|
1. శ్రీ భగవానుడనెను: |
జ్ఞాన మెద్దాని విజ్ఞాన సహితముగను, |
తెలిసి కొన్నను నశుభముల్ తొలగునన్ని, |
గుహ్యతమమైన దానిని గూర్చి యిపుడు, |
తెలియ జెప్పుదు నీకు వి ద్వేష రహిత |
|
|
|
2. |
రాజగుహ్య మాత్మజ్ఞాన రాజవిద్య, |
పరమపావన మిది, దృష్ట ఫలముగలది, |
ఉత్తమంబును, ధర్మ సం యుక్తమైన |
దాచరింపగ సుఖమైన దవ్యయంబు |
|
|
|
3. |
అట్లు విజ్ఞాన ధర్మమై యలరు దాని |
విశ్వసింపని పురుషులు వెడగమతులు, |
పడయ జాలక, పరమ సం ప్రాప్యు నన్ను, |
మృత్యుసంసార పథముల మెట్టుచుంద్రు |
|
|
|
4. |
పార్థ! మామకావ్యక్త రూ పంబు చేత, |
వ్యాప్తమైయుంటి నీ జగ మంత నేనె, |
సర్వ భూతములుండు నా స్థాన మందె, |
కాని, నే నాశ్రయించి య వ్వాన లేను |
|
|
|
5. |
లేవు నాయందు భూతము లేవి గాని, |
భూతహేతువునై వృద్ధి జేతు వాని, |
వాని భరియింతు కాని నేవాన లేను, |
కాంచు మిది మామకీన యో గైశ్వరమును |
|
|
|
6. |
సతత మాకాశ మందున సంచరించు, |
నీమహావాయు వంటదో యెట్లు దాని, |
అంట జాలక భూతము లన్ని గూడ, |
వెలయునా లోన నట్టులే, తెలియు మీవు |
|
|
|
7. |
భూతములు నెల్ల కుం తీసు పుత్ర నాదు |
ప్రకృతిని గలయుచుండు క ల్పాంతమందు, |
మరల నవ్వాని నెల్ల నా మాయ చేత, |
వఱల సృష్టిని జేతు క ల్పాది యందు |
|
|
|
8. |
నాదు ప్రకృతిని నాయధీ నమున నుంచి |
వాసనల చేత ప్రకృతికి వశ్యమైన, |
యిందుగల భూతజాలము నెల్లపార్థ! |
మాటి మాటికి జేతు నే మహిత సృష్టి |
|
|
|
9. |
కర్మకర్తృత్వమును, ఫలా కాంక్ష లేక, |
యూరక నుపేక్షకుని భంగి నుండు నన్ను, |
సృష్టి లయముల కర్జునా! హేతువైన, |
కర్మపాశము లేవియు కట్టలేవు |
|
|
|
10. |
సాక్షిమాత్రుడ, నాయధి వీక్షణమున, |
యీ చరాచర సృష్టి ప్ర కృతియె సల్పు, |
ఇట్టి హేతువు చేతనే బుద్ధ చరిత! |
వివిధరూపములై పర్వు విశ్వ మెల్ల |
|
|
|
11. |
సర్వభూతములకు మహే శ్వరుడ నేను, |
మనుజశారీర ధారి నై మసలు చుంట, |
పరమరూపము నాది వా రరయ లేక, |
లెక్క సేయరు భువి నన్ను వెక్కలీండ్రు |
|
|
|
12. |
వ్యర్థకాములు, వ్యర్థ క ర్మాభి రతులు, |
నిష్ఫలజ్ఞానులును, గడు నీచమతులు |
అసుర రాక్షస భావము లాశ్రయించి, |
అవగణింతురు నన్ను మో హమును బొంది |
|
|
|
13. |
కాని, నన్ను మహాత్ములు కౌరవేంద్ర! |
అమల దైవస్వభావము నాశ్రయించి |
అవ్యయుడ భూతముల కాది నని, గ్రహించి, |
ఇతర చింతన లేక భ జింత్రు నన్నె |
|
|
|
14. |
సతత సంకీర్తనము నన్ను సలుపు వారు, |
చేరగా నన్ను ధృఢయత్న శీలురగుచు |
భక్తితో నాకు బ్రీతిమై ప్రణతు లిడుచు, |
నిత్యమును పర్యుపాసింత్రు నిష్ఠతోడ |
|
|
|
15. |
జ్ఞానయజ్ఞము చేత నొ క్కరుడ ననియు, |
భిన్నదేవతామూర్తులవెలయు దనియు, |
బహువిధంబుల కొందఱు భక్తి తోడ, |
పూజ యొనరింత్రు విశ్వతో ముఖుని నన్ను |
|
|
|
16. |
నేనె క్రతువును యజ్ఞము నేనె సుమ్ము, |
నేనె స్వధయును నౌషధ మైన నేనె, |
యజ్ఞమంత్రము నేనె యా జ్యంబు నేనె, |
అగ్నియును వేల్చుహోమము లైన నేనె |
|
|
|
17. |
తండ్రి నే పార్థ! యీ జగ త్సంత తికిని, |
తల్లియును, కర్మఫలదాత తాత నేను, |
వేద్యమును, ప్రణవమును, ప విత్రమేను, |
ఋగ్యజుస్సామ వేదము లెల్ల నేను |
|
|
|
18. |
ప్రభుడ, సాక్షిని, గతియును, భర్త నేను, |
శరణమును, సుహృదుడ, నివా సమును నేను, |
జగతి కుత్పత్తి విలయ సం స్థాన మేను, |
పెన్నిధిని నేన, యవ్యయ బీజ మేన |
|
|
|
19. |
వెలయ గాయింతు నెండ నీ విశ్వమంత, |
జలము గ్రహియింతు, నిత్తు వ ర్షముల నేను |
మృత్యువైనను నేనె, య మృతము నేనె, |
అర్జునా! నేనె సదసత్తు లైన వెల్ల |
|
|
|
20. |
సోమపానపునీతులు శ్రోత్రియులును, |
స్వర్గ మర్థించి కొల్చి య జ్ఞముల నన్ను, |
పుణ్యఫలమైన స్వర్లోక మునకు నేగి, |
అమరభోగములను దివి ననుభవింత్రు |
|
|
|
21. |
విపుల సురభోగములను సే వించి వారు, |
క్షీణ పుణ్యులునై తిర్గి క్షితికి వత్త్రు, |
ఇట్లు వేదధర్మము లాశ్ర యించు నట్టి, |
కామ్యకర్ము లీ రాక పోకల చరింత్రు |
|
|
|
22. |
అన్యచింతన సేయక ననవరతము, |
ఏ జనులు నన్ను పర్యుపా సించు చుంద్రొ, |
నిత్యమట్లు సమాధిలో నిలుచువారి |
యోగసంక్షేమముల బూని యుందు నేను |
Play This Verse |
|
|
23. |
అన్యదేవతాభక్తులే యైన గాని, |
శ్రద్ధతో పూజ లెవ్వరు సలుపు వారొ, |
వారలును గూడ కుంతీ కు మార నన్నె, |
పూజగొను వారె విధిహీన పూర్వకముగ |
|
|
|
24. |
సకలయజ్ఞకర్మములకు సాక్షి నేను, |
భోక్తయును నేనె, మఱియు ప్ర భుండ నేనె |
వారు నాతత్త్వ మెఱుగకు న్నారు గాన, |
కూలు చుందురు సంసార కూపమందు |
|
|
|
25. |
దేవతల జేరుకొందురు దేవయజులు, |
పితరులను జేరుకొందురు పితరయజులు, |
భూతముల జేరుకొందురు భూతయజులు, |
నాదు భక్తులు వత్తురు నన్నె చేర |
|
|
|
26. |
పత్రమో, పుష్పమో, లేక ఫలమొ, జలమొ, |
భక్తితో నాకు నెవ్వ డ ర్పణము సేయు, |
నట్టి శుద్ధాత్మ భక్తి స మర్పితమును, |
అరమరలు లేక నే బ్రీతి నారగింతు |
|
|
|
27. |
ఎట్టి కర్మము సేయుదో యేది తినెదొ |
ఏది వేల్తువో, యే దాన మిచ్చుచుందొ, |
ఎట్టి తప మాచరింతువో యుద్ధచరిత! |
అట్టి వెల్ల నాకిమ్ము బ్ర హ్మార్పణమని |
|
|
|
28. |
కలుగు నీ శుభాశుభ కర్మ ఫలము లనెడు |
బంధముల నుండి మోక్షము బడసి యిట్లు |
కర్మసన్యాస యోగ యు క్తాత్ముడవయి, |
పొందెదవు నన్నె కర్మ వి ముక్తి బొంది |
|
|
|
29. |
సర్వభూతములందు నే సమత నుందు, |
లేడు ద్వేషియు మఱి నాకు లేడు ప్రియుడు, |
భక్తితో నన్ను భజియించు వార లెవరొ, |
వారలం దుందు నాయందు వార లుంద్రు |
|
|
|
30. |
ఎట్టి దుర్మార్గుడైన కా నిమ్ము వాడు |
ఎవ్వ డనితరభక్తి సే వించు నన్ను |
సాధువే యని వాని నెం చంగ వలయు, |
అతడు నిశ్చయ బుద్ధితో నలరు గాన |
|
|
|
31. |
ఆ దురాచారి పరగ ధ ర్మాత్ము డగుచు, |
శాశ్వతంబైన శాంతిని చక్క బొందు, |
నాదు ప్రియభక్తు డెన్నడు నష్టపడడు |
తెలియు మిది నా ప్రతిజ్ఞ కుం తీ కుమార! |
|
|
|
32. |
పాపసంభవులైన పా పాత్ములైన |
స్త్రీలు, వైశ్యులు, శూద్రజా తీయులైన, |
నెవ్వరేనియు,నన్నాశ్రయించు చుంద్రొ |
వారలును గూడ కొందు రా పరమపదము |
|
|
|
33. |
వారి నిట్లన, పుణ్యుల బ్రాహ్మణులను |
భక్తరాజర్షులను గూర్చి పలుక నేల, |
క్షణికమౌ నిట్టి యసుఖ లో కమున నీవు, |
పుట్టియును నన్ను భజియించి పొంద గలవు |
|
|
|
34. |
నన్నె మదినిల్పు,భక్తిమైనన్నె కొల్చుడీ, |
నన్నె పూజింపు సాగిలినన్నె మ్రొక్కు |
మత్పరత నాత్మ నిట్లు స మాధి లోన, |
చేర్చి యుంచుము, యిక నన్నె చేర గలవు |
|
|
|
|
|
1. శ్రీభగవానువాచ: |
ఇదం తు తే గుహ్యతమం |
ప్రవక్ష్యామ్యనసూయవే |
జ్ఞానం విజ్ఞానసహితం |
యజ్జ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్ ౯ |
|
|
|
2. |
రాజవిద్యా రాజగుహ్యం |
పవిత్రమిదముత్తమమ్ |
ప్రత్యక్షావగమం ధర్మ్యం |
సుసుఖం కర్తుమవ్యయమ్ ౯ |
|
|
|
3. |
అశ్రద్దధానాః పురుషా |
ధర్మస్యాస్య పరన్తప |
అప్రాప్య మాం నివర్తన్తే |
మృత్యుసంసారవర్త్మని ౯ |
|
|
|
4. |
మయా తతమిదం సర్వం |
జగదవ్యక్తమూర్తినా |
మత్స్థాని సర్వభూతాని |
న చాహం తేష్వవస్థితః ౯ |
|
|
|
5. |
న చ మత్స్థాని భూతాని |
పశ్య మే యోగమైశ్వరమ్ |
భూతభృన్న చ భూతస్థో |
మమాత్మా భూతభావనః ౯ |
|
|
|
6. |
యథాకాశస్థితో నిత్యం |
వాయుః సర్వత్రగో మహాన్ |
తథా సర్వాణి భూతాని |
మత్స్థానీత్యుపధారయ ౯ |
|
|
|
7. |
సర్వభూతాని కౌన్తేయ |
ప్రకృతిం యాన్తి మామికామ్ |
కల్పక్షయే పునస్తాని |
కల్పాదౌ విసృజామ్యహమ్ ౯ |
Play This verse |
|
|
8. |
ప్రకృతిం స్వామవష్టభ్య |
విసృజామి పునః పునః |
భూతగ్రామమిమం కృత్స్న |
మవశం ప్రకృతేర్వశాత్ ౯ |
|
|
|
9. |
న చ మాం తాని కర్మాణి |
నిబధ్నన్తి ధనంజయ |
ఉదాసీనవదాసీన |
మసక్తం తేషు కర్మసు ౯ ౯ |
|
|
|
10. |
మయాధ్యక్షేణ ప్రకృతిః |
సూయతే సచరాచరమ్ |
హేతునానేన కౌన్తేయ |
జగద్విపరివర్తతే ౯ ౦ |
|
|
|
11. |
అవజానన్తి మాం మూఢా |
మానుషీం తనుమాశ్రితమ్ |
పరం భావమజానన్తో |
మమ భూతమహేశ్వరమ్ ౯ |
|
|
|
12. |
మోఘాశా మోఘకర్మాణో |
మోఘజ్ఞానా విచేతసః |
రాక్షసీమాసురీం చైవ |
ప్రకృతిం మోహినీం శ్రితాః ౯ |
|
|
|
13. |
మహాత్మానస్తు మాం పార్థ |
దైవీం ప్రకృతిమాశ్రితాః |
భజన్త్యనన్యమనసో |
జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్ ౯ |
|
|
|
14. |
సతతం కీర్తయన్తో మాం |
యతన్తశ్చ దృఢవ్రతాః |
నమస్యన్తశ్చ మాం భక్త్యా |
నిత్యయుక్తా ఉపాసతే ౯ |
|
|
|
15. |
జ్ఞానయజ్ఞేన చాప్యన్యే |
యజన్తో మాముపాసతే |
ఏకత్వేన పృథక్త్వేన |
బహుధా విశ్వతోముఖమ్ ౯ |
|
|
|
16. |
అహం క్రతురహం యజ్ఞః |
స్వధాహమహమౌషధమ్ |
మన్త్రోఽహమహమేవాజ్య |
మహమగ్నిరహం హుతమ్ ౯ |
|
|
|
17. |
పితాహమస్య జగతో |
మాతా ధాతా పితామహః |
వేద్యం పవిత్రమోంకార |
ఋక్సామ యజురేవ చ ౯ |
|
|
|
18. |
గతిర్భర్తా ప్రభుః సాక్షీ |
నివాసః శరణం సుహృత్ |
ప్రభవః ప్రలయః స్థానం |
నిధానం బీజమవ్యయమ్ ౯ |
|
|
|
19. |
తపామ్యహమహం వర్షం |
నిగృహ్ణామ్యుత్సృజామి చ |
అమృతం చైవ మృత్యుశ్చ |
సదసచ్చాహమర్జున ౯ ౯ |
|
|
|
20. |
త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా |
యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయన్తే |
తే పుణ్యమాసాద్య సురేన్ద్రలోక |
మశ్నన్తి దివ్యాన్దివి దేవభోగాన్ ౯ ౦ |
|
|
|
21. |
తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం |
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి |
ఏవం త్రయీధర్మమనుప్రపన్నా |
గతాగతం కామకామా లభన్తే ౯ |
|
|
|
22. |
అనన్యాశ్చిన్తయన్తో మాం |
యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం |
యోగక్షేమం వహామ్యహమ్ ౯ |
Play This verse |
|
|
23. |
యేఽప్యన్యదేవతాభక్తా |
యజన్తే శ్రద్ధయాన్వితాః |
తేఽపి మామేవ కౌన్తేయ |
యజన్త్యవిధిపూర్వకమ్ ౯ |
|
|
|
24. |
అహం హి సర్వయజ్ఞానాం |
భోక్తా చ ప్రభురేవ చ |
న తు మామభిజానన్తి |
తత్త్వేనాతశ్చ్యవన్తి తే ౯ |
|
|
|
25. |
యాన్తి దేవవ్రతా దేవా |
న్పితౄన్యాన్తి పితృవ్రతాః |
భూతాని యాన్తి భూతేజ్యా |
యాన్తి మద్యాజినోఽపి మామ్ ౯ |
|
|
|
26. |
పత్రం పుష్పం ఫలం తోయం |
యో మే భక్త్యా ప్రయచ్ఛతి |
తదహం భక్త్యుపహృత |
మశ్నామి ప్రయతాత్మనః ౯ |
Play This verse |
|
|
27. |
యత్కరోషి యదశ్నాసి |
యజ్జుహోషి దదాసి యత్ |
యత్తపస్యసి కౌన్తేయ |
తత్కురుష్వ మదర్పణమ్ ౯ |
|
|
|
28. |
శుభాశుభఫలైరేవం |
మోక్ష్యసే కర్మబన్ధనైః |
సంన్యాసయోగయుక్తాత్మా |
విముక్తో మాముపైష్యసి ౯ |
|
|
|
29. |
సమోఽహం సర్వభూతేషు |
న మే ద్వేష్యోఽస్తి న ప్రియః |
యే భజన్తి తు మాం భక్త్యా |
మయి తే తేషు చాప్యహమ్ ౯ ౯ |
|
|
|
30. |
అపి చేత్సుదురాచారో |
భజతే మామనన్యభాక్ |
సాధురేవ స మన్తవ్యః |
సమ్యగ్వ్యవసితో హి సః ౯ ౦ |
|
|
|
31. |
క్షిప్రం భవతి ధర్మాత్మా |
శశ్వచ్ఛాన్తిం నిగచ్ఛతి |
కౌన్తేయ ప్రతి జానీహి |
న మే భక్తః ప్రణశ్యతి ౯ |
|
|
|
32. |
మాం హి పార్థ వ్యపాశ్రిత్య |
యేఽపి స్యుః పాపయోనయః |
స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తేఽ |
పి యాన్తి పరాం గతిమ్ ౯ |
|
|
|
33. |
కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా |
భక్తా రాజర్షయస్తథా |
అనిత్యమసుఖం లోక |
మిమం ప్రాప్య భజస్వ మామ్ ౯ |
|
|
|
34. |
మన్మనా భవ మద్భక్తో |
మద్యాజీ మాం నమస్కురు |
మామేవైష్యసి యుక్త్వైవ |
మాత్మానం మత్పరాయణః ౯ |
Play This verse |
|
|
|