Tetagitulu with
 
 
 
 
Book Release Event
 
   Subscribe To Slokas
  
     
 
  Introduction
  Home
  Foreword
  Prayer
  What is Tetagiti ?
  Commentaries
  Provide Feedback
 
శ్రీమద్భగవద్గీత
తేటగీతులలొ తెనుగుసేత
  by Late Dr. P.V. Satyanarayana Rao
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ:
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18
 
  8. అష్టమాధ్యాయము : అక్షరపరబ్రహ్మయోగము
 
 1.  అర్జునుడనెను:
  ఏది యాబ్రహ్మ, మధ్యాత్మమేది కృష్ణ!
  ఏది పురుషోత్తమా!కర్మమెఱుగజెపుమ,
  ఏది యధిభూత మని వచియింపబడెను
  దేని నధిదైవ మందురుధీరవరులు?
 
 
 2.  
  ఎవ్వ డధియజ్ఞు డనగ, వాడెట్టు లుండు,
  దేవ!యీదేహమందు గుర్తింపగాను,
  నియతచిత్తులు నిన్నెట్టినిష్ఠ బూని
  అరయగల రంత్యకాలము నందు గూడ.
 
 
 3.  శ్రీ భగవానుడనెను:
  పరమ మక్షరమైనదిబ్రహ్మ మండ్రు,
  దాని జీవాంశభావ మధ్యాత్మమండ్రు
  ఇందుగల భూతసృష్టికిహేతువైన
  యజ్ఞద్రవ్యార్పణమె కర్మమని వచింత్రు.
 
 
 4.  
  పుట్టి నశియించునది యధిభూతమనిరి,
  తగ హిరణ్యగర్భుని నధిదైవమనిరి,
  దేహమంతట లోన వర్తించు వాని
  నన్నె యధియజ్ఞు డని బుధులెన్నుచుంద్రు.
 
 
 5.  
  అంత్యకాలమునన్ హృదయమున నన్నె,
  స్మరణ జేయుచు తనువు నేజనుడు వీడు,
  వాడు నా స్వస్వరూపమెపడయ గలడు,
  లేదు సందియ మిందునలేశ మైన.
 
 
 6.  
  ఎవ్వ డె ట్టెట్టి భావమునెద వహించి
  తనువు నిట వీడి యాతడుతరలు చుండు,
  అత డ ట్టట్టి భావమేయందు కొనును,
  నిత్య మాభావమే మదినిలిపి యుంట.
 
 
 7.  
  కాన,అర్జునా!నన్నెల్లకాలములను,
  స్మరణ జేయుచు యుద్ధము సలుపు మీవు,
  మనసు, బుద్ధిని, నాకె యర్పణము జేసి,
  పొందెదవు నన్నె లే దెట్టిసందియంబు.
 
 
 8.  
  చిత్త మితరము నందునజేర నీక,
  నిత్యమభ్యాసయోగవినిష్ఠు డగుచు,
  పరుని, పురుషుని, దివ్య సంస్మరణ జేసి,
  పడయు నాయోగి వానినేపాండుపుత్ర!
 
 
 9.  
  బహుపురాణుని, సర్వజ్ఞుభానువర్ణు,
  అణువు కన్నను బరమాణువైన వాని,
  చీకటుల మించు వాని, నచింత్యరూపు,
  సర్వధారకు, విశ్వశాసకు నెవండు;
 
 
 10.  
  భక్తి సంయుక్తుడై, యోగబలము మెఱయ,
  బొమల నడుమను దృస్ఠిని బూని నిలిపి,
  అచలమతి తోడ స్మరియించునంత్య మందు,.
  పరమ పురుషుని, దివ్యునిబడయునతడు.
 
 
 11.  
  ఏది యక్షర మందురోవేదవిదులు,
  వీతరాగులు యతులునువేగ జేర,
  బ్రహ్మచర్యము గొందు రేపదము గోరి,
  అట్టి పదమును నే సంగ్రహముగ జెపుదు.
 
 
 12.  
  ఇంద్రియద్వారముల నిగ్రహించి యుంచి,
  మనసు నియమించి హృత్స్థానమందు జేర్చి
  ప్రాణవాయువును తనమూర్ధమున నిలిపి
  ఆత్మసంయమ యోగమందచలు డగుచు.
 
 
 13.  
  ప్రణవ మేకాక్షరబ్రహ్మవాచకమును,
  ఓమ్మని పఠించి,స్మరియించు చుండి నన్ను,
  తనువు నిట వీడి యెవ్వడుతరలు చుండు,
  పరమ పదమర్జునా!వాడుపడయ గలడు.
 
 
 14.  
  సతతమును వేరు చింతనసలుప బోక,
  యెల్లెడల నన్నె మదిస్మరియించు చుండి,
  నిత్య మచలసమాధిలోనిలుచు నెవ్వ
  డట్టి యోగికి సులభుడనగుదు నేను.
 
 
 15.  
  నన్ను బొందు మహత్ములెన్నండు గాని,
  అస్ఠిరంబును దుఃఖాలయంబునైన
  పుట్టి గిట్టెడు పొంతలబొంద బోరు,
  పరమ సంసిద్ధి పదమునుబడసి యుంట.
 
 
 16.  
  అర్జునా!బ్రహ్మలోక పర్యంతమైన
  భువనములు పునరావృత్తిబొందు చుండు
  కాని, ననుబొంది యున్నట్టివాని కెపుడు
  మరల జన్మము గల దన్నమాట లేదు.
 
 
 17.  
  యుగ సహస్ర పర్యంత మౌనొక్క పగలు,
  యుగ సహస్రాంత మట్లెయౌనొక్క రేయి,
  యీపగిది బ్రహ్మకాలమునెఱుగు వారె,
  రేలబవళుల గణియించుకాల విదులు.
 
 
 18.  
  ప్రభవమొందును బ్రహ్మకుపగలు రాగ,
  వ్యక్తమై లోక మవ్యక్తమందు నుండి,
  ప్రళయ మొందును బ్రహ్మకురాత్రి రాగ
  సర్వ మవ్యక్తమైన యా సంజ్ఞ మందె.
 
 
 19.  
  పూర్వకాలము నందలిభూతకోటి,
  పుట్టి,పుట్టియు, ప్రవిలయమొందు మరల,
  పొద్దు గ్రుంకిన నవశమైపొలియు చుండు,
  ప్రొద్దు బొడిచిన మరితిర్గిబుట్టు నన్ని.
 
 
 20.  
  కాని, యవ్యక్తమున కన్నకలదు వేరె,
  పరమ మవ్యక్త శాశ్వతభావ మొకటి;
  భూతములు నెల్ల నశియింపబొలియ దేదొ
  అదియె నక్షరంబైన బ్రహ్మంబు పార్ఠ!
 
 
 21.  
  అందు రెద్దాని నవ్యక్త మక్షర మని,
  పరమపదమని దానినేపలుకు చుంద్రు,
  ఏది ప్రాప్తింప తిరిగి వారిటకు రారొ,
  అదియె నాపరమ నివాసపదము పార్ఠ!
 Play This Verse
 
 22.  
  ఎవనిలో లీనమై ప్రాణులెల్ల నుండు,
  ఎవనిచే లోక మంత వ్యాపింప బడియె,
  పరుని, పురుషుని, దివ్యునవ్వాని పార్ఠ!
  పడయ వచ్చు న నన్యమౌ భక్తి చేత.
 
 
 23.  
  ఎట్టి కాలము నందుననెట్టి త్రోవ,
  కర్మయోగులు జనినచోకౌరవేంద్ర!
  వా రనావృత్తి నావృత్తిబడయ గలరొ,
  అట్టి కాలమార్గముల నీవరయ జెపుదు.
 
 
 24.  
  శుక్లపక్షము, పవ, లగ్నిజ్యోతి గూడి,
  ఆరుమాసాల నుత్తరాయణమునందు,
  మరణమును బొంది, చన, దేవమార్గమందు,
  బ్రహ్మమును జేరి, యుందురుబ్రహ్మవిదులు.
 
 
 25.  
  కృష్ణపక్షము, ధూమమురేయి గూడి,
  ఆరు మాసాల దక్షిణాయనము నందు,
  కామ్య కర్మలు, పితృమార్గగాము లగుచు,
  చంద్రకళ జేరి కొందురుజన్మ మఱల.
 
 
 26.  
  శుక్లకృష్ణము లను రెండుసూక్ష్మగతులు,
  జగతి యందున శాశ్వతసమ్మతములు,
  కలుగ దిక జన్మ శుక్లమార్గమున బోవ,
  కలుగు మరు జన్మకృష్ణమార్గమున బోవ.
 
 
 27.  
  ఇట్టు లీరెండు బాటలనెఱిగియున్న
  యోగి యెవ్వడు మోహమునొంద బోడు;
  కాన, నోయర్జునా!సర్వకాలములను,
  యోగ యుక్తుండ వగుచు నీవుండ వలయు.
 Play This Verse
 
 28.  
  వేదముల, తపో యజ్ఞ దానాదిక్రియల
  కెట్టి పుణ్యఫలము నిర్ణయింప బడెనొ,
  అట్టి ఫలముల నన్నింటినధిగమించి
  పరమపదుడైన యాద్యునిబడయు యోగి.
 
 
 
 1.  అర్జున ఉవాచ:
  కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం
  కిం కర్మ పురుషోత్తమ
  అధిభూతం చ కిం ప్రోక్త
  మధిదైవం కిముచ్యతే
 
 
 2.  
  అధియజ్ఞః కథం కోఽత్ర
  దేహేఽస్మిన్మధుసూదన
  ప్రయాణకాలే చ కథం
   జ్ఞేయోఽసి నియతాత్మభిః
 
 
 3.  శ్రీభగవానువాచ:
  అక్షరం బ్రహ్మ పరమం
  స్వభావోఽధ్యాత్మముచ్యతే
  భూతభావోద్భవకరో
   విసర్గః కర్మసంజ్ఞితః
 
 
 4.  
  అధిభూతం క్షరో భావః
  పురుషశ్చాధిదైవతమ్
  అధియజ్ఞోఽహమేవాత్ర
  దేహే దేహభృతాం వర
 
 
 5.  
  అన్తకాలే చ మామేవ
  స్మరన్ముక్త్వా కలేవరమ్
  యః ప్రయాతి స మద్భావం
   యాతి నాస్త్యత్ర సంశయః
 Play This verse
 
 6.  
  యం యం వాపి స్మరన్భావం
  త్యజత్యన్తే కలేవరమ్
  తం తమేవైతి కౌన్తేయ
  సదా తద్భావభావితః
 
 
 7.  
  తస్మాత్సర్వేషు కాలేషు
   మామనుస్మర యుధ్య చ
  మయ్యర్పితమనోబుద్ధి
  ర్మామేవైష్యస్యసంశయమ్
 
 
 8.  
  అభ్యాసయోగయుక్తేన
  చేతసా నాన్యగామినా
  పరమం పురుషం దివ్యం
  యాతి పార్థానుచిన్తయన్
 Play This verse
 
 9.  
  కవిం పురాణమనుశాసితార
  మణోరణీయాంసమనుస్మరేద్యః
  సర్వస్య ధాతారమచిన్త్యరూప
  మాదిత్యవర్ణం తమసః పరస్తాత్ ౯
 Play This verse
 
 10.  
  ప్రయాణకాలే మనసాచలేన
  భక్త్యా యుక్తో యోగబలేన చైవ
  భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్
  స తం పరం పురుషముపైతి దివ్యమ్ ౦
 
 
 11.  
  యదక్షరం వేదవిదో వదన్తి
  విశన్తి యద్యతయో వీతరాగాః
  యదిచ్ఛన్తో బ్రహ్మచర్యం చరన్తి
  తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే
 
 
 12.  
  సర్వద్వారాణి సంయమ్య
   మనో హృది నిరుధ్య చ
  మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణ
  మాస్థితో యోగధారణామ్
 
 
 13.  
  ఓమిత్యేకాక్షరం బ్రహ్మ
   వ్యాహరన్మామనుస్మరన్
  యః ప్రయాతి త్యజన్దేహం
   స యాతి పరమాం గతిమ్
 
 
 14.  
  అనన్యచేతాః సతతం
   యో మాం స్మరతి నిత్యశః
  తస్యాహం సులభః పార్థ
   నిత్యయుక్తస్య యోగినః
 
 
 15.  
  మాముపేత్య పునర్జన్మ
   దుఃఖాలయమశాశ్వతమ్
  నాప్నువన్తి మహాత్మానః
   సంసిద్ధిం పరమాం గతాః
 
 
 16.  
  ఆబ్రహ్మభువనాల్లోకాః
  పునరావర్తినోఽర్జున
  మాముపేత్య తు కౌన్తేయ
   పునర్జన్మ న విద్యతే
 
 
 17.  
  సహస్రయుగపర్యన్త
  మహర్యద్బ్రహ్మణో విదుః
  రాత్రిం యుగసహస్రాన్తాం
   తేఽహోరాత్రవిదో జనాః
 
 
 18.  
  అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః
   ప్రభవన్త్యహరాగమే
  రాత్ర్యాగమే ప్రలీయన్తే
   తత్రైవావ్యక్తసంజ్ఞకే
 
 
 19.  
  భూతగ్రామః స ఏవాయం
  భూత్వా భూత్వా ప్రలీయతే
  రాత్ర్యాగమేఽవశః పార్థ
   ప్రభవత్యహరాగమే ౯
 
 
 20.  
  పరస్తస్మాత్తు భావోఽన్యోఽ
  వ్యక్తోఽవ్యక్తాత్సనాతనః
  యః స సర్వేషు భూతేషు
   నశ్యత్సు న వినశ్యతి ౦
 
 
 21.  
  అవ్యక్తోఽక్షర ఇత్యుక్తస్త
  మాహుః పరమాం గతిమ్
  యం ప్రాప్య న నివర్తన్తే
   తద్ధామ పరమం మమ
 Play This verse
 
 22.  
  పురుషః స పరః పార్థ
  భక్త్యా లభ్యస్త్వనన్యయా
  యస్యాన్తఃస్థాని భూతాని
  యేన సర్వమిదం తతమ్
 
 
 23.  
  యత్ర కాలే త్వనావృత్తి
  మావృత్తిం చైవ యోగినః
  ప్రయాతా యాన్తి తం కాలం
   వక్ష్యామి భరతర్షభ
 
 
 24.  
  అగ్నిర్జ్యోతిరహః శుక్లః
  షణ్మాసా ఉత్తరాయణమ్
  తత్ర ప్రయాతా గచ్ఛన్తి
   బ్రహ్మ బ్రహ్మవిదో జనాః
 
 
 25.  
  ధూమో రాత్రిస్తథా కృష్ణః
   షణ్మాసా దక్షిణాయనమ్
  తత్ర చాన్ద్రమసం జ్యోతి
  ర్యోగీ ప్రాప్య నివర్తతే
 
 
 26.  
  శుక్లకృష్ణే గతీ హ్యేతే
  జగతః శాశ్వతే మతే
  ఏకయా యాత్యనావృత్తి
  మన్యయావర్తతే పునః
 Play This verse
 
 27.  
  నైతే సృతీ పార్థ జాన
  న్యోగీ ముహ్యతి కశ్చన
  తస్మాత్సర్వేషు కాలేషు
  యోగయుక్తో భవార్జున
 
 
 28.  
  వేదేషు యజ్ఞేషు తపఃసు చైవ
  దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టమ్
  అత్యేతి తత్సర్వమిదం విదిత్వా
  యోగీ పరం స్థానముపైతి చాద్యమ్
 Play This verse
 
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18