠితిని యోగము పేర గుర్తింప వలయు
  విసుగు జెందని చిత్త ప్రవృత్తి తోడ,
  సలుపు మాయోగమే పట్టుసడల నీక.
 
 
 24.  
  కలుగు సంకల్ప జన్యమౌకామములను,
  సర్వమును నిర్విశేషముసంత్యజించి
  మనసు చేతనె యింద్రియగణము నెల్ల
  ఎల్ల విషయాలనుండి నివృత్తిపఱచి;
 
 
 25.  
  ధైర్య మొనసిన బుద్ధిచేతనదు మనసు,
  నాత్మయందున స్ఠిరముగానమర నిలిపి,
  ఉల్లమున నుపరతి మెలమెల్ల పొంది,
  ఒండొకింతయు చింతింపకుండ వలయు.
 Play This Verse
 
 26.  
  అస్ఠిరంబును, జంచలమైన మనసు,
  విడక యేయే విషయములవెంట దిరుగు
  దాని నాయావిషయములదగుల నీక,
  త్రిప్పి స్థిరబఱ్చు మాత్మ స్వాధీన మందె.
 Play This Verse
 
 27.  
  శాంతరజసుడు, మానసశాంతశీలి,
  పాపరహితుడు, బ్రహ్య్మైక్యభావనుండు,
  ఎవని స్వాధీనమై మనసెప్పు డుండు,
  ఉత్తమసుఖ మాయోగినేయొనర జెందు.
 
 
 28.  
  ఇట్లు మనసును యోగమందెప్పు డుంచి,
  పాపపంకిల మెల్లనుబాసి యోగి,
  బ్రహ్మసందర్శనము లెస్సబడసి యుండి
  సులభముగ బొందు, నత్యంతసుఖము వాడు.
 
 
 29.  
  సకలభూతముల సమ వీక్షణము గలిగి,
  అన్నిభూతము లందు దానున్న యట్లు,
  అన్నిభుతములు దనయందున్నయట్లు,
  యోగయుక్తాత్మ దర్శించుచుండు నెపుడు.
 Play This Verse
 
 30.  
  ఎవడు సర్వత్ర నన్నె దర్శించు చుండు,
  ఎవడు నాయందె దర్శించునెల్ల వాని,
  వానికిని నేను దూరపువాడ గాను,
  వాడు నాకును దూరపువాడు గాడు.
 
 
 31.  
  ఎవడు సర్వభూతస్ఠితుడే నటంచు,
  భజన సేయునో, యేకత్వభావనిరతి,
  సర్వవిధముల కర్మలుసలిపి కూడ
  అతడు నాయందె వర్తించునట్టి యోగి.
 
 
 32.  
  సుఖమె కలిగిన, దుఃఖమేచొప్పడిలిన
  భూతచయ మెట్టిదేనియుపొందు నేని,
  తనదు సుఖదుఃఖముల భంగితలచు నెవ్వ
  డట్టి యోగియె శ్రేష్ఠుడౌనని దలంతు.
 
 
 33.  అర్జునుడనెను:
  మాధవా!నీవు సర్వ సమత్వబుద్ధి
  యోగ మిట్లేది జెపితివోయొప్పు మీఱ,
  మనసు మిక్కిలి చంచలమైన దగుట
  దీని స్ఠిరమైన స్ఠితిని నేదెలియ నైతి.
 
 
 34.  
  చంచలం బెంతయు దృఢ మసాధ్యమయ్యు
  ఇంద్రియములను మనసు క్షోభింప జేయు,
  ఇట్టి మనసును నే నిగ్రహింప నెంచ
  గాలి వలె మూటగట్ట దుష్కరము గాదె.
 
 
 35.  శ్రీ భగవానుడనెను:
  సంశయము లేదొకింతయుసవ్యసాచి!
  మనసు దుర్నిగ్రహమె, చలమైన గాని,
  ధ్యాన వైరాగ్యముల రెంటినభ్యసించి
  నిగ్రహింపగ వచ్చునునిశ్చలముగ.
 
 
 36.  
  ఆత్మసంయమ మొనరింపనట్టి మూఢు
  డట్టి యోగము పొంద లేడని తలంతు
  కాని యత్నముచే వశ్యమానసుండు,
  పడయ శక్తుండగు నుచితోపాయమునను.
 
 
 37.  అర్జునుడనెను:
  శ్రద్ధ గలిగియు, నియమ విరహితు డగుచు,
  యోగమున మనసు చలించియున్నవాడు,
  యోగసంసిద్ధి పొందకయుంటె గాక
  యెట్టి గతి జేరునో కృష్ణ! యెఱుగ జెపుమ.
 
 
 38.  
  బ్రహ్మపథమున మూడుడైపరగు మనుజు
  డిహ పరమ్ములం దాశ్రయమేది లేక,
  జ్ఞాన కర్మము లీరెంటిగతిని జాఱి,
  ఛిన్నమేఘము వలె కృష్ణచేటువడడొ.
 
 
 39.  
  ఇట్టి నాసంశయమ్మునుకృష్ణ!నీవె,
  సెలగ నర్హుండ వగుదు నిశ్శేషముగను,
  ఇట్టి సంశయ మ్మీవుగాకితరు డెవడు
  త్రుంపగలవాడు నాకెందుదొరక బోడు.
 
 
 40.  శ్రీ భగవానుడనెను:
  ఇహమునం గాని, పరము నందేని పార్ఠ!
  నాశ మొందడు కర్మవినష్టుడయ్యు,
  వత్స!కళ్యాణకర్ము డెవండు గాని
  యెట్టి దుర్గతి నేనియుమెట్టబోడు.
 
 
 41.  
  అర్జునా!యోగభ్రష్టుడైనవాడు
  పుణ్యకర్ముల లోకాలుపొంది యచట,
  పెద్దకాలము నివసించిపిదప బుట్టు,
  శ్రీయు, శుచియును గలవారిగృహము లందు.
 
 
 42.  
  అట్లు కాదేని,భ్రష్టుడైనట్టివాడు
  జ్ఞానయోగుల కులమందుజననమొందు
  ఇట్టి జన్మకు తుల్యమౌనితర మొకటి,
  పొంద దుర్లభ మీలోకమందు మిగుల.
 
 
 43.  
  అట్టి జన్మము బొందినయట్టి యోగి
  పూర్వదైహిక సంస్కారబుద్ధి నొంది,
  అట్టి సంస్కారము వలననతడు మరల,
  చేయు నత్యంతయత్నముసిద్ధి బొంద.
 
 
 44.  
  పూర్వదైహికాబ్యాసమెప్రోత్సహింప,
  లాగబడు నాత డవశుడైయోగ దిశకు,
  అతడు యోగజిజ్ఞాసువేయైన గూడ,
  కడువ గలుగును వేదోక్తకర్మఫలము.
 
 
 45.  
  కాని, యత్యంతయత్నముజ్ఞాని సలిపి,
  విగతకల్మషు డగుచు, బవిత్రు డగుచు,
  వాని బహుజన్మ సంస్కారఫలితమైన,
  పరమపదమును బిమ్మటబడయు నతడు.
 
 
 46.  
  ధ్యాన యోగియె నధికుడౌతపసి కన్న,
  ధ్యాన యోగియె మిన్న శాస్త్రజ్ఞు కన్న,
  ధ్యానయోగియె కర్మఠుకన్న మిన్న,
  కాన,అర్జునా!యోగివికమ్ము నీవు.
 
 
 47.  
  అంతరాత్మను నాయందెహత్తియుంచి,
  ఎవడు శ్రద్ధాళువై భజియించు నన్నె,
  యోగు లందెల్ల నాధ్యానయోగి వరుని
  సర్వతః శ్రేష్ఠుగా నేనుసమ్మతింతు.
 
 
 
 1.  శ్రీభగవానువాచ:
  అనాశ్రితః కర్మఫలం
   కార్యం కర్మ కరోతి యః
  స సంన్యాసీ చ యోగీ
   చ న నిరగ్నిర్న చాక్రియః
 
 
 2.  
  యం సంన్యాసమితి ప్రాహు
  ర్యోగం తం విద్ధి పాణ్డవ
  న హ్యసంన్యస్తసంకల్పో
   యోగీ భవతి కశ్చన
 Play This verse
 
 3.  
  ఆరురుక్షోర్మునేర్యోగం
   కర్మ కారణముచ్యతే
  యోగారూఢస్య తస్యైవ
   శమః కారణముచ్యతే
 
 
 4.  
  యదా హి నేన్ద్రియార్థేషు
   న కర్మస్వనుషజ్జతే
  సర్వసంకల్పసంన్యాసీ
  యోగారూఢస్తదోచ్యతే
 
 
 5.  
  ఉద్ధరేదాత్మనాత్మానం
  నాత్మానమవసాదయేత్
  ఆత్మైవ హ్యాత్మనో బన్ధు
  రాత్మైవ రిపురాత్మనః
 
 
 6.  
  బన్ధురాత్మాత్మనస్తస్య
  యేనాత్మైవాత్మనా జితః
  అనాత్మనస్తు శత్రుత్వే
   వర్తేతాత్మైవ శత్రువత్
 
 
 7.  
  జితాత్మనః ప్రశాన్తస్య
   పరమాత్మా సమాహితః
  శీతోష్ణసుఖదుఃఖేషు
  తథా మానాపమానయోః
 
 
 8.  
  జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా
  కూటస్థో విజితేన్ద్రియః
  యుక్త ఇత్యుచ్యతే యోగీ
  సమలోష్టాశ్మకాఞ్చనః
 
 
 9.  
  సుహృన్మిత్రార్యుదాసీ
  నమధ్యస్థద్వేష్యబన్ధుషు
  సాధుష్వపి చ పాపేషు
   సమబుద్ధిర్విశిష్యతే ౯
 
 
 10.  
  యోగీ యుఞ్జీత సతత
  మాత్మానం రహసి స్థితః
  ఏకాకీ యతచిత్తాత్మా
   నిరాశీరపరిగ్రహః ౦
 
 
 11.  
  శుచౌ దేశే ప్రతిష్ఠాప్య
  స్థిరమాసనమాత్మనః
  నాత్యుచ్ఛ్రితం నాతినీచం
   చైలాజినకుశోత్తరమ్
 
 
 12.  
  తత్రైకాగ్రం మనః కృత్వా
   యతచిత్తేన్ద్రియక్రియః
  ఉపవిశ్యాసనే యుఞ్జ్యా
  ద్యోగమాత్మవిశుద్ధయే
 
 
 13.  
  సమం కాయశిరోగ్రీవం
   ధారయన్నచలం స్థిరః
  సమ్ప్రేక్ష్య నాసికాగ్రం
  స్వం దిశశ్చానవలోకయన్
 
 
 14.  
  ప్రశాన్తాత్మా విగతభీ
  ర్బ్రహ్మచారివ్రతే స్థితః
  మనః సంయమ్య మచ్చిత్తో
   యుక్త ఆసీత మత్పరః
 
 
 15.  
  యుఞ్జన్నేవం సదాత్మానం
   యోగీ నియతమానసః
  శాన్తిం నిర్వాణపరమాం
   మత్సంస్థామధిగచ్ఛతి
 
 
 16.  
  నాత్యశ్నతస్తు యోగోఽస్తి
   న చైకాన్తమనశ్నతః
  న చాతి స్వప్నశీలస్య
  జాగ్రతో నైవ చార్జున
 
 
 17.  
  యుక్తాహారవిహారస్య
   యుక్తచేష్టస్య కర్మసు
  యుక్తస్వప్నావబోధస్య
   యోగో భవతి దుఃఖహా
 Play This verse
 
 18.  
  యదా వినియతం చిత్త
  మాత్మన్యేవావతిష్ఠతే
  నిఃస్పృహః సర్వకామేభ్యో
   యుక్త ఇత్యుచ్యతే తదా
 
 
 19.  
  యథా దీపో నివాతస్థో
   నేఙ్గతే సోపమా స్మృతా
  యోగినో యతచిత్తస్య
   యుఞ్జతో యోగమాత్మనః ౯
 Play This verse
 
 20.  
  యత్రోపరమతే చిత్తం
  నిరుద్ధం యోగసేవయా
  యత్ర చైవాత్మనాత్మానం
  పశ్యన్నాత్మని తుష్యతి ౦
 
 
 21.  
  సుఖమాత్యన్తికం యత్తద్
   బుద్ధిగ్రాహ్యమతీన్ద్రియమ్
  వేత్తి యత్ర న చైవాయం
   స్థితశ్చలతి తత్త్వతః
 
 
 22.  
  యం లబ్ధ్వా చాపరం లాభం
  మన్యతే నాధికం తతః
  యస్మిన్స్థితో న దుఃఖేన
  గురుణాపి విచాల్యతే
 
 
 23.  
  తం విద్యాద్‌దుఃఖసంయోగ
  వియోగం యోగసంజ్ఞితమ్
  స నిశ్చయేన యోక్తవ్యో
   యోగోఽనిర్విణ్ణచేతసా
 
 
 24.  
  సంకల్పప్రభవాన్కామాం
  స్త్యక్త్వా సర్వానశేషతః
  మనసైవేన్ద్రియగ్రామం
   వినియమ్య సమన్తతః
 
 
 25.  
  శనైః శనైరుపరమేద్‌
  బుద్ధ్యా ధృతిగృహీతయా
  ఆత్మసంస్థం మనః కృత్వా
  న కించిదపి చిన్తయేత్
 
 
 26.  
  యతో యతో నిశ్చరతి
   మనశ్చఞ్చలమస్థిరమ్
  తతస్తతో నియమ్యైత
  దాత్మన్యేవ వశం నయేత్
 
 
 27.  
  ప్రశాన్తమనసం హ్యేనం
   యోగినం సుఖముత్తమమ్
  ఉపైతి శాన్తరజసం
  బ్రహ్మభూతమకల్మషమ్
 
 
 28.  
  యుఞ్జన్నేవం సదాత్మానం
  యోగీ విగతకల్మషః
  సుఖేన బ్రహ్మసంస్పర్శ
  మత్యన్తం సుఖమశ్నుతే
 
 
 29.  
  సర్వభూతస్థమాత్మానం
  సర్వభూతాని చాత్మని
  ఈక్షతే యోగయుక్తాత్మా
   సర్వత్ర సమదర్శనః ౯
 Play This verse
 
 30.  
  యో మాం పశ్యతి సర్వత్ర
   సర్వం చ మయి పశ్యతి
  తస్యాహం న ప్రణశ్యామి
   స చ మే న ప్రణశ్యతి ౦
 
 
 31.  
  సర్వభూతస్థితం యో మాం
   భజత్యేకత్వమాస్థితః
  సర్వథా వర్తమానోఽపి స
   యోగీ మయి వర్తతే
 
 
 32.  
  ఆత్మౌపమ్యేన సర్వత్ర
  సమం పశ్యతి యోఽర్జున
  సుఖం వా యది వా దుఃఖం
   స యోగీ పరమో మతః
 
 
 33.  అర్జున ఉవాచ:
  యోఽయం యోగస్త్వయా ప్రోక్తః
   సామ్యేన మధుసూదన
  ఏతస్యాహం న పశ్యామి
   చఞ్చలత్వాత్స్థితిం స్థిరామ్
 
 
 34.  
  చఞ్చలం హి మనః కృష్ణ
   ప్రమాథి బలవద్‌దృఢమ్
  తస్యాహం నిగ్రహం మన్యే
   వాయోరివ సుదుష్కరమ్
 
 
 35.  శ్రీభగవానువాచ:
  అసంశయం మహాబాహో
   మనో దుర్నిగ్రహం చలమ్
  అభ్యాసేన తు కౌన్తేయ
   వైరాగ్యేణ చ గృహ్యతే
 Play This verse
 
 36.  
  అసంయతాత్మనా యోగో
   దుష్ప్రాప ఇతి మే మతిః
  వశ్యాత్మనా తు యతతా
   శక్యోఽవాప్తుముపాయతః
 
 
 37.  అర్జున ఉవాచ:
  అయతిః శ్రద్ధయోపేతో
   యోగాచ్చలితమానసః
  అప్రాప్య యోగసంసిద్ధిం
   కాం గతిం కృష్ణ గచ్ఛతి
 
 
 38.  
  కచ్చిన్నోభయవిభ్రష్ట
  శ్ఛిన్నాభ్రమివ నశ్యతి
  అప్రతిష్ఠో మహాబాహో
   విమూఢో బ్రహ్మణః పథి
 
 
 39.  
  ఏతన్మే సంశయం కృష్ణ
   ఛేత్తుమర్హస్యశేషతః
  త్వదన్యః సంశయస్యాస్య
   ఛేత్తా న హ్యుపపద్యతే ౯
 
 
 40.  శ్రీభగవానువాచ:
  పార్థ నైవేహ నాముత్ర
  వినాశస్తస్య విద్యతే
  న హి కల్యాణకృత్కశ్చిద్‌
  దుర్గతిం తాత గచ్ఛతి ౦
 
 
 41.  
  ప్రాప్య పుణ్యకృతాం లోకా
  నుషిత్వా శాశ్వతీః సమాః
  శుచీనాం శ్రీమతాం గేహే
   యోగభ్రష్టోఽభిజాయతే
 
 
 42.  
  అథవా యోగినామేవ
   కులే భవతి ధీమతామ్
  ఏతద్ధి దుర్లభతరం
  లోకే జన్మ యదీదృశమ్
 
 
 43.  
  తత్ర తం బుద్ధిసంయోగం
   లభతే పౌర్వదేహికమ్
  యతతే చ తతో భూయః
  సంసిద్ధౌ కురునన్దన
 
 
 44.  
  పూర్వాభ్యాసేన తేనైవ
  హ్రియతే హ్యవశోఽపి సః
  జిజ్ఞాసురపి యోగస్య
   శబ్దబ్రహ్మాతివర్తతే
 
 
 45.  
  ప్రయత్నాద్యతమానస్తు
   యోగీ సంశుద్ధకిల్బిషః
  అనేకజన్మసంసిద్ధ
  స్తతో యాతి పరాం గతిమ్
 
 
 46.  
  తపస్విభ్యోఽధికో యోగీ
   జ్ఞానిభ్యోఽపి మతోఽధికః
  కర్మిభ్యశ్చాధికో యోగీ
   తస్మాద్యోగీ భవార్జున
 
 
 47.  
  యోగినామపి సర్వేషాం
  మద్గతేనాన్తరాత్మనా
  శ్రద్ధావాన్ భజతే యో మాం
   స మే యుక్తతమో మతః
 Play This verse
 
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18